WC 2023- Ind Vs SL- Kushal Mendis Comments: వన్డే ప్రపంచకప్-2023లో శ్రీలంక ఘోర ఓటమి చవిచూసింది. వాంఖడే వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో 302 పరుగుల తేడాతో శ్రీలంక ఘోర పరాజయం పాలైంది. 358 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. భారత పేసర్ల ధాటికి 55 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ ఐదు వికెట్లతో చెలరేగగా.. సిరాజ్ ఆరంభంలోనే 3వికెట్లు పడగొట్టి లంకను చావు దెబ్బతీశాడు.
వీరిద్దరితో పాటు బుమ్రా, జడేజా తలా వికెట్ సాధించారు. లంక బ్యాటర్లలో ఐదుగురు బ్యాటర్లు డకౌట్‌గా పెవిలియన్‌కు చేరారు. అంతర్జాతీయ వన్డేల్లో శ్రీలంకకు ఇది మూడో అత్యల్ప స్కోర్ కావడం గమనార్హం. ఇక ఓటమితో సెమీస్ రేసు నుంచి లంక దాదాపు నిష్క్రమించిందనే చెప్పాలి.
ఈ మ్యాచ్‌లో మొదటి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో వికెట్ల నష్టానికి 357 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో గిల్ (92), విరాట్ కోహ్లి(88), శ్రేయస్ అయ్యర్(82) పరుగులతో అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడారు. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మధుషాంక ఐదు వికెట్ల ఘనత సాధించాడు. ఇక దారుణ ఓటమిపై మ్యాచ్ అనంతరం శ్రీలంక కెప్టెన్ కుశాల్ మెండిస్ స్పందించాడు. ఈ ఓటమి తనను ఎంతో బాధించిందని మెండిస్ తెలిపాడు.
"ఈ మ్యాచ్‌లో మా జట్టు ప్రదర్శన నన్ను చాలా నిరాశపరిచింది. నేను కూడా మెరుగైన ప్రదర్శన చేయలేకపోయాను. భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఫ్లడ్ లైట్స్ వెలుతురులో బంతి అంత స్వింగ్ అవుతుందని అస్సలు నేను ఊహించలేదు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని బౌలింగ్ ఎంచుకున్నాను.
అదే విధంగా ఫస్ట్‌హాఫ్‌లో వికెట్ స్లోగా ఉండి బౌలర్లకు మంచిగా ఉంటుందని తొలుత బౌలింగ్ చేయాలనుకున్నాను. అందుకు తగ్గట్టే మధుశంక మంచి ఆరంభం అందించాడు. అతడు అద్బుతంగా బౌలింగ్ చేశాడు. కానీ ఫీల్డింగ్‌లో కూడా మెరుగైన ప్రదర్శన చేయలేదు. ఆరంభంలో కోహ్లి, గిల్‌కు అవకాశాలు ఇచ్చేశాం.
అదే మా కొంపముంచింది. వారిద్దరూ మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత మా బౌలర్ల కమ్‌బ్యాక్ ఇచ్చినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎదైమనప్పటికీ క్రెడిట్ మాత్రం టీమిండియాకే ఇవ్వాలనకుంటున్నారు. వారు మూడు విభాగాల్లో అద్భుతంగా రాణించారు. మాకు ఇంకా ఈ టోర్నీలో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. రెండు మ్యాచ్‌ల్లో కూడా విజయం సాధించేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తామని" పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో మెండిస్ పేర్కొన్నాడు. కాగా లంకపై విజయంతో భారత్‌కు సెమీఫైనల్‌కు క్వాలిఫై అయింది.
చదవండి: World Cup 2023: చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ.. వరల్డ్‌కప్‌లోనే తొలి బౌలర్‌గా
Comments
Please login to add a commentAdd a comment