File photo
ఏషియన్ గేమ్స్ 2023 పురుషల క్రికెట్‌లో శ్రీలంకకు ఆఫ్గానిస్తాన్‌కు బిగ్ షాకిచ్చింది. హాంగ్‌జౌ వేదికగా జరిగిన క్వార్టర్‌పైనల్-3లో శ్రీలంకపై 8 పరుగుల తేడాతో ఆఫ్గానిస్తాన్ విజయం సాధించింది. దీంతో సెమీఫైనల్లో ఆఫ్గాన్ జట్టు అడుగుపెట్టింది. కాగా 117 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడంలో ఆఫ్గాన్ బౌలర్లు అద్భుతమైన పోరాట పటిమ కనబరిచారు.
లక్ష్య ఛేదనలో శ్రీలంక కేవలం 108 పరుగులకే కుప్పకూలింది. ఆఫ్గాన్ బౌలర్లలో కెప్టెన్ నైబ్, కైస్ అహ్మద్ తలా మూడు వికెట్లతో శ్రీలంక పతనాన్ని శాసించారు. వీరిద్దరితో పాటు జహీర్ ఖాన్, జనత్, ఆష్రాప్ తలా ఒక్క వికెట్ సాధించారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆఫ్గానిస్తాన్.. శ్రీలంక బౌలర్లు చెలరేగడంతో 116 పరుగులకే ఆలౌటైంది. ఆఫ్గాన్ బ్యాటర్లలో నూర్ అలీ జద్రాన్(51) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లంక బౌలర్లలో నువాన్ తుషారా 4 వికెట్లు పడగొట్టగా.. సహన్ అరాచ్చిగే రెండు, సమరాకూన్ తలా, విజయ్‌కాంత్ చెరో వికెట్ సాధించారు.
చదవండి: Asian Games 2023: కాంపౌండ్ ఆర్చరీలో భారత్‌కు గోల్డ్ మెడల్
Comments
Please login to add a commentAdd a comment