Test Championship
-
WTC ఫైనల్ కోహీ VS గిల్
-
ఇండియాకి ఒక్క సెషన్ చాలు రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు
-
WTC ఫైనల్ ఎవరి బలం ఎంత ?
-
టీ - 20 అయినా... టెస్ట్ అయినా ఒకటే ఆసీస్ కి రహానే స్వీట్ వార్నింగ్..
-
టీమ్ ఇండియా రబ్బరు బంతులతో ప్రాక్టీస్... ఎందుకంటే?
-
శుభమన్ గిల్ ని ఆపడం కష్టమే ఒప్పుకున్నా గ్రేగ్ చాపెల్
-
ఆ ఒక్కడిని అవుట్ చెయ్యకపోతే ఇండియా పని అంతే
-
డబ్ల్యూటీసీ ఫైనల్లో వికెట్ల వెనుక మనోడే
విశాఖ స్పోర్ట్స్: ప్రపంచ టెస్ట్ క్రికెట్ చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) టైటిల్ పోరులో భారత్ జట్టు వికెట్ కీపర్‌గా విశాఖకు చెందిన కె.ఎస్.భరత్ ఎంపికయ్యాడు. ప్రస్తుత సీజన్లో తొలిసారిగా టెస్ట్ క్రికెట్లో ఆరంగేట్రం చేసిన ఈ 30 ఏళ్ల కీపర్ బ్యాటర్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు టెస్ట్‌లు ఆడాడు. ఇవన్నీ భారత్‌లోనే జరిగాయి. కానీ విదేశీ గడ్డపై జరగనున్న ఈ చాంపియన్‌ప్‌లో ఆడేందుకు సెకండ్ ఫ్రంట్‌లైన్ వికెట్‌కీపర్‌గా ఉన్న భరత్‌కు అనూహ్యంగా అవకాశం అందివచ్చింది. పంత్ గాయపడి అందుబాటులో లేకపోవడంతో బీసీసీఐ మంగళవారం ప్రకటించిన భారత్ 15వ మెంబర్ స్క్వాడ్‌లో వికెట్‌కీపర్‌గా అవకాశం దక్కింది. అయితే జట్టులో మరో వికెట్‌కీపర్ బ్యాటర్ కె.ఎల్.రాహుల్ ఉన్నా.. వికెట్ల వెనుక భరతే నిలిచే అవకాశాలు ఉన్నాయి. లండన్‌లో జూన్ 7 నుంచి 11వ తేదీ వరకు జరిగే టైటిల్ పోరులో ఆ్రస్టేలియాతో భారత్ తలపడనుంది. భారత్ వేదికగా బోర్డర్ గవాస్కర్ సిరీస్ ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైంది. మొదటి టెస్ట్‌లో భరత్ తొలి స్టంపౌట్‌గా లబుషేన్‌ను వెనక్కి పంపాడు. సిరీస్‌లో భాగంగా నాలుగు మ్యాచ్‌ల్లో తొలి టెస్ట్‌లో ఓ స్టంపౌట్, ఓ క్యాచ్ పట్టిన భరత్.. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో ఆరు క్యాచ్‌లు పట్టాడు. నాలుగో టెస్ట్‌లో 44 పరుగుల కెరీర్ బెస్ట్ స్కోర్‌తో మొత్తంగా 101 పరుగులు చేశాడు. ఆరో స్థానంలో వచ్చి 67, ఏడో స్థానంలో వచ్చి 26, ఎనిమిదో స్థానంలో వచ్చి 8 పరుగులు చేశాడు. -
ఒక్క మ్యాచ్‌తో ప్రపంచ చాంపియనా: విరాట్ కోహ్లి
సౌతాంప్టన్: ప్రపంచ టెస్టు చాంపియన్‌ను నిర్ధారించేందుకు ఒక ఫైనల్ మ్యాచ్ సరిపోదని, బెస్టాఫ్ త్రీ ఫైనల్స్‌లోనే అత్యుత్తమ జట్టు ఏదో తేలుతుందని భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అన్నాడు. బుధవారం మ్యాచ్ ముగిసిన అనంతరం అతను మీడియాతో ముచ్చటించాడు. ‘నేను చెప్పేదొకటే... ఒక్క మ్యాచ్‌తో ప్రపంచ అత్యుత్తమ జట్టు ఏదో ఖరారు చేయలేం! ఇది ఎంత మాత్రం సమంజసంగా లేదు. దీన్ని నేను అంగీకరించను కూడా. ఇది టెస్టు చాంపియన్‌షిప్ అయితే ఇందుకు తగినట్లే సిరీస్ ఉండాలి. అంటే మూడు మ్యాచ్‌ల సిరీస్ నిర్వహించాలి. అప్పుడే ఒక మ్యాచ్‌లో విఫలమైన జట్టు మరో మ్యాచ్‌లో ముందంజ వేస్తుందో లేదో తెలుస్తుంది. అలా సిరీస్ అసాంతం బాగా ఆడిన జట్టే ప్రపంచ టెస్టు విజేత అవుతుంది’ అని కోహ్లి వివరించాడు. మూడు మ్యాచ్‌ల ద్వారా టెస్టు ఫార్మాట్ అసలైన పోరాటం ఏంటో కూడా అర్థమవుతుందని, ఒక మ్యాచ్‌లో వెనుకబడినా... ఇంకో మ్యాచ్‌లో పుంజుకునే అవకాశం ఇరుజట్లకూ ఉంటుందని, చివరకు అత్యుత్తమ జట్టే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)ని కైవసం చేసుకుంటుందని కోహ్లి విశ్లేషించాడు. తప్పులు సరిదిద్దుకునేందుకు, వ్యూహాలకు పదును పెట్టేందుకు బెస్టాఫ్ త్రీ ఫైనల్ సిరీస్ దోహదం చేస్తుందని అతను అభిప్రాయపడ్డాడు. అంతర్జా తీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఈ విషయంపై కసరత్తు చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి సిరీస్ సాకారమయ్యేందుకు కచ్చితంగా కృషి చేయాలని భారత కెప్టెన్ సూచించాడు. తాము ఓడినందుకే ఇలాంటి సూచనలు చేయడం లేదని సంప్రదాయ క్రికెట్‌కు సరైన ప్రామాణికతను తీసుకొచ్చేందుకే ఆ దిశగా ఆలోచించాలని కోరుతున్నట్లు చెప్పాడు. మాకెందుకు బాధ ఒక్క మ్యాచ్‌లో ఓడిపోయినంత మాత్రాన దిగులు చెందాల్సిన పనిలేదని కోహ్లి అన్నాడు. ‘ఈ ఓటమిపై అంతగా బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేం మూణ్నాలుగు ఏళ్లుగా ఓ టెస్టు జట్టుగా నాణ్యమైన ఆట ఆడుతూ వచ్చాం. ఈ ప్రయాణంలో గెలుపోటములే కాదు... ఎన్నో మధురానుభూతులు మూటగట్టుకున్నాం. ఎదురైన సవాళ్లను ఎత్తుగడలతో అధిగమించాం. అలాంటి మా జట్టు కివీస్ చేతిలో... అదికూడా ఒకే ఒక్క మ్యాచ్‌లో ఓడితే ఇన్నాళ్లు మేం సాధించిందంతా దిగదుడుపేం కాదు. జట్టు సామర్థ్యాన్ని ఈ పరాజయం తక్కువ చేయనే చేయదు’ అని కోహ్లి అన్నాడు. సమర్థమైన జట్టు కోసం... సమర్థవంతమైన టెస్టు జట్టు కోసం సరైనోళ్లను జట్టులోకి తీసుకొస్తామని కోహ్లి చెప్పాడు. జట్టులో చెప్పుకోదగ్గ మార్పులుంటా యని నాయకుడు స్పష్టంగా చెప్పాడు. ‘జట్టు, ఆటతీరుపై సమీక్షించుకుంటాం. గడ్డు పరిస్థితు లెదురైనా... ఎలాంటి వాతావరణంలోనైనా, ఎంతటి క్లిష్ట బంతులయినా ఆడగలిగే జట్టుగా టీమిండియాను తయారు చేసుకుంటాం. ఇందుకోసం ఎక్కువ సమయం తీసుకోం. వెంటనే చర్యలు ప్రారంభిస్తాం. పటిష్టమైన జట్టుగా మారుస్తాం. సంప్రదాయ ఫార్మాట్‌కు సరిగ్గా సరిపోయే ఆటగాళ్లను, సరైన దృక్పథంతో ఆడగలిగే సమర్థులను జట్టులోకి తీసుకుంటాం’ అని అన్నాడు. -
విజేత టీమిండియానే: పనేసర్
లండన్: భారత్,న్యూజిలాండ్ మధ్య ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌పై భారీ అంచనాలు మొదలయ్యాయి. పలువురు టీమిండియానే విజయం సాధిస్తుందనే ధీమా వ్యక్తం చేస్తుంటే, మరికొంతమంది న్యూజిలాండ్‌దే కప్ అని అభిప్రాయపడుతున్నారు. కాగా, టెస్ట్ ఛాంపియన్షిప్ లోనూ, ఆ తర్వాత జరగనున్న తమ జట్టుతో జరగబోయే ఐదు టెస్టుల సిరీస్‌లోనూ టీమిండియా తిరుగులేని విజయం సాధిస్తుందని ఇంగ్లండ్ మాజీ వెటరన్ స్పిన్నర్ మాంటే పనేసర్ జోస్యం చెప్పాడు. భారత్, న్యూజిలాండ్ మధ్య జూన్ 18 నుంచి 23 వరకూ ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. విరాట్ కోహ్లి కెప్టెన్సీలోని భారత టెస్టు జట్టు.. అక్కడ సౌతాంప్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జూన్ 18 నుంచి 23 వరకూ ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో తలపడి.. ఆ తర్వాత ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 10 వరకు ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో ఢీకొట్టబోతోంది. ఇంగ్లండ్ తో జరిగే రెండు టెస్టుల సిరీస్ కోసం న్యూజిలాండ్ ఇప్పటికే యూకే కు చేరుకుందని ,జూన్ మొదటి వారంలో భారత జట్టు వచ్చి చేరుతుందని తెలిపాడు. ఇటీవల మార్చిలో భారత్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ స్పిన్ ఆడలేకపోవడం తమను ఎప్పుడూ వెంటాడుతున్న ప్రధాన సమస్య అని పనేసర్ అభిప్రాయపడ్డాడు. ఆగస్టులో ఇంగ్లండ్ పిచ్‌ల నుంచి టర్న్ లభిస్తుంటుంది. అదే జరిగితే ఇంగ్లండ్ ని ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ 5-0తో క్లీన్‌స్వీప్ చేస్తుంది.ఇంగ్లండ్ టాప్ ఆర్డర్లో కెప్టెన్ జో రూట్ మినహా ఎవరూ స్పిన్ని సమర్థంగా ఎదుర్కోలేరు.ఇక న్యూజిలాండ్‌తో ఫైనల్ మ్యాచ్ గ్రీన్ పిచ్‌పై జరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ టీమిండియానే ఫేవరెట్ అని పనేసర్ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియాని దాని సొంతగడ్డపైనే ఈ ఏడాది ఆరంభంలో 2-1 తేడాతో టెస్టు సిరీస్‌లో ఓడించిన టీమిండియా.. ఆ తర్వాత ఇంగ్లండ్‌ని 3-1తో చిత్తుగా ఓడించేసింది..ఆ ఉత్సాహంలో ఉన్న భారత్ జట్టు తప్పక విజయం సాధిస్తుందని పనేసర్ అభిప్రాయ పడ్డాడు. (చదవండి:నెటిజన్లను ఆకర్షిస్తున్న సంజన డాన్స్ వీడియో) -
ఆ టోర్నీ షెడ్యూల్లో మార్పులేదు: ఐసీసీ
దుబాయ్: కరోనా కారణంగా క్రికెట్‌కు ఆటంకం కలిగినా... ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ తేదీల్లో ఎలాంటి మార్పు ఉండదని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) స్పష్టం చేసింది. గతంలో ప్రకటించిన విధంగా వచ్చే ఏడాది జూన్‌లోనే దీనిని నిర్వహిస్తామని ప్రకటించింది. కోవిడ్–19 కారణంగా పలు టెస్టు సిరీస్‌లు రద్దయినా ఐసీసీ దీనిపై పునరాలోచన చేయడం లేదు. ‘ఇప్పటి వరకైతే టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ తేదీల్లో మార్పు లేదు. అయితే పాయింట్ల కేటాయింపు విషయంలో మార్పులు అవసరమైతే దానిపై దృష్టి పెడతాం. త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటాం’ అని ఐసీసీ అధికార ప్రతినిధి చెప్పారు. షెడ్యూల్ ప్రకారం టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా టాప్–9 జట్లు ఒక్కొక్కటి కనీసం ఆరు సిరీస్‌ల చొప్పున ఆడాల్సి ఉంది. అయితే భారత్, ఇంగ్లండ్ మాత్రమే నాలుగేసి సిరీస్‌లు ఆడగా, ఆస్ట్రేలియా మూడు సిరీస్‌లలో పాల్గొంది. (చదవండి: ధోనిపై విమర్శలకు, ఫ్యాన్ సమాధానం) -
‘భారత్‌తో డబ్యూటీసీ వద్దు.. యాషెస్ పెట్టండి’
సిడ్నీ: కరోనా వైరస్ సంక్షోభం ముగిసిన తర్వాత కొంతకాలం పాటు వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(డబ్యూటీసీ)ను నిలిపివేయాలని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ విన్నవించాడు. ఎటువంటి మజా లేని టెస్టు చాంపియన్‌షిప్‌ను కొన్ని రోజులు ఆపేస్తే మంచిదన్నాడు. ఆ స్థానంలో ఆసక్తికర సిరీస్‌లను రీషెడ్యూల్ చేయాలంటూ అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)కి విజ్ఞప్తి చేశాడు. ‘ ప్రేక్షకులు పోటీ క్రికెట్‌ను కోరుకుంటున్నారు. కరోనా సంక్షోభంతో ఇప్పటికే చాలా క్రికెట్ వృథా అయ్యింది. దాంతో టెస్టు చాంపియన్‌షిప్‌కు కూడా బ్రేక్ ఇవ్వండి. టెస్టు చాంపియన్‌షిప్ జరగాల్సిన మ్యాచ్‌ల స్థానంలో కాంపిటేటివ్ క్రికెట్‌ను నిర్వహించండి. ఈ సీజన్ చివరలో ఆస్ట్రేలియా పర్యటనకు భారత్ రావాల్సి ఉంది. ఇది టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగమే. అయితే ఈ సిరీస్ వద్దు.. దాని స్థానంలో ఆస్ట్రేలియా-ఇంగ్లండ్‌ల యాషెస్‌కు సన్నాహాలు చేస్తే మంచిది. అదే సమయంలో భారత్-పాకిస్తాన్ల మధ్య టెస్టు సిరీస్‌ను కూడా ఏర్పాటు చేయండి. నాలుగు టెస్టుల సిరీస్‌ను ఏర్పాటు చేసి రెండు టెస్టులు భారత్‌లో ,మరో రెండు టెస్టులు పాకిస్తాన్లో జరిగేలా షెడ్యూల్‌ను రూపొందించండి. (‘ఆసీస్‌తో టీమిండియాను పోల్చలేం’) ఇంగ్లండ్-ఆసీస్‌ల యాషెస్ సిరీస్‌తో పాటు భారత్-పాకిస్తాన్ల సిరీస్‌లు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతాయి. కోవిడ్-19 సంక్షోభం తర్వాత ప్రేక్షకుడి సరైన క్రికెట్‌ను అందించాలంటే ఇదొక్కటే మార్గం. అభిమానులకు మరింత వినోదం పంచాలంటే పోటీ క్రికెట్ చాలా అవసరం. ఇక్కడ టెస్టు చాంపియన్‌షిప్‌ను వాయిదా వేసి ప్రేక్షకుడి కోణంలో ఆలోచించండి’ అని హాగ్ పేర్కొన్నాడు. అంతకుముందు పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ కూడా భారత్-పాకిస్తాన్ల ద్వైపాక్షిక సిరీస్ నిర్వహించాలనే కోరిన సంగతి తెలిసిందే. కోవిడ్-19 నివారణ చర్యల్లో భాగంగా నిధుల సేకరణకు భారత్-పాక్‌ల సిరీస్ ఒక్కటే మార్గమన్నాడు. దీనిని భారత దిగ్గజ ఆటగాడు కపిల్‌దేవ్ అప్పుడే ఖండించాడు. నిధుల సేకరణ కోసం భారత్-పాక్‌ల సిరీస్‌ల జరపాలన్న అక్తర్ ప్రతిపాదన ఎంతమాత్రం సరికాదన్నాడు. అసలు అవసరమే లేదని కపిల్ తేల్చిచెప్పాడు. కాగా, భారత్-పాకిస్తాన్ల మధ్య ఒక ద్వైపాక్షిక సిరీస్ జరిగి దాదాపు ఏడేళ్లు అవుతుంది. 2012-13 సీజన్లో ఇరు జట్లు ద్వైపాక్షిక సిరీస్‌లో చివరిసారి తలపడ్డాయి. ఆపై ఇరు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ పరిస్థితులు కారణంగా క్రికెట్ సిరీస్‌లకు బ్రేక్ పడింది. (‘ధోనికి చాలా సిగ్గు.. ఆ తర్వాతే మారాడు’) -
‘ఆ చాంపియన్‌షిప్ గడువు పెంచండి’
లాహోర్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్వహిస్తున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్యూటీసీ) నిర్ణీత షెడ్యూల్లో జరపడం సాధ్యం కాకపోతే దాన్ని పొడిగించి పూర్తి స్థాయిలో మ్యాచ్‌లు జరిగేలా చూడాలని పాకిస్తాన్ టెస్టు కెప్టెన్ అజహర్ అలీ పేర్కొన్నాడు. పాకిస్తాన్ క్రికెట్ చీఫ్ సెలక్టర్ మిస్బావుల్ హక్ ఇప్పటికే ఈ ప్రతిపాదనను తెరపైకి తీసుకురాగా, దానికి అజహర్ అలీ కూడా మద్దతు తెలిపాడు. ప్రస్తుత పరిస్థితుల్లో క్రికెట్ గురించి ఆలోచించడం సరైనది కాదని, అయితే ఒక్కసారి సాధారణ స్ధితికి వస్తే క్రికెట్‌పై ఆసక్తి పెరుగుతుందన్నాడు. ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌లు నిర్వహించినా తమకు సమ్మతమేని అజహర్ స్పష్టం చేశాడు. (మాకు ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండేది కాదు..!) ‘ప్రస్తుతం ఎటువంటి స్పోర్ట్స్ ఈవెంట్ టీవీలు రావడం లేదు. మళ్లీ టీవీల్లో క్రీడా ఈవెంట్లుప్రసారమైతే ప్రజలు కచ్చితంగా సంతోషంగా ఉంటారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం కంటే ఏదీ ఎక్కువ కాదు. ఐసీసీ నిర్వహించే వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ చాలా సుదీర్ఘమైనది. దీనిపై ఐసీసీ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముందస్తు షెడ్యూల్‌ను పొడిగిస్తేనే మంచిది. ఒక సుదీర్ఘ షెడ్యూల్‌ను పొడిగించడం కష్టమే. కానీ తప్పదు.టెస్టు చాంపియన్‌షిప్‌ను పొడిగించడానికే నా ఓటు’ అని అజహర్ అలీ తెలిపాడు. గతేడాది ఆగస్టులో వరల్డ్‌టెస్టు చాంపియన్‌షిప్ మొదలవుతుంది. ప్రస్తుత్తం టెస్ట్ క్రికెట్లో టాప్–9లో ఉన్న జట్ల మధ్య స్వదేశీ, విదేశీ సిరీస్ లతో సాగే ఈ మెగా టోర్నమెంట్ 2021 లో ముగుస్తుంది. రెండేళ్లలో 71 మ్యాచు లు, 27 సిరీస్‌లు జరుగుతాయి. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్ ఆడతాయి. ఇంగ్లండ్‌లో 2021, జూన్‌లో ఫైనల్ మ్యాచ్ నిర్వహించడానికి ఐసీసీ షెడ్యూల్‌ను ఖరారు చేసింది. అయితే కరోనా వైరస్ ప్రభావంతో అనుకున్న సమయానికి ఈ చాంపియన్‌షిప్ పూర్తి కావడం అసాధ్యం. దాంతోనే ఆ షెడ్యూల్ గడువును పెంచాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది.(బాంబులతో కాదు.. సాఫ్ట్బాల్స్ ప్రాక్టీస్ చేయండి!) -
‘భారత్, పాకిస్తాన్ లేకుంటే దానికి అర్థమే లేదు’
కరాచీ: భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందంటే మ్యాచ్‌కు గంట నుంచే క్రికెట్ అభిమానులు టీవీలకు అతుక్కుపోయేవారు. ఇక స్టేడియానికి వెళ్లి ప్రత్యక్షంగా మ్యాచ్‌ను వీక్షించే వారి సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. అయితే, ప్రస్తుతం ఆ కిక్కు, మజా క్రికెట్ అభిమానులకు దూరమైంది. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య కొన్నేళ్లుగా ఐసీసీ టోర్నీల్లో తప్ప ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. అయితే, ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య టెస్టు సిరీస్ లేకపోవడంపై పాకిస్తాన్ మాజీ పేసర్, ప్రస్తుత బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. (చదవండి: క్రికెటర్ హేల్స్‌కు కరోనా?) ‘ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ద్వేషపూరిత వాతావరణం నెలకొని ఉందని నాకు తెలుసు. అయితే, దానిని క్రికెట్‌కు ఆపాదించరాదు. ఈ విషయంలో ఐసీసీ కాస్త చొరవ తీసుకొని ఇరు దేశాల మధ్య టెస్టు చాంపియన్‌షిప్‌లో ఒక సిరీస్ జరిగేలా షెడ్యూల్ రూపొందించాల్సింది. అధిక సంఖ్యలో ప్రేక్షకులు చూసే భారత్, పాకిస్తాన్ మధ్య టెస్టు సిరీస్ లేకుండా టెస్టు చాంపియన్‌షిప్‌కు అర్థమే లేదు’అని వకార్ వ్యాఖ్యానించాడు. చివరిసారిగా భారత్ వేదికగా జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను మన జట్టు 1-0తో సొంతం చేసుకుంది. 2008 ముంబై దాడి తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఒకప్పటిలా ప్రస్తుతం భారత జట్టుకు పేసర్ల కొదువలేదని వకార్ అన్నాడు. 140 కి.మీ వేగంతో బంతులేసే నాణ్యమైన పేసర్లను భారత్ తయారు చేస్తుందని పేర్కొన్నాడు. ‘ఒకప్పుడు భారత్ బౌలింగ్ ఇంత పటిష్టంగా లేదు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ ఫమీ, ఇషాంత్ శర్మతో కూడిన వారి బౌలింగ్ లైనస్ ఎంతటి పటిష్ట బ్యాటింగ్‌నైనా కూల్చగలదు. ప్రస్తుతం టీమిండియా టెస్టుల్లో నెంబర్‌వన్‌గా ఉండటానికి గల కారణాల్లో బౌలింగ్ కూడా ఒకటి’అని వకార్ భారత్ బౌలింగ్‌ను ప్రశంసించాడు. (చదవండి: టి20 ప్రపంచ కప్ నిర్వహణపై ఆసీస్ దృష్టి) -
కోహ్లి సేన కొత్తకొత్తగా..
అంటిగ్వా : వెస్టిండీస్‌తో జరగబోయే రెండు టెస్టుల సిరీస్‌లో టీమిండియా ఆటగాళ్లు కొత్తగా కనిపించనున్నారు. గురువారం నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్టులో ఐసీసీ కొత్త నిబంధనలకు అనుగుణంగా కోహ్లి సేనతో పాటు విండీస్ ఆటగాళ్లు నయా జెర్సీలతో మైదానంలోకి దిగనున్నారు. దీనిలో భాగంగా టీమిండియా ఆటగాళ్ల కొత్త జెర్సీలను బీసీసీఐ అధికారికంగా విడుదల చేసింది. సారథి విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ అజింక్యా రహానేతో పాటు యువ సంచలనం రిషభ్ పంత్‌లు కొత్త జెర్సీలను ధరించి ఫోటో షూట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో టెస్టు సిరీస్‌కు ఎంపికైన 16 మంది సభ్యులు పాల్గొని సందడి చేశారు. ఆటగాళ్లకు సంబంధించిన ఫోటోలను టీమిండియా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియలో తెగ హల్చల్ చేస్తున్నాయి. సంప్రదాయ టెస్టు క్రికెట్‌కు ఐసీసీ కొత్త హంగులు అద్దుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో మాదిరిగానే టెస్టుల్లోనూ ఆటగాళ్ల జెర్సీల వెనక వారి పేర్లు, నంబర్లు కనిపించనున్నాయి. యాషెస్ సిరీస్ నుంచే ఈ పద్దతి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక టెస్టుల్లో నంబర్ వన్ అయిన టీమిండియా విండీస్ సిరీస్‌తోనే ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్ వేటను ప్రారంభించనుంది. చదవండి: కోహ్లి ఇంకొక్కటి కొడితే.. టెస్టుల్లో పోటీ రెట్టింపైంది -
టెస్టు చాంపియన్‌షిప్‌పై స్పందించిన కోహ్లి
ముంబై : టెస్ట్ చాంపియన్‌షిప్‌తో సం ప్రదాయ క్రికెట్‌కు సరికొత్త జోష్ రానుందని టీమిండియా సారథి విరాట్ కోహ్లీ అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తొలిసారిగా టెస్ట్ చాం పియన్‌షిప్‌కు తెరదీసిన సంగతి తెలిసిందే. దీనిపై సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో కోహ్లీ మాట్లాడాడు. ‘ఐసీసీ టెస్ట్ చాంపియన్‌షిప్ కోసం మేమంతా ఎంతో ఆసక్తిగా ఎదు రుచూస్తున్నాం. ఇది సంప్రదాయ క్రికెట్ కు ఒక పరమార్థం తేనుంది. టెస్టు క్రికె ట్ అత్యంత సవాల్‌తో కూడుకుంది. ఇం దులో అగ్రస్థానంలో నిలవడం ఎనలేని సంతృప్తినిస్తుంది. కొంతకాలంగా టెస్టుల్లో టీమిండియా చాలా బాగా ఆడుతోం ది. అందువల్ల చాంపియన్‌షిప్‌లో మన కు మెరుగైన అవకాశాలే ఉన్నాయి’అని విరాట్ అన్నాడు. కాగా, వచ్చే నెల 1న ఆరంభమయ్యే యాషెస్ సమరం నుం చి చాంపియన్‌షిప్ మొదలవుతుంది. ప్రస్తుత్తం టెస్ట్ క్రికెట్లో టాప్–9లో ఉన్న జట్ల మధ్య స్వదేశీ, విదేశీ సిరీస్ లతో సాగే ఈ మెగా టోర్నమెంట్ 2021 లో ముగుస్తుంది. రెండేళ్లలో 71 మ్యాచు లు, 27 సిరీస్‌లు జరుగుతాయి. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్ ఆడతాయి. ఇంగ్లండ్‌లో 2021, జూన్‌లో ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తారు. -
నేను తప్పులు చేశా...
విరాట్ కోహ్లి ప్రపంచ క్రికెట్‌ను శాసించే బ్యాట్స్‌మన్‌గా ఎదగక ముందు ఎలా ఉన్నాడో గుర్తుందా? మైదానంలో అనవసర దూకుడు, మాట్లాడితే బూతులు, వరుస వివాదాలు అతనికి చెడ్డ పేరు తెచ్చి పెట్టాయి. ఆ తర్వాత ఆటతో పాటు వ్యక్తిగతంగా కోహ్లిలో పెను మార్పు వచ్చి అతడిని దిగ్గజ స్థాయిలో నిలబెట్టింది. ఈ విషయం అతనికీ బాగా తెలుసు. తాను తప్పులు చేశానని ఒప్పుకుంటూ జూనియర్లు అలాంటి పని చేయకుండా నిరోధిస్తున్నానని విరాట్ అంటున్నాడు. న్యూఢిల్లీ: వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి తర్వాత తొలిసారి మీడియాతో సవివరంగా మాట్లాడిన భారత కెప్టెన్... వేర్వేరు అంశాలపై తన మనసులో మాటను బయటపెట్టాడు. కోహ్లి ఇంటర్వ్యూ విశేషాలు అతని మాటల్లోనే... వరల్డ్ కప్‌లో ఓటమిపై... నేను నా జీవితంలో పరాజయాల నుంచే ఎక్కువ పాఠాలు నేర్చుకున్నాను. పెద్ద ఓటములే మున్ముందు ఇంకా బాగా ఆడేలా స్ఫూర్తినిచ్చాయి. మున్ముందు ఏం చేయాలనే విషయంపై దిశానిర్దేశం చేశాయి. ఇలాంటి సమయంలోనే మనతో ఎవరు ఉంటారో, ఎవరు గోడ దూకుతారో కూడా తెలిసిపోతుంది. దురదృష్టం ఏమిటంటే అందరూ అద్భుతంగా ఆడుతున్నారు అనిపించిన సమయంలో మరో జట్టు మనకంటే బాగా ఆడిందని తెలుస్తుంది. దీనిని జీర్ణించుకోవడం చాలా కష్టం. ఏదైనా తప్పు చేస్తే చెప్పవచ్చు గానీ తప్పు చేయకపోయినా ఓడిపోయామని తెలిస్తే ఎలా ఉంటుంది! వరల్డ్ కప్‌లో ఏం సాధించామో దానిని చూసి గర్వపడాలని మేమంతా చెప్పుకున్నాం. మన ఘనతను మనం చెప్పుకోకుండా ఉంటే ఎలా? ఓటమి ఎదురైనంత మాత్రాన మన శ్రమను తక్కువ చేసి చూపవద్దని అందరం నిర్ణయించుకున్నాం. ఈ స్థాయికి చేరడంపై... పోరాడటం వదిలేస్తే మన ప్రయాణం ముగిసిపోయినట్లే. ఉదయం లేచిన దగ్గరి నుంచి కష్టపడటం, చేసిన పనినే మళ్లీ మళ్లీ చేయడం మినహా మరో మార్గం లేదు. వీటిని పునరావృతం చేస్తేనే నిలకడ, విజయాలు వస్తాయి. నిజానికి ఇదంతా చాలా విసుగు తెప్పిస్తుంది. అయినా సరే చేయాల్సి రావడం చాలా కష్టం. గోల్ఫ్ ఆటగాళ్లు ఒకే షాట్‌ను ఎన్ని సార్లు ప్రాక్టీస్ చేస్తారో కదా. యూఎస్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచినా సరే అది అలా చేయాల్సిందే. ఎందుకంటే అలా చేస్తేనే తర్వాత దాని ఫలితం దక్కుతుంది. క్రికెట్లో అడుగు పెట్టినప్పుడు దేవుడు నా కోసం ఏం రాసి పెట్టాడో తెలీదు. దేని గురించి కూడా ఊహించలేదు. నాలో మరీ అంత గొప్ప సామర్థ్యం లేదని నాకూ తెలుసు. అయితే నా చుట్టూ ఉన్నవారితో పోలిస్తే ఎంతైనా కష్టపడగలనని, ఎంత శ్రమకైనా ఓర్చుకోగలననే విషయం మాత్రం నాకు బాగా తెలుసు. దేవుడు బహుశా ఈ శ్రమనే చూసినట్లున్నాడు! క్రికెట్ బయట జీవితంపై... నేను నా కోసం క్రికెట్ ఆడుతున్నానే తప్ప ఎవరిని మెప్పించడానికో కాదు. నా ఉద్దేశాలు, ఆలోచనలు స్పష్టం. అయితే ఆ తర్వాత సహజంగానే క్రికెట్ తర్వాత కూడా జీవితం ఉందనే వాస్తవం అర్థమవుతుంది. అప్పటి వరకు ఆటనే సర్వస్వం అనిపించినా భార్య, కుటుంబానికి కూడా సమయం కేటాయించాలి. అప్పుడు అవి ప్రాధాన్యతలుగా మారిపోతాయి. మతపరమైన అంశాల్లో నేను భాగం కాను. మొదటి నుంచీ ఏ మతంతో నన్ను నేను ముడివేసుకోలేదు. అన్ని మతాలతో, అందరు మనుషులతో కలిసిపోతా. నాకు తెలిసి మనందరిలో ఆధ్యాత్మికత ఉంటుంది. కొత్త కుర్రాళ్లతో సాన్నిహిత్యంపై... రిషభ్ పంత్, శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్‌లాంటి కుర్రాళ్లంతా అద్భుతమైనవారు. గతంలోనే చెప్పినట్లు నేను 19–20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆలోచనాధోరణితో పోలిస్తే వీరంతా చాలా ముందున్నారు. ఐపీఎల్‌తో ఆట మెరుగుపడితే... తప్పుల నుంచి నేర్చుకోవడం మొదలు ఇతరత్రా వాటిలో కూడా వారిలో ఆత్మవిశ్వాసంపాళ్లు చాలా ఎక్కువ. కుర్రాళ్లపై కోపం ప్రదర్శించే సంస్కృతి మా జట్టులో లేదు. వారు కూడా సీనియర్లలాగే మనసు విప్పి మాట్లాడవచ్చు. నేనైతే వారి దగ్గరకు వెళ్లి ‘నేను ఇలాంటి తప్పులు చేశాను. మీరు మాత్రం అలా చేయకండి’ అంటూ విడమర్చి చెబుతాను. ఎందుకంటే ఎదుగుతున్న సమయంలో నేను చాలా తప్పులు చేశాను. కెరీర్ ఆరంభంలో ఇతర విషయాలపై దృష్టి పెట్టి ఆటపై ఏకాగ్రత కనబర్చలేకపోయాను. అదృష్టవశాత్తూ మళ్లీ దారిలో పడ్డాను. రాబోయే టెస్టు చాంపియన్‌షిప్‌పై... నేను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. సరైన సమయంలో ఇది జరుగుతోంది. ఆడేది ద్వైపాక్షిక సిరీస్‌లే అయినా వాటి ప్రాధాన్యత పెరిగిపోతుంది. కాబట్టి ప్రతీ సిరీస్ కోసం ప్రత్యేక ప్రణాళికతో సిద్ధం కావాల్సి ఉంటుంది. గతంలోనే టెస్టు చాంపియన్‌షిప్ గురించి ఆలోచించా. ఇప్పడది వాస్తవ రూపం దాలుస్తోంది. -
టెస్ట్ క్రికెట్లో ‘టాస్’కు గుడ్ బై..!
క్రికెట్ మ్యాచ్‌లు వీక్షించే ప్రతి ఒక్కరికీ టాస్కు ఉండే విశిష్టత గురించి తెలుసు. మ్యాచ్‌లో ఏ జట్టు ముందుగా బ్యాటింగ్, బౌలింగ్ చేపట్టాలన్నది టాస్ మీదే ఆధారపడి ఉంటుంది. కానీ భవిష్యత్తులో టెస్ట్ మ్యాచ్‌లలో టాస్ విధానానికి మంగళం పాడాలని ఐసీసీ భావిస్తున్నట్టు సమాచారం. 1877లో అంతర్జాతీయ క్రికెట్ ఆరంభం అయినప్పటి నుంచి ఈ విధానం అమల్లో ఉంది. తొలుత బ్యాటింగ్, బౌలింగ్‌లో ఏది ఎంచుకోవచ్చనేది టాస్ గెలిచిన కెప్టెన్ మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా టెస్ట్ మ్యాచ్‌లలో టాస్ విధానం ద్వారా అతిథ్య జట్టుకు ప్రయోజనం చేకూరుతుందనే విమర్శలు ఎక్కువయ్యాయి. పిచ్‌ల ఏర్పాటు అనేది అతిథ్య జట్టు మీదే ఆధారపడి ఉండటంతో టాస్ గెలిస్తే పిచ్ బ్యాటింగ్, బౌలింగ్‌లలో దేనికి అనుకూలిస్తే వారు దాన్నే ఎంచుకుంటున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఐసీసీ ఈ దిశగా అడుగులు వేస్తోంది. ఈ అంశంపై విస్తృత స్థాయిలో చర్చించేందుకు ఐసీసీ నియమించిన కమిటీ మే 28, 29 తేదీలలో ముంబైలో సమావేశం కానున్నట్టు సమాచారం. ఈ కమిటీలో ప్రముఖ క్రికెటర్లు అనిల్ కుంబ్లే, ఆండ్రూ స్ట్రాస్, మహేళ జయవర్దనే, రాహుల్ ద్రవిడ్, టిమ్ మే, న్యూజిలాండ్ క్రికెట్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ వైట్, థర్డ్ అంపైర్ రిచర్డ్, ఐసీసీ రిఫరీలు రంజన్, షాన్ పొలాక్‌లు సభ్యులుగా ఉండే అవకాశం ఉంది. భారత్‌లో కూడా దేశవాలీ క్రికెట్లో టాస్కు స్వస్తి చెప్పే ప్రతిపాదన వచ్చినప్పటికీ అది అమల్లోకి రాలేదు. -
ఐసీసీ గదను అందుకున్న కోహ్లి
-
ఐసీసీ గద అందుకున్న కోహ్లి
కేప్‌టౌన్ : మూడో టీ20 విజయంతో దక్షిణాఫ్రికా పర్యటనను విజయవంతంగా ముగించిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ఐసీసీ ప్రతిష్టాత్మ టెస్ట్ చాంపియన్‌షిప్ గదను అందుకున్నాడు. మ్యాచ్ అనంతరం దిగ్గజ ఆటగాళ్లు సునీల్ గావస్కర్, గ్రేమ్ పొలాక్ చేతుల మీదుగా కోహ్లి గదను అందుకున్నాడు. గత నెలలో జొహన్నెస్‌బర్గ్‌లో జరిగిన చివరి టెస్ట్‌లో భారత విజయం సాధించి ఐసీసీ ర్యాకింగ్స్లో అగ్రస్థానాన్ని కాపాడుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కటాఫ్ తేదీ అయిన ఏప్రిల్ 3 వరకు మరే జట్టు భారత్‌ను ర్యాంకింగ్స్‌లో వెనక్కి నెట్టే అవకాశం లేకపోవడంతో ప్రతిష్టాత్మక గదతో పాటు 10 లక్షల డాలర్ల ప్రైజ్ మనీ వరించింది. 124 పాయింట్లతో దక్షిణాఫ్రికా గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా రెండు టెస్టుల్లో ఓడి 121 పాయింట్లకు చేరినా ర్యాంకింగ్‌లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. 111 పాయింట్లతో ఉన్న దక్షిణాఫ్రికా 115 పాయింట్ల చేరి రెండో ర్యాంకులోనే ఉండటంతో ఐసీసీ టెస్ట్ చాంపియన్ షిప్ గదను టీమిండియా అందుకోవడానికి ఉపకరించింది. 2002 తర్వాత ఐసీసీ టెస్ట్ చాంపియన్ షిప్ గద అందుకున్న పదో కెప్టెన్‌గా కోహ్లీ నిలిచాడు. 2016లో కోహ్లి తొలి సారి ఐసీసీ గదను అందుకున్నాడు. ఇక ఆస్ట్రేలియాతో జరగనున్న నాలుగు టెస్టుల సిరీస్‌లో దక్షిణాఫ్రికా కనీసం ఒక మ్యాచ్‌లోనైనా గెలిస్తేనే రెండో స్థానంలో కొనసాగుతోంది. దీంతో 5 లక్షల డాలర్ల ప్రైజ్ మనీ అందుకునే అవకాశం దక్కుతుంది. మూడో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా చేతిలో ఇప్పటికే 2 లక్షల డాలర్లు ఉన్నాయి. ఒకవేళ ఆస్ట్రేలియా కనుక దక్షిణాఫ్రికాపై 3-0, లేదంటే 4-0తో విజయం సాధిస్తే వీరి ర్యాంకులు తారుమారై ఆసీస్ రెండో స్థానానికి చేరుకుంటుంది. ఇక మార్చిలో ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ గెలిచిన వారికి లక్ష డాలర్ల ప్రైజ్ మనీ లభిస్తుంది. ఒకవేళ సిరీస్ డ్రా అయితే నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌కే ఆ ప్రైజ్ మనీ లభిస్తుంది. మూడో టీ20లో ఆతిథ్య జట్టుపై భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించి టీ20 సిరీస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. రైనా, భువీల అద్భుత ప్రదర్శనతో భారత్‌కు విజయం వరించింది. 2-1తో టెస్ట్ సిరీస్ ఓడినా.. కోహ్లి సేన 5-1తో వన్డే, 2-1తో టీ20 సిరీస్‌లను కైవసం చేసుకుని పర్యటనను సగర్వంగా ముగించింది. -
నంబర్‌వన్ నిలబడింది
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో అద్భుత విజయం సాధించిన భారత్ ఐసీసీ టెస్ట్ చాంపియన్‌షిప్ గదను తిరిగి దక్కించుకోనుంది. గదతో పాటు టెస్టు ర్యాంకింగ్స్‌లో ఏడాది పాటు నెంబర్ వన్‌గా ఉన్నందుకు మిలియన్ డాలర్ల నగదు బహుమతిని కూడా సొంతం చేసుకోనుంది. టెస్టు చాంపియన్‌షిప్ గద దక్కించుకోవడం కోహ్లిసేనకు ఇది వరుసగా రెండోసారి. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు భారత్ మొదటి స్థానంలోనే కొనసాగుతోంది. సఫారీల సిరీస్‌కు ముందు 124 పాయింట్లతో ఉన్న టీమిండియా... సిరీస్‌ను 1–2తో కోల్పోయి ప్రస్తుతం 121 పాయింట్లతో ఉంది. మార్చిలో ఆస్ట్రేలియా, దక్షిణాప్రికాల మధ్య జరిగే మూడు టెస్టుల సిరీస్‌ను సఫారీలో 3–0తో దక్కించుకున్నా... టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్ స్థానానికి ముప్పుండదు. దీంతో ఈ ఏడాది కూడా టెస్ట్ చాంపియన్‌షిప్ గద మనకే దక్కనుంది. -
‘భారత్-పాక్ మ్యాచ్ లేకుంటే టెస్టు చాంపియన్ షిప్ దండుగ’
లాహోర్: భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్‌లు లేకుండా టెస్టు చాంపియన్ షిప్ నిర్వహించడం శుద్ద దండుగ అని పాక్ మాజీ కెప్టెన్, కోచ్ వకార్ యునీస్ అభిప్రాయపడ్డారు. ఇటీవల ఐసీసీ 9 దేశాలతో టెస్టు చాంపియన్ షిప్, 13 దేశాల వన్డే లీగ్ నిర్వహిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై వకార్ ఓ చానెల్ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘ టెస్టు చాంపియన్ షిప్ మంచి ఆలోచనే. కానీ పాక్, భారత్‌తో క్రికెట్ ఆడటం లేదు. దీంతో టెస్టు చాంపియన్ షిప్‌కు ఇబ్బంది ఏర్పడవచ్చు. ఒకవేళ ఈ టెస్టు చాంపియన్ షిప్లో భారత్-పాక్‌ల మధ్య మ్యాచ్‌లు జరిగితే.. ఇరుదేశాల మధ్య మంచి సంబంధాలు ఏర్పడుతాయి. ఈ రెండు దేశాలు ఒక్కసారికూడా తలపడకుండా టాప్-1,2 ర్యాంకు సాధిస్తే ఇది చాంపియన్ షిప్ అని ఎలా పిలుస్తామని’ వకార్ వ్యాఖ్యానించారు. పాక్‌లో ఆడటానికి భారత్‌కు ఇబ్బందిగా ఉంటే దుబాయ్ వేదికగా ఆడండి. దుబాయ్ పాక్ హోం గ్రౌండ్ లాంటిదేనని వకార్ భారత్‌కు సూచించారు. అక్కడ కాకుంటే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, ఎక్కడైనా భారత్‌తో ఆడటానికి పాక్‌కు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. రెండేళ్లపాటు జరిగే టెస్టు చాంపియన్ షిప్లో 9 దేశాలు పాల్గొంటాయని, ఒక్కో దేశం ఆరు సిరీస్‌లు ఆడుతుందని ఐసీసీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే 3 సిరీస్‌లు స్వదేశంలో మిగిలిన 3 సిరీస్‌లు విదేశాల్లో ఆడాలని తెలిపింది. అయితే భారత్-పాక్ మధ్య సిరీస్‌లు ఎలా కొనసాగుతాయనే విషయంలో ఐసీసీ స్పష్టతను ఇవ్వలేకపోయింది. -
టెస్టు చాంపియన్‌షిప్‌కు శ్రీకారం
ఆక్లాండ్: అంతర్జాతీయ క్రికెట్లో సరికొత్త మార్పులకు ఐసీసీ శ్రీకారం చుట్టింది. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు విపరీతమైన ఆదరణ పెరుగుతూ ఉండటంతో టెస్టులను కాపాడుకోవాలని కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆలోచనగా ఉంది. దీంట్లో భాగంగా తొమ్మిది దేశాలతో టెస్టు చాంపియన్‌షిప్ నిర్వహించాలని అధికారికంగా నిర్ణయించింది. దీంతో పాటు కొత్తగా అంతర్జాతీయ వన్డే లీగ్‌ను కూడా జరుపుతామని ప్రకటించింది. ఇందులో 13 దేశాలు పాల్గొంటాయి. అయితే ఈ రెండు లీగ్‌లకు సంబంధించిన షెడ్యూల్, పాయింట్ల పద్ధతి, వేదికలను తర్వాత ప్రకటించనున్నారు. శుక్రవారం ఆక్లాండ్‌లో జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ‘ఇంతటి కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపినందుకు సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. విశ్వవ్యాప్తంగా క్రికెట్ అభివృద్ధి కోసం ఐసీసీ ఎంతగానో కృషి చేస్తోంది. ద్వైపాక్షిక క్రికెట్లో మార్పులు తేవడం ఇప్పుడే కొత్త కాదు. అయితే అందరికీ ఆమోదయోగ్యంగా ఓ పరిష్కారం లభించడం ఇదే తొలిసారి. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఇక ప్రతీ మ్యాచ్‌ను ఆస్వాదిస్తారు’ అని ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్ అన్నారు. భారత్, పాక్ పరిస్థితి ఏమిటి? ఇదిలావుండగా భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య అనేక కారణాలతో ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. ఇరు దేశాల మధ్య శాంతియుత వాతావరణం లేకపోవడంతో చాలా ఏళ్లుగా అంతర్జాతీయ ఈవెంట్స్‌లో తప్ప ఇరు దేశాల్లో మాత్రం సిరీస్‌లకు చోటు లేకుండా పోయింది. ఈ పరిస్థితిలో టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆరు సిరీస్‌లను ఆడాల్సి ఉంటుంది. మరి భారత జట్టు పాకిస్తాన్లో పర్యటించడం కానీ... పాక్ జట్టు భారత గడ్డపై అడుగుపెట్టే పరిస్థితి కానీ లేదు. ఇలాంటి నేపథ్యంలో ఇరు జట్ల మధ్య చాంపియన్‌షిప్ ఎలా జరుగుతుందనే చర్చకు ఐసీసీ తగిన సమాధానం ఇవ్వాల్సి ఉంది. ► టెస్టు లీగ్‌లో మొత్తం తొమ్మిది జట్లు పాల్గొంటాయి. 2019 నుంచి రెండేళ్ల పాటు ఆరు సిరీస్‌లు ఆడతాయి. ఇందులో ఒక్కో జట్టు మూడు సిరీస్‌లు స్వదేశంలో... మూడింటిని విదేశాల్లో ఆడాల్సి ఉంటుంది. అన్ని మ్యాచ్‌లు ఐదు రోజుల పాటు జరుగుతాయి. ► ప్రతీ జట్టు కనీసం రెండు టెస్టులు... గరిష్టంగా ఐదు టెస్టులు ఆడాల్సి ఉంటుంది. చివరగా రెండు జట్లు ప్రపంచ టెస్టు లీగ్ ఫైనల్లో తలపడతాయి. ► ఇక 2020–2021లో జరిగే వన్డే లీగ్‌లో మొత్తం 13 దేశాలు పాల్గొంటాయి. ఇందులో 12 శాశ్వత సభ్య దేశాలు కాగా ఐసీసీ వరల్డ్ క్రికెట్ లీగ్ చాంపియన్‌షిప్‌లో విజేత మరో జట్టుగా ఉంటుంది. ► 2019లో జరిగే వన్డే ప్రపంచకప్ వరకు టాప్–10 సభ్య దేశాలు పరస్పర అంగీకారం మేరకు నాలుగు రోజుల టెస్టులను ప్రయోగాత్మకంగా జరుపుకోవచ్చు. జింబాబ్వే, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే బాక్సింగ్ డే టెస్టు తొలిసారిగా ఇందుకు వేదికయ్యే అవకాశాలున్నాయి. -
ఇక నుంచి టెస్టు చాంపియన్‌షిప్
వెల్లింగ్టన్: దాదాపు ఏడాది కాలంగా టెస్టు ఫార్మాట్ కు కొత్త రూపు తేవాలని యోచిస్తున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఆ మేరకు కార్యాచరణ రూపొందించేందుకు ముందడుగు వేసింది. టెస్టు చాంపియన్ షిప్‌కు ఐసీసీ ఆమోదం తెలుపుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ టెస్టు చాంపియన్ ఫిప్‌తో పాటు అంతర్జాతీయ వన్డేలీగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటితో పాటు 4 రోజుల టెస్టు మ్యాచ్‌ల ప్రయోగాలను చేపట్టుకోవచ్చని టెస్టు హోదా ఉన్న దేశాలుకు అనుమతిచ్చింది. అక్లాండ్లో శుక్రవారం ఐసీసీ గవర్నింగ్ బాడీ సమావేశం జరిగింది. ఈ భేటీ అనంతరం ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ రిచర్డ్సన్ మీడియాతో మాట్లాడారు. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత ఈ టెస్టు చాంపియన్‌షిప్ ప్రారంభం అవుతుందని, ఫైనల్‌ను 2021లో నిర్వహిస్తామని ప్రకటించారు. టెస్టు హోదా కలిగిన 12 దేశాల్లో 9 దేశాలు ఈ చాంపియన్‌షిప్‌లో పాల్లొంటాయని పేర్కొన్నారు. రెండేళ్లపాటు జరిగే ఈ చాంపియన్‌షిప్‌లో 9 దేశాలు మొత్తం ఆరు సిరీస్‌లు ఆడుతాయన్నారు. మూడు సిరీస్‌లు స్వదేశంలో, మరో మూడింటిని విదేశాల్లో ఆడతాయని రిచర్డ్సన్ వివరించారు. సిరీస్‌లో కనిష్ఠంగా రెండు మ్యాచ్‌లు.. గరిష్ఠంగా ఐదు మ్యాచ్‌లు ఉంటాయని పేర్కొన్నారు. టాప్‌లో నిలిచిన రెండు దేశాలు ఏప్రిల్ 2021లో జరిగే టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో తలపడతాయన్నారు. ఈ చాంపియన్‌షిప్ గురించి మరింత కసరత్తు చేయాల్సి ఉందని తెలిపారు. టెస్టు హోదా కలిగిన 12 దేశాల్లో.. జింబాబ్వే, అఫ్గానిస్థాన్, ఐర్లాండ్లను మినహాయించినట్లు రిచర్డ్సన్ తెలిపారు. 2021 నుంచి 13 జట్ల వన్డే ఇంటర్నేషనల్ లీగ్‌ను కూడా ప్రవేశపెడతామని చెప్పారు. -
టెస్టు చాంపియన్‌షిప్‌కు ఐసీసీ ఆమోదం!
వెల్లింగ్టన్: సుదీర్ఘకాలంగా చర్చల్లో ఉన్న టెస్టు చాంపియన్‌షిప్‌కు ఐసీసీ పచ్చ జెండా ఊపే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే శుక్రవారం ఆక్లాండ్‌లో జరిగే ఐసీసీ సమావేశంలో చాంపియన్‌షిప్‌కు ఆమోదం తెలపనున్నట్టు సమాచారం. టెస్టులను కాపాడుకోవాలనే అభిప్రాయం క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. దీంతో వన్డే, టి20ల్లో ఉన్న తరహాలోనే టెస్టుల్లోనూ అన్ని జట్లను ఆడించే చాంపియన్‌షిప్‌ను జరపాలని చాలా కాలంగా ఆలోచిస్తున్నారు. రెండేళ్లపాటు నిర్వహించే ఈ టోర్నీ 2019లో ప్రారంభమవుతుంది.