WC 2023 Pak Vs SL- Hyderabad: వన్డే ప్రపంచకప్-2023లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో శ్రీలంక బ్యాటర్లు కుశాల్ మెండిస్, సదీర సమరవిక్రమ దుమ్ములేపారు. హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా ఆకాశమే హద్దుగా చెలరేగి శతకాల మోత మోగించి జట్టుకు భారీ స్కోరు అందించారు.
ఫాస్టెస్ట్ సెంచరీతో
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో పాక్ పేసర్ హసన్ అలీ లంక ఓపెనర్ కుశాల్ పెరీరాను డకౌట్ చేసి ఆరంభంలోనే దెబ్బకొట్టాడు. ఈ నేపథ్యంలో ఓపెనర్ పాతుమ్ నిసాంక(51)కు తోడైన కుశాల్ మెండిస్ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు.
కేవలం 65 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 77 బంతుల్లో 14 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో 122 పరుగులు సాధించాడు. మెండిస్‌తో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ సమరవిక్రమ సైతం సునామీ ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు.
సమరవిక్రమ సైతం.. సెంచరీతో చెలరేగి
89 బంతుల్లో 108 పరుగులు సాధించాడు. సమరవిక్రమ ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. మిగిలిన వాళ్లలో ధనంజయ డి సిల్వ ఒక్కడే 20 పరుగులు మార్కు(25) దాటాడు. ఈ నేపథ్యంలో నిర్ణీత 50 ఓవర్లలో శ్రీలంక 9 వికెట్ల నష్టానికి 344 పరుగులు స్కోరు చేసింది.
టీమిండియా రికార్డు బ్రేక్
కాగా పటిష్ట పేస్‌దళం గల పాకిస్తాన్ మీద వరల్డ్‌కప్ మ్యాచ్‌లలో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఈ క్రమంలో టీమిండియా పేరిట ఉన్న రికార్డును శ్రీలంక బద్దలు కొట్టింది. ప్రపంచకప్ చరిత్రలో పాక్ మీద హయ్యస్ట్ స్కోరు సాధించిన జట్టుగా అవతరించింది. ఇక లంకతో మ్యాచ్‌లో హసన్ అలీ అత్యధికంగా 4 వికెట్లు తీయగా.. హ్యారిస్ రవూఫ్ రెండు, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహిన్ ఆఫ్రిది ఒక్కో వికెట్ పడగొట్టారు.
వరల్డ్‌కప్ మ్యాచ్‌లలో పాకిస్తాన్ మీద అత్యధిక పరుగులు స్కోరు చేసిన జట్లు:
►2023: శ్రీలంక- 344/9- హైదరాబాద్‌లో
►2019: టీమిండియా- 336/5 - మాంచెస్టర్‌లో
►2019: ఇంగ్లండ్- 334/9- నాటింగ్‌హాంలో
►2003: ఆస్ట్రేలియా 310/8- జొహన్నస్‌బర్గ్‌లో..
శ్రీలంక- పాకిస్తాన్‌లో నమోదైన మరో రికార్డు
వరల్డ్‌కప్ మ్యాచ్‌లో పాకిస్తాన్ మీద ఒకే మ్యాచ్‌లో సెంచరీలు సాధించిన బ్యాటర్ల జాబితాలోకి కుశాల్ మెండిస్, సమరవిక్రమ. 2019లో జో రూట్ 107, జోస్ బట్లర్ 103 పరుగులు సాధించారు.
చదవండి: చరిత్ర సృష్టించిన మెండిస్.. వన్డే ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ!
Comments
Please login to add a commentAdd a comment