లంకతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన బట్లర్ (PC: SLC X)
ICC Cricket World Cup 2023- England vs Sri Lanka: వన్డే వరల్డ్‌కప్-2023లో శ్రీలంకతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో తాము మూడు మార్పులతో బరిలోకి దిగుతున్నట్లు ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ వెల్లడించాడు.
ఇంగ్లండ్‌కు షాక్.. అతడు దూరం
క్రిస్ వోక్స్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్ తుదిజట్టులోకి వచ్చినట్లు తెలిపాడు. వేలికి గాయమైన కారణంగా స్టార్ పేసర్ రీస్ టోప్లే స్వదేశానికి తిరిగి వెళ్లిపోయినట్లు బట్లర్ పేర్కొన్నాడు. అట్కిన్‌సన్, హ్యారీ బ్రూక్‌లు కూడా లంకతో మ్యాచ్‌లో ఆడటం లేదని తెలిపాడు.
వాళ్లిద్దరు అవుట్
ఇక ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు చమిక, హేమంత స్థానాల్లో ఏంజెలో మ్యాథ్యూస్, కుమార తుదిజట్టులోకి వచ్చినట్లు లంక సారథి కుశాల్ మెండిస్ తెలిపాడు. దసున్ షనక గైర్హాజరీలో కెప్టెన్సీ చేపట్టిన తనకు ఆటగాళ్లంతా పూర్తి మద్దతుగా నిలుస్తున్నారని పేర్కొన్నాడు.
బెంగళూరు మ్యాచ్‌లో తాము విజయం సాధిస్తామనే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశాడు. కాగా డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ సెమీస్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా నెగ్గాల్సిందే!
తుది జట్లు:
శ్రీలంక
కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్(కెప్టెన్/ వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనుంజయ డిసిల్వా, ఏంజెలో మాథ్యూస్, మహీష్ దీక్షానా, కసున్ రజిత, లాహిరు కుమార, దిల్షాన్ మదుశంక.
ఇంగ్లండ్
జానీ బెయిర్ స్టో, డేవిడ్ మలాన్, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్(కెప్టెన్/ వికెట్ కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.
చదవండి: WC 2023: ఇంగ్లండ్‌తో మ్యాచ్.. స్టార్ పేసర్‌కు రెస్ట్! జట్టులోకి అశ్విన్.. ఎందుకంటే?
Comments
Please login to add a commentAdd a comment