
వెల్లింగ్టన్: సుదీర్ఘకాలంగా చర్చల్లో ఉన్న టెస్టు చాంపియన్‌షిప్‌కు ఐసీసీ పచ్చ జెండా ఊపే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే శుక్రవారం ఆక్లాండ్‌లో జరిగే ఐసీసీ సమావేశంలో చాంపియన్‌షిప్‌కు ఆమోదం తెలపనున్నట్టు సమాచారం. టెస్టులను కాపాడుకోవాలనే అభిప్రాయం క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
దీంతో వన్డే, టి20ల్లో ఉన్న తరహాలోనే టెస్టుల్లోనూ అన్ని జట్లను ఆడించే చాంపియన్‌షిప్‌ను జరపాలని చాలా కాలంగా ఆలోచిస్తున్నారు. రెండేళ్లపాటు నిర్వహించే ఈ టోర్నీ 2019లో ప్రారంభమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment