Ind vs Pak: హిస్టరీ రిపీట్‌.. పాక్‌ ఓటమిని ధ్రువీకరించిన అక్తర్‌! థాంక్యూ.. | Khud Hi Haar Manli Fans React To Akhtar Cryptic Post Ahead Ind vs Pak WC 2023 | Sakshi
Sakshi News home page

WC 2023- Ind vs Pak: హిస్టరీ రిపీట్‌.. పాక్‌ ఓటమిని ధ్రువీకరించిన అక్తర్‌! థాంక్యూ..

Published Fri, Oct 13 2023 8:13 PM | Last Updated on Fri, Oct 13 2023 10:00 PM

Khud Hi Haar Manli Fans React To Akhtar Cryptic Post Ahead Ind vs Pak WC 2023 - Sakshi

ICC ODI WC 2023- Ind Vs Pak: haar manli: పాకిస్తాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ను టీమిండియా అభిమానులు సోషల్‌ మీడియాలో ఆడేసుకుంటున్నారు. ‘‘నిజాలు ఒప్పుకొంటున్నందుకు థాంక్యూ’’ అంటూ సెటైర్లు వేస్తూ మీమ్స్‌తో సందడి చేస్తున్నారు. కాగా దాయాదులు భారత్‌- పాకిస్తాన్‌ మ్యాచ్‌ అంటే ఇరు దేశాల్లోనే కాదు.. క్రికెట్‌ ప్రపంచం మొత్తానికి మహా ఇష్టం. 

హోరాహోరీకి సిద్ధం!
నువ్వా- నేనా అంటూ చిరకాల ప్రత్యర్థులు హోరాహోరీ తలపడితే చూడటానికి ఫ్యాన్స్‌కు రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తి కాదు. అలాంటి హై వోల్టేజీ మ్యాచ్‌ ఆరంభానికి సమయం ఆసన్నమైంది. భారత గడ్డపై వన్డే ప్రపంచకప్‌ 13వ ఎడిషన్‌లో తొలిసారి భారత్‌- పాక్‌ అక్టోబరు 14న పరస్పరం ఢీకొట్టనున్నాయి. 

ఈ నేపథ్యంలో రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టాడు. ‘‘రేపు.. చరిత్ర పునరావృతమవుతుంది’ అంటూ వికెట్‌ తీసిన సంబరంలో ఉన్న ఫొటోను షేర్‌ చేశాడు. కాగా.. ఇది సచిన్‌ టెండుల్కర్‌ను అవుట్‌ చేసినప్పటి సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలా కనిపించింది.

హిస్టరీ రిపీట్‌.. థాంక్యూ అక్తర్‌
ఈ నేపథ్యంలో అక్తర్‌.. ‘హిస్టరీ రిపీట్‌’ కామెంట్‌ను భారత జట్టు అభిమానులు హైలైట్‌ చేస్తూ పాకిస్తాన్‌ ఓటమిని నువ్వే ఖరారు చేశావు కదా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ‘‘నీకు నువ్వుగా.. ఓటమిని అంగీకరించావు.. టీమిండియాను సపోర్టు చేస్తున్నందుకు ధన్యవాదాలు.

మీ మాట నిజం కావాలి. ఎందుకంటే మీరన్నదే నిజం కాబట్టి’’ అంటూ అక్తర్‌ను ట్రోల్‌ చేస్తున్నారు. కాగా వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో ఇప్పటి వరకు టీమిండియాను పాకిస్తాన్‌ ఒక్కసారి కూడా ఓడించలేకపోయింది.

రెండేసి విజయాలతో
ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. అత్యుత్సాహం ప్రదర్శించిన అక్తర్‌కు  దిమ్మతిరిగేలా నెటిజన్లు రివర్స్‌ కౌంటర్లు ఇస్తున్నారు.  దీంతో ఈ మాజీ ఫాస్ట్‌బౌలర్‌ తన పోస్టును డిలీట్‌ చేసినట్లు తెలుస్తోంది. కాగా వన్డే వరల్డ్‌కప్‌-2023లో ఆడిన రెండు మ్యాచ్‌లలో టీమిండియా.. ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్‌లపై గెలుపొందగా.. పాకిస్తాన్‌ .. నెదర్లాండ్స్‌, శ్రీలంకను ఓడించింది. ఇరు జట్లు రెండేసి విజయాలతో మూడో మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. 

చదవండి:  ‘శార్దూల్‌ ఎందుకు? సిరాజ్‌ను ఎందుకు ఆడిస్తున్నారు?.. అసలేంటి ఇదంతా?’

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement