శ్రీలంకకు షాకిచ్చిన ఆఫ్గానిస్తాన్‌.. 6 వికెట్ల తేడాతో ఘన విజయం | Afghanistan Vs Sri Lanka Highlights, World Cup 2023 Warm-Up: Afghanistan Beat Sri Lanka 6 Wickets Win Via DLS Method - Sakshi
Sakshi News home page

WC 2023: శ్రీలంకకు షాకిచ్చిన ఆఫ్గానిస్తాన్‌.. 6 వికెట్ల తేడాతో ఘన విజయం

Published Wed, Oct 4 2023 7:49 AM | Last Updated on Wed, Oct 4 2023 9:04 AM

Afghanistan clinches six wicket win via DLS method - Sakshi

గువహటి వేదికగా శ్రీలంకతో జరిగిన వామప్‌ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఆఫ్గానిస్తాన్‌ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 46.2 ఓవర్లలో 294 పరుగులకు ఆలౌటైంది. లంక బ్యాటర్లలో కుశాల్‌ మెండిస్‌ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. కేవలం 87 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్స్‌లతో 158 పరుగులు మెండిస్‌ చేశాడు. అతడితో పాటు సమరవిక్రమ(39), నిసాంక(30) పరుగులతో పర్వాలేదనపించారు.

ఆఫ్గాన్‌ బౌలర్లలో నబీ నాలుగు వికెట్లు పడగొట్టగా.. ముజీబ్‌, నవీన్‌ ఉల్‌-హక్‌, రషీద్‌ ఖాన్‌, ఫరూఖీ తలా వికెట్‌ సాధించారు. అనంతరం వర్షం కారణంగా అఫ్గానిస్తాన్‌ లక్ష్యాన్ని 42 ఓవర్లలో 257 పరుగులుగా నిర్దేశించారు. అఫ్గాన్‌ 38.1 ఓవర్లలో 4 వికెట్లకు 261 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ఆఫ్గాన్‌ బ్యాటర్లలో రహ్మానుల్లా గుర్బాజ్(119), రెహామత్‌ షా(93) పరుగులతో అదరగొట్టారు.
చదవండి: ODI WC 2023: ఆసీస్‌దే విజయం.. వరుసగా రెండో మ్యాచ్‌లో పాక్‌ ఓటమి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement