ప్రస్తుత ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఈ ఏడిషన్‌లో ఇప్పటికే ఇద్దరు జగజ్జేతలను (డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, 1992 వరల్డ్‌కప్ విన్నర్ పాకిస్తాన్) మట్టికరిపించిన ఆ జట్టు.. తాజాగా మరో వరల్డ్ ఛాంపియన్‌కు షాకిచ్చింది. పూణే వేదికగా నిన్న జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘన్లు.. 1996 వరల్డ్‌కప్ విజేత శ్రీలంకను చిత్తు చేశారు.
నెక్స్ట్ టార్గెట్ ఐదుసార్లు జగజ్జేత ఆస్ట్రేలియా..
వరుస సంచలనాలతో దూసుకుపోతున్న ఆఫ్ఘన్లు తమ తదుపరి లక్ష్యం ఐదుసార్లు జగజ్జేత ఆస్ట్రేలియా అంటున్నారు. నవంబర్ 7న ఆఫ్ఘనిస్తాన్ టీమ్ పటిష్టమైన ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ఆఫ్ఘన్లతో పాటు యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఒకవేళ ఆ మ్యాచ్‌లో ఆఫ్ఘన్లు ఆస్ట్రేలియాకు షాకిస్తే ప్రపంచకప్ చరిత్రలోనే పెను సంచలనమవుతుంది. ప్రస్తుతం ఆఫ్ఘన్ ఆటగాళ్ల ఫామ్, వారిలో ఉన్న కసి చూస్తే ఆసీస్‌ను ఓడించడం పెద్ద కష్టమేమీ కాదనిపిస్తుంది. మరి నవంబర్ 7న ఏం జరుగుతుందో చూడాలి.
ఎంత లెజెండ్ కిల్లర్ అయినా నెదర్లాండ్స్‌తో జాగ్రత్తగా ఉండాలి..
దీనికి ముందు ఆఫ్ఘన్లు తమకంటే చిన్న జట్టు, మరో సంచనాల అడ్డా నెదర్లాండ్స్‌ను ఢీకొట్టనున్నారు. నవంబర్ 3న ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో కూడా ఏమైనా జరగవచ్చు. అయితే ఇరు జట్ల ప్రస్తుత ఫామ్ ప్రకారం చూస్తే ఆఫ్ఘన్‌కే ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఆఫ్ఘన్లు నెదర్లాండ్స్, ఆతర్వాత ఆస్ట్రేలియాను ఓడిస్తే సెమీస్‌కు వెళ్లే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ రెండు మ్యాచ్‌ల తర్వాత ఆఫ్ఘన్లు నవంబర్ 10న మరో పటిష్టమైన జట్టు సౌతాఫ్రికాతో తలపడతారు. ఈ లెక్కన ఆఫ్ఘనిస్తాన్ మరో రెండు సంచలన విజయాలవైపు చూసే అవకాశం ఉంటుంది.
ఆసీస్, సౌతాఫ్రికాతో అంత ఈజీ కాదు..
అయితే ఆసీస్, సౌతాఫ్రికా లాంటి పటిష్టమైన జట్లను ఓడించడం అంత ఆషామాషీ విషయం కాదు. పెద్దగా ఫామ్‌లో లేని ఇంగ్లండ్, పాకిస్తాన్, శ్రీలంకలను ఓడించినంత ఈజీ కాదు ఈ రెండు జట్లను ఓడించడం. ఒకవేళ ఆఫ్ఘన్లు.. ఆసీస్, సౌతాఫ్రికాల్లో ఏ జట్టును ఓడించినా, సెమీస్ రేసు సంక్లిష్టంగా (భారత్ మినహా) మారే అవకాశం ఉంది. ప్రస్తుత ప్రపంచకప్ మరింత రసవత్తరంగా సాగాలంటే ఆఫ్ఘన్లు మరిన్ని సంచలనాలు సృష్టించాలనే ఆశిద్దాం. లంకపై విజయం తర్వాత ఆఫ్ఘన్లు పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకారు. భారత్ (12), సౌతాఫ్రికా (10), న్యూజిలాండ్ (8), ఆస్ట్రేలియా (8) తర్వాత ఆఫ్ఘనిస్తాన్ (6) ఉంది.
లంకను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసిని ఆఫ్ఘన్లు..
ఇదిలా ఉంటే, నిన్న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘన్లు 7 వికెట్ల తేడాతో గెలుపొందారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లంకేయులు 49.3 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆఫ్ఘన్లు 45.2 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించారు. హష్మతుల్లా షాహిది (58 నాటౌట్), అజ్మతుల్లా ఒమర్‌జాయ్ (73 నాటౌట్) ఆఫ్ఘన్లను విజయతీరాలకు చేర్చారు. రహ్మత్ షా (62) అర్ధసెంచరీతో రాణించాడు. 4 వికెట్లు తీసి శ్రీలంక పతనాన్ని శాశించిన ఫజల్ హక్ ఫారూఖీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
Afghanistan players thanking the Pune crowd and fans chanting their names.
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 30, 2023
Lovely moments!pic.twitter.com/fzvrkOrUn1
Comments
Please login to add a commentAdd a comment