
Photo Courtesy: BCCI
ఐపీఎల్-2025లో భాగంగా ఇవాళ (మార్చి 23) రాత్రి (7:30 గంటలకు) రసవత్తర సమరం జరుగనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఢీకొంటున్నాయి. క్రికెట్‌లో ఈ రెండు జట్ల మ్యాచ్‌ను ఎల్ క్లాసికోగా పిలుస్తారు. ఈ మ్యాచ్‌పై జనాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఐపీఎల్‌లో ముంబై, సీఎస్‌కే జట్లు అత్యంత విజయవంతమైన జట్లు. ఈ రెండు జట్లు చెరో ఐదు సార్లు టైటిల్స్ సాధించాయి. ఇరు జట్లు నేటి మ్యాచ్‌తో ఆరో టైటిల్ వేటను ప్రారంభిస్తాయి.
నేటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌కు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. నిషేధం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేడు. సీఎస్‌కే విషయానికొస్తే.. రుతురాజ్ గైక్వాడ్ ఈ జట్టును ముందుండి నడిపించనున్నాడు.
తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా సేవలు కూడా అందుబాటులో లేవు. గాయం నుంచి బుమ్రా ఇంకా కోలుకోలేదు. నేటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తుది జట్టు కూర్పును పరిశీలిస్తే.. ఓపెనర్‌గా రోహిత్ శర్మ వస్తాడు.
హిట్‌మ్యాన్‌ను జత ఎవరన్నదే ఆసక్తికరంగా మారింది. విల్ జాక్స్ లేదా ర్యాన్ రికెల్టన్‌లలో ఎవరో ఒకరు హిట్‌మ్యాన్‌తో పాటు బరిలోకి దిగుతారు. వన్ డౌన్ తిలక్ వర్మ, నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్, ఐదో ప్లేస్‌లో నమన్ ధిర్ రావడం ఖరారైంది. నేటి మ్యాచ్‌తో రాబిన్ మింజ్ ఐపీఎల్ అరంగేట్రం చేయవచ్చు.
స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా మిచెల్ సాంట్నర్, కర్ణ శర్మ బరిలో ఉంటారు. పేసర్లుగా దీపక్ చాహర్, కార్బిన్ బాష్, ట్రెంట్ బౌల్ట్ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది.
సీఎస్‌కే విషయానికొస్తే.. ఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే బరిలో నిలిచే అవకాశం ఉంది. వన్‌డౌన్‌లో రచిన్ రవీంద్ర, ఆతర్వాత దీపక్ హుడా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్) బరిలోకి దిగవచ్చు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా రవిచంద్రన్ అశ్విన్, పేసర్లుగా సామ్ కర్రన్, మతీషా పతిరణ, అన్షుల్ కాంబోజ్ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది.
హెడ్ టు హెడ్ రికార్డ్స్‌ను పరిశీలిస్తే.. ఐపీఎల్‌లో సీఎస్‌కే, ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు 37 మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడ్డాయి. ఇందులో సీఎస్‌కే 17, ముంబై 20 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి.
ముంబై ఇండియన్స్..
రోహిత్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార యాదవ్, నమన్ ధిర్, బెవాన్ జాకబ్స్, రాజ్ బవా, విల్ జాక్స్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), విజ్ఞేశ్ పుథుర్, సత్యనారాయణ రాజు, కార్బిన్ బాష్, మిచెల్ సాంట్నర్, అర్జున్ టెండూల్కర్, ర్యాన్ రికెల్టన్, కృష్ణణ్ శ్రీజిత్, రాబిన్ మింజ్, జస్ప్రీత్ బుమ్రా, అశ్వనీ కుమార్, కర్ణ్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, ముజీబ్ ఉర్ రెహ్మాన్
చెన్నై సూపర్ కింగ్స్..
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఎంఎస్ ధోని , రవీంద్ర జడేజా, శివం దూబే, మతీషా పతిరానా, నూర్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్, డెవాన్ కాన్వే, సయ్యద్ ఖలీల్ అహ్మద్, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, సామ్ కర్రాన్, షేక్ రషీద్, అన్షుల్ కాంబోజ్, ముఖేష్ చౌదరి, దీపక్ హుడా, గుర్జన్‌ప్రీత్ సింగ్, నాథన్ ఎల్లిస్, జామీ ఓవర్టన్, కమలేష్ నాగర్‌కోటి, రామకృష్ణన్ ఘోష్, శ్రేయాస్ గోపాల్, వంశ్ బేడి, ఆండ్రీ సిద్దార్థ్.
Comments
Please login to add a commentAdd a comment