
Photo Courtesy: BCCI
IPL 2025- SRH VS Rajasthan Royals Match Live Updates
ఎస్ఆర్హెచ్ ఘన విజయం..
ఐపీఎల్-2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బోణీ కొట్టింది. ఉప్పల్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో ఎస్ఆర్‌హెచ్ ఘన విజయం సాధించింది. 287 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 6 వికెట్లు కోల్పోయి 242 పరుగులు మాత్రమే చేయగల్గింది.
రాజస్తాన్ బ్యాటర్లలో ధ్రువ్ జురెల్( 35 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 70) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సంజూ శాంసన్(66), హెట్‌మైర్(42) పరుగులతో పోరాడారు. ఎస్ఆర్‌హెచ్ బౌలర్లలో సిమర్జీత్ సింగ్, హర్షల్ పటేల్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. షమీ, జంపా చెరో వికెట్ సాధించారు.
శాంసన్, జురెల్ ఔట్
దూకుడుగా ఆడిన సంజూ శాంసన్(66), ధ్రువ్ జురెల్(70) వరుస క్రమంలో ఔటయ్యారు. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో శాంసన్ ఔట్ కాగా.. జంపా బౌలింగ్‌లో జురెల్ పెవిలియన్‌కు చేరాడు.
శాంసన్, జురెల్ హాఫ్ సెంచరీలు..
రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్లు సంజూ శాంసన్(59), ధ్రువ్ జురెల్(69) దూకుడుగా ఆడుతున్నారు. 13 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. 15 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 169/5.
9 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 108/3
9 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ రాయల్స్ 3 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. క్రీజులో సంజూ శాంసన్(48), ధ్రువ్‌జురెల్(38) ఉన్నారు.
రాజస్తాన్ మూడో వికెట్ డౌన్
నితీష్ రాణా రూపంలో రాజస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన రాణా.. మహ్మద్ షమీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 5 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 57/3. క్రీజులో సంజూ శాంసన్(32), ధ్రువ్‌జురెల్(3) ఉన్నారు.
రాజస్తాన్‌కు భారీ షాక్..
287 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్‌కు భారీ షాక్ తగిలింది. సిమ్రాన్‌జీత్ సింగ్ వేసిన రెండో ఓవర్‌లో రాజస్తాన్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. తొలుత యశస్వి జైశ్వాల్(1).. తర్వాత రియాన్ పరాగ్(4) పెవిలియన్‌కు చేరాడు. 3 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 35/2
భారీ స్కోర్ చేసిన సన్‌రైజర్స్..
ఉప్పల్ స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఎస్‌ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లలో ఇషాన్ కిషన్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.
కేవలం 47 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లతో 106 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు ట్రావిస్ హెడ్(67) హాఫ్ సెంచరీతో మెరవగా.. క్లాసెన్(34), నితీశ్ కుమార్(30) పరుగులతో రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే మూడు వికెట్లు పడగొట్టగా.. థీక్షణ రెండు, సందీప్ శర్మ ఒక్క వికెట్ సాధించారు. ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో అత్యధిక స్కోర్ కావడం గమనార్హం.
ఇషాన్ కిషన్ సెంచరీ..
రాజస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ ఓపెనర్ ఇషాన్ కిషన్ సెంచరీతో మెరిశాడు. కేవలం 45 బంతుల్లోనే తన తొలి ఐపీఎల్ సెంచరీని కిషన్ అందుకున్నాడు.
మూడో వికెట్ డౌన్
నితీశ్ రెడ్డి రూపంలో ఎస్ఆర్‌హెచ్ మూడో వికెట్ కోల్పోయింది. 30 పరుగులు చేసిన నితీశ్.. థీక్షణ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులో ఇషాన్ కిషన్(75), క్లాసెన్(1) ఉన్నారు. 16 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 219/3.
ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ..
ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. 25 బంతుల్లో కిషన్ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 70 పరుగులతో కిషన్ తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 7 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి. 14 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 196/2.
ఎస్ఆర్‌హెచ్ రెండో వికెట్ డౌన్..
