![Prabath Jayasuriya Cleans Up Harry Brook And Chris Woakes With A Ripper In ENG Vs SL 2024 1st Test](/styles/webp/s3/article_images/2024/08/23/asd.jpg.webp?itok=JT1i9LWu)
ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ప్రభాత్ ఇద్దరు ఇంగ్లండ్ బ్యాటర్లను మతి పోగొట్టే బంతులతో క్లీన్ బౌల్డ్ చేశాడు. హ్యారీ బ్రూక్, క్రిస్ వోక్స్ ప్రభాత్ మాయాజాలం ధాటికి నోరెళ్లబెట్టారు. ఊహించని విధంగా బంతి స్పిన్ కావడంతో ఆ ఇద్దరు బ్యాటర్లకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ప్రభాత్ ఇంగ్లండ్ బ్యాటర్లను క్లీన్ బౌల్డ్ చేసిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి.
Prabhat Jayasuriya with two absolute jaffas. 🤯pic.twitter.com/oeyooLHWPP
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 23, 2024
మ్యాచ్ విషయానికొస్తే.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 23 పరుగుల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతుంది. ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. జేమీ స్మిత్ (72), గస్ అట్కిన్సన్ (4) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో బెన్ డకెట్ 18, డేనియల్ లారెన్స్ 30, ఓలీ పోప్ 6, జో రూట్ 42, హ్యారీ బ్రూక్ 56, క్రిస్ వోక్స్ 25 పరుగులు చేశారు. లంక బౌలర్లలో అశిత ఫెర్నాండో 3, ప్రభాత్ జయసూర్య 2, విశ్వ ఫెర్నాండో ఓ వికెట్ పడగొట్టారు. అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 236 పరుగులకు ఆలౌటైంది.
నిషన్ మధుష్క 4, కరుణరత్నే 2, కుసాల్ మెండిస్ 24, ఏంజెలో మాథ్యూస్ 0, చండీమల్ 17, ధనంజయ డిసిల్వ 74, కమిందు మెండిస్ 12, ప్రభాత్ జయసూర్య 10, మిలన్ రత్నాయకే 72, విశ్వ ఫెర్నాండో 13 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్ తలో మూడు వికెట్లు, గస్ అట్కిన్సన్ 2, మార్క్ వుడ్ ఓ వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment