న్యూజిలాండ్ గడ్డపై ఇంగ్లండ్ జట్టు తమ జోరును కొనసాగిస్తోంది. వెల్లింగ్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆతిథ్య కివీస్‌ను 323 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చిత్తు చేసింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో ఇంగ్లండ్ కైవసం చేసుకుంది.
కాగా న్యూజిలాండ్ గడ్డపై ఇంగ్లండ్ టెస్టు సిరీస్ సొంతం చేసుకోవడం 16 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 583 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బ్లాక్ క్యాప్స్ 259 పరుగులకు ఆలౌటైంది.
న్యూజిలాండ్ బ్యాటర్లలో టామ్ బ్లండెల్(115) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 3 వికెట్లు పడగొట్టగా.. క్రిస్ వోక్స్, కార్సే తలా రెండు వికెట్లు సాధించారు.
హ్యారీ బ్రూక్ సూపర్ సెంచరీ..
అంతకుముందు ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 427 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్(106) సూపర్ సెంచరీతో చెలరేగాడు. అదే విధంగా బెన్ డకెట్(92), జాకెబ్ బెతల్(96) తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నారు.
మ్యాచ్ స్కోర్లు..
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 280/10
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 125/10
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 424/6 డిక్లేర్
కివీస్ రెండో ఇన్నింగ్స్: 259/10
ఫలితం: 323 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం
ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్: హ్యారీ బ్రూక్
Comments
Please login to add a commentAdd a comment