
పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఇవాళ శ్రీలంక-ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు గత మ్యాచ్‌ల్లో తమకంటే చాలా రెట్లు మెరుగైన జట్లపై విజయాలు సాధించి జోరుమీదున్నాయి. ఆఫ్ఘనిస్తాన్.. పాక్‌పై, శ్రీలంక.. ఇంగ్లండ్‌పై సంచలన విజయాలు సాధించాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో శ్రీలంక.. ఆఫ్ఘనిస్తాన్ కంటే మెరుగైన స్థితిలో ఉంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో ఐదో స్థానంలో ఉండగా.. 5 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో ఆఫ్ఘనిస్తాన్ ఏడో స్థానంలో కొనసాగుతుంది.
తుది జట్లు..
ఆఫ్ఘనిస్తాన్: రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, ఇక్రమ్ అలీఖిల్(వికెట్‌కీపర్), మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నవీన్-ఉల్-హక్, ఫజల్ హాక్ ఫారూఖీ
శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుసల్ మెండిస్(కెప్టెన్/వికెట్‌కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, ఏంజెలో మాథ్యూస్, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, దుష్మంత చమీర, దిల్షన్ మధుశంక
Comments
Please login to add a commentAdd a comment