ట్రావిస్ హెడ్ రూపంలో ఎస్ఆర్‌హెచ్ రెండో వికెట్ కోల్పోయింది. 67 పరుగులు చేసిన హెడ్.. తుషార్ దేశ్ పాండే బౌలింగ్‌లో ఔటయ్యాడు. 11 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 147/2. క్రీజులో నితీష్ కుమార్‌రెడ్డి(15), ఇషాన్ కిషన్(35) ఉన్నారు.
ట్రావిస్ హెడ్ ఫిప్టీ..
ఎస్ఆర్‌హెచ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. కేవలం 21 బంతుల్లోనే హెడ్ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. హెడ్ 59 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లలో ఇప్పటివరకు 8 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి. 9 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 124/1.
దూకుడుగా ఆడుతున్న హెడ్..
ఎస్ఆర్‌హెచ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ దూకుడుగా ఆడుతున్నాడు. కేవలం 15 బంతుల్లో 41 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. అతడితో పాటు ఇషాన్ కిషన్(20) పరుగులతో క్రీజులో ఉన్నాడు. 6 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 94/1
తొలి వికెట్ డౌన్..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి వికెట్ కోల్పోయింది. 24 పరుగులు చేసిన అభిషేక్ శర్మ.. మహేష్ థీక్షణ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి ఇషాన్ కిషన్ వచ్చాడు. 5 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 55/1
ఐపీఎల్ 25 లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన రాజస్తాన్ కెప్టన్ రియాన్ పరాగ్.. ముందుగా సన్ రైజర్స్ ను బ్యాటింగ్ ఆహ్వానించాడు. పిచ్ ను చూస్తుంటే డ్రై వికెట్ గా ఉందని, దాంతోనే ముందుగా బౌలింగ్ తీసుకున్నట్లు తెలిపాడు.
ఇరు జట్ల బలాబలాలు..
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ఇవాళ (మార్చి 23) మధ్యాహ్నం జరుగబోయే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ఎస్‌ఆర్‌హెచ్ హోం గ్రౌండ్ ఉప్పల్ స్టేడియం (హైదరాబాద్) వేదిక కానుంది. గత సీజన్ ఫైనల్లో కేకేఆర్ చేతిలో ఓడి తృటిలో టైటిల్ చేజార్చుకున్న ఆరెంజ్ ఆర్మీ.. తొలి మ్యాచ్‌లో గెలిచి సీజన్‌ను ఘనంగా ప్రారంభించాలని భావిస్తుంది. గతేడాది మూడో స్థానంతో సరిపెట్టుకున్న రాయల్స్ సైతం గెలుపుతో సీజన్‌ను ప్రారంభించాలని పట్టుదలగా ఉంది.
ఇరు జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డులు పరిశీలిస్తే.. రాయల్స్‌పై సన్‌రైజర్స్ కాస్త పైచేయి కలిగి ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు 20 మ్యాచ్‌ల్లో తలపడగా.. సన్‌రైజర్స్ 11, రాయల్స్ 9 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. ఇరు జట్లు మధ్య జరిగిన గత మూడు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్సే విజయం సాధించింది. హైదరాబాద్‌లో ఇరు జట్లు తలపడిన చివరిసారి (2023) మాత్రం రాయల్స్‌నే విజయం వరించింది. ఇరు జట్లు హైదరాబాద్‌లో నాలుగుసార్లు తలపడగా రాయల్స్ ఆ ఒక్కసారి మాత్రమే గెలుపొందింది.
సన్ రైజర్స్ తుది జట్టు
ప్యాట్ కమిన్స్( కెప్టెన్), ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, క్లాసెన్, అంకిత్ వర్మ, అభినవ్ మనోహర్, సిమర్ జీత్ సింగ్, హర్షల్ పటేల్; మహ్మద్ షమీ
రాజస్తాన్ తుది జట్టు
రియాన్ పరాగ్(కెప్టెన్), యశస్వి జైశ్వాల్, శివం దూబే, నితీష్ రానా, ధృవ్ జురెల్, షిమ్రోన్ హెట్ మెయిర్, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షనా, తుషారా దేశ్ పాండే, సందీప్ శర్మ, ఫజల్ హక్ పరూఖి
Comments
Please login to add a commentAdd a comment