
ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు 23 పరుగుల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. జేమీ స్మిత్ (72), గస్ అట్కిన్సన్ (4) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో బెన్ డకెట్ 18, డేనియల్ లారెన్స్ 30, ఓలీ పోప్ 6, జో రూట్ 42, హ్యారీ బ్రూక్ 56, క్రిస్ వోక్స్ 25 పరుగులు చేశారు. లంక బౌలర్లలో అశిత ఫెర్నాండో 3, ప్రభాత్ జయసూర్య 2, విశ్వ ఫెర్నాండో ఓ వికెట్ పడగొట్టారు. అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 236 పరుగులకు ఆలౌటైంది.
నిషన్ మధుష్క 4, కరుణరత్నే 2, కుసాల్ మెండిస్ 24, ఏంజెలో మాథ్యూస్ 0, చండీమల్ 17, ధనంజయ డిసిల్వ 74, కమిందు మెండిస్ 12, ప్రభాత్ జయసూర్య 10, మిలన్ రత్నాయకే 72, విశ్వ ఫెర్నాండో 13 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్ తలో మూడు వికెట్లు, గస్ అట్కిన్సన్ 2, మార్క్ వుడ్ ఓ వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment