లండన్: భారత్,న్యూజిలాండ్ మధ్య ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌పై భారీ అంచనాలు మొదలయ్యాయి. పలువురు టీమిండియానే విజయం సాధిస్తుందనే ధీమా వ్యక్తం చేస్తుంటే, మరికొంతమంది న్యూజిలాండ్‌దే కప్ అని అభిప్రాయపడుతున్నారు. కాగా, టెస్ట్ ఛాంపియన్‌షిప్ లోనూ, ఆ తర్వాత జరగనున్న తమ జట్టుతో జరగబోయే ఐదు టెస్టుల సిరీస్‌లోనూ టీమిండియా తిరుగులేని విజయం సాధిస్తుందని ఇంగ్లండ్ మాజీ వెటరన్ స్పిన్నర్ మాంటే పనేసర్ జోస్యం చెప్పాడు. భారత్, న్యూజిలాండ్ మధ్య జూన్ 18 నుంచి 23 వరకూ ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
విరాట్ కోహ్లి కెప్టెన్సీలోని భారత టెస్టు జట్టు.. అక్కడ సౌతాంప్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జూన్ 18 నుంచి 23 వరకూ ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో తలపడి.. ఆ తర్వాత ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 10 వరకు ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో ఢీకొట్టబోతోంది.
ఇంగ్లండ్ తో జరిగే రెండు టెస్టుల సిరీస్ కోసం న్యూజిలాండ్ ఇప్పటికే యూకే కు చేరుకుందని ,జూన్ మొదటి వారంలో భారత జట్టు వచ్చి చేరుతుందని తెలిపాడు. ఇటీవల మార్చిలో భారత్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ స్పిన్ ఆడలేకపోవడం తమను ఎప్పుడూ వెంటాడుతున్న ప్రధాన సమస్య అని పనేసర్ అభిప్రాయపడ్డాడు.
ఆగస్టులో ఇంగ్లండ్ పిచ్‌ల నుంచి టర్న్ లభిస్తుంటుంది. అదే జరిగితే ఇంగ్లండ్ ని ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ 5-0తో క్లీన్‌స్వీప్ చేస్తుంది.ఇంగ్లండ్ టాప్ ఆర్డర్‌లో కెప్టెన్ జో రూట్ మినహా ఎవరూ స్పిన్‌ని సమర్థంగా ఎదుర్కోలేరు.ఇక న్యూజిలాండ్‌తో ఫైనల్ మ్యాచ్ గ్రీన్ పిచ్‌పై జరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ టీమిండియానే ఫేవరెట్ అని పనేసర్ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియాని దాని సొంతగడ్డపైనే ఈ ఏడాది ఆరంభంలో 2-1 తేడాతో టెస్టు సిరీస్‌లో ఓడించిన టీమిండియా.. ఆ తర్వాత ఇంగ్లండ్‌ని 3-1తో చిత్తుగా ఓడించేసింది..ఆ ఉత్సాహంలో ఉన్న భారత్ జట్టు తప్పక విజయం సాధిస్తుందని పనేసర్ అభిప్రాయ పడ్డాడు.
(చదవండి:నెటిజన్లను ఆకర్షిస్తున్న సంజన డాన్స్ వీడియో)
Comments
Please login to add a commentAdd a comment