లండన్: ఇంగ్లండ్ గడ్డపై వరుసగా రెండు టెస్టులు ఓడిన శ్రీలంక... మూడో మ్యాచ్‌లో విజయం దిశగా సాగుతోంది. ఓవల్ వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్టులో 219 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక... మూడో రోజు ఆదివారం ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 94 పరుగులు చేసింది.
దిముత్ కరుణరత్నే (8) విఫలం కాగా... నిసాంక (44బంతుల్లో 53 బ్యాటింగ్; 7 ఫోర్లు), కుశాల్ మెండిస్ (25 బంతుల్లో 30 బ్యాటింగ్; 6 ఫోర్లు) రాణించారు. చేతిలో తొమ్మిది వికెట్లున్న శ్రీలంక... విజయానికి మరో 125 పరుగులు చేయాల్సి ఉంది.
ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ ఒక వికెట్ పడగొట్టాడు. ఓవర్‌నైట్ స్కోరు 211/5తో ఆదివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక 61.2 ఓవర్లలో 263 పరుగులకు ఆలౌటైంది. కెపె్టన్ ధనంజయ డిసిల్వా (69), కమిందు మెండిస్ (64) హాఫ్ సెంచరీలు చేశారు.
ఇంగ్లండ్ బౌలర్లలో ఒలీ స్టోన్, జోష్ హాల్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ టాపార్డర్ విఫలమవడంతో... ఆ జట్టు 34 ఓవర్లలో 156 పరుగులకే ఆలౌటైంది. జేమీ స్మిత్ (50 బంతుల్లో 67; 10 ఫోర్లు, ఒక సిక్సర్) ఒక్కడే ధాటిగా ఆడగా... బెన్ డకెట్ (7), ఓలీ పోప్ (7), జోరూట్ (12), హ్యారీ బ్రూక్ (3), అట్కిన్‌సన్ (1) విఫలమయ్యారు. శ్రీలంక బౌలర్లలో లహిరు కుమార 4, విశ్వ ఫెర్నాండో మూడు వికెట్లు పడగొట్టారు.
చదవండి: బంగ్లాతో టెస్టు సిరీస్.. భారత జట్టు ప్రకటన! పంత్ రీ ఎంట్రీ
Comments
Please login to add a commentAdd a comment