వన్డే ప్రపంచకప్-2023లో టీమిండియా తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసిన భారత్.. ఈ మెగా టోర్నీలో వరుసగా మూడో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. కాగా వన్డే ప్రపంచకప్ టోర్నీలో ఇప్పటివరకు 8 సార్లు పాకిస్తాన్‌ను భారత జట్టు ఓడించింది.
1992 వన్డే ప్రపంచకప్ నుంచి పాకిస్తాన్‌పై భారత్ ఆదిపత్యం చెలాయిస్తోంది. ఇక ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన టీమిండియా.. పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భారత జట్టుపై పాకిస్తాన్ మాజీ స్పీడ్ స్టార్ షోయబ్ అక్తర్ ప్రశంసల వర్షం కురిపించాడు. 2011 వరల్డ్‌కప్ విజయాన్ని పునరావృతం చేసే దిశగా టీమిండియా అడుగులు వేస్తుందని అక్తర్ కొనియాడాడు.
భారత్ 2011 ప్రపంచకప్ చరిత్రను పునరావృతం చేయబోతోందని నేను నమ్ముతున్నాను. సెమీ-ఫైనల్స్‌లో వారు విజయం సాధిస్తే.. కచ్చితంగా ఛాంపియన్స్‌గా నిలుస్తారు. ప్రస్తుత భారత జట్టు అద్భుతంగా ఆడుతోంది. ఈ టోర్నీలో మమ్మల్ని ఓడించి కోలుకోలేని దెబ్బ కొట్టారు. పాకిస్తాన్‌కు ఇది ఘోర పరాభావం. భారత జట్టు మమ్మల్ని ఓ పసికూనలా ఓడించింది. మా రోహిత్ శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడని తన యూట్యూబ్ ఛానల్‌లో అక్తర్ పేర్కొన్నాడు.
చదవండి: Eng Vs Afg: ముజీబ్‌ను హత్తుకుని ఏడ్చేసిన బుడ్డోడు.. మ్యాచ్ కోసం ఏకంగా! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment