ముంబై : టెస్ట్ చాంపియన్‌షిప్‌తో సం ప్రదాయ క్రికెట్‌కు సరికొత్త జోష్ రానుందని టీమిండియా సారథి విరాట్ కోహ్లీ అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తొలిసారిగా టెస్ట్ చాం పియన్‌షిప్‌కు తెరదీసిన సంగతి తెలిసిందే. దీనిపై సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో కోహ్లీ మాట్లాడాడు. ‘ఐసీసీ టెస్ట్ చాంపియన్‌షిప్ కోసం మేమంతా ఎంతో ఆసక్తిగా ఎదు రుచూస్తున్నాం. ఇది సంప్రదాయ క్రికెట్ కు ఒక పరమార్థం తేనుంది. టెస్టు క్రికె ట్ అత్యంత సవాల్‌తో కూడుకుంది. ఇం దులో అగ్రస్థానంలో నిలవడం ఎనలేని సంతృప్తినిస్తుంది.
కొంతకాలంగా టెస్టుల్లో టీమిండియా చాలా బాగా ఆడుతోం ది. అందువల్ల చాంపియన్‌షిప్‌లో మన కు మెరుగైన అవకాశాలే ఉన్నాయి’అని విరాట్ అన్నాడు. కాగా, వచ్చే నెల 1న ఆరంభమయ్యే యాషెస్ సమరం నుం చి చాంపియన్‌షిప్ మొదలవుతుంది. ప్రస్తుత్తం టెస్ట్ క్రికెట్‌లో టాప్–9లో ఉన్న జట్ల మధ్య స్వదేశీ, విదేశీ సిరీస్ లతో సాగే ఈ మెగా టోర్నమెంట్ 2021 లో ముగుస్తుంది. రెండేళ్లలో 71 మ్యాచు లు, 27 సిరీస్‌లు జరుగుతాయి. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్ ఆడతాయి. ఇంగ్లండ్‌లో 2021, జూన్‌లో ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment