ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ నబీ రికార్డు హాఫ్ సెంచరీ సాధించాడు. ఆసియా కప్-2023లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న కీలకమైన మ్యాచ్‌లో నబీ విధ్వంసకర అర్ధశతకంతో విరుచుకుపడ్డాడు. కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, ఆఫ్ఘనిస్తాన్ తరఫున వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని నమోదు చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.
ఈ ఇన్నింగ్స్‌కు ముందు ఈ రికార్డు ముజీబ్ పేరిట ఉండేది. ముజీబ్ ఇదే ఏడాది పాక్‌పై 26 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదాడు. అంతకుముందు రషీద్ ఖాన్ (27 బంతుల్లో), మొహ్మమద్ నబీ (28), షఫీకుల్లా షిన్వారి (28) ఆఫ్ఘనిస్తాన్ తరఫున వన్డేల్లో వేగవంతమైన హాఫ్ సెంచరీలు చేశారు.
ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో నబీ మొత్తంగా 32 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 65 పరుగులు చేసి ఔటయ్యాడు. ఫలితంగా 292 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ ఒక్కసారిగా ట్రాక్ మార్చుకుని గెలుపుబాట పట్టింది.
ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక.. కుశాల్ మెండిస్ (84 బంతుల్లో 92; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. పథుమ్ నిస్సంక (41), అసలంక (36), దునిత్ వెల్లెలెగె (33 నాటౌట్), కరుణరత్నే (32), తీక్షణ (28) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో గుల్బదిన్ 4 వికెట్లు పడగొట్టగా.. రషీద్‌ఖాన్ 2, ముజీబ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
292 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ నబీ సునామీ ఇన్నింగ్స్‌తో విరుచుకపడటంతో 31 ఓవర్లలో 5 వికెట్లు నష్టానికి 234 పరుగులు చేసి, విజయానికి 58 పరుగుల దూరంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment