సెంచరీలతో చెలరేగిన శ్రీలంక బ్యాటర్లు.. పాకిస్తాన్‌ టార్గెట్‌ 345 పరుగులు | Kusal Mendis, Samarawickrama hit tons Srilanka scores 344-9 | Sakshi
Sakshi News home page

CWC 2023: సెంచరీలతో చెలరేగిన శ్రీలంక బ్యాటర్లు.. పాకిస్తాన్‌ టార్గెట్‌ 345 పరుగులు

Published Tue, Oct 10 2023 6:05 PM | Last Updated on Tue, Oct 10 2023 6:21 PM

Kusal Mendis, Samarawickrama hit tons Srilanka scores 344-9 - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2203లో భాగంగా ఉప్పల్‌ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్‌ బౌలర్లకు శ్రీలంక బ్యాటర్లు చుక్కలు చూపించారు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక అందుకు తగ్గట్టు ప్రదర్శన కనబరిచింది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి లంక 344 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది.

లంక బ్యాటర్లలో కుశాల్‌ మెండిస్‌(77 బంతుల్లో 14 ఫోర్లు, 6 సిక్స్‌లతో 122 పరుగులు), సదీర సమరవిక్రమ(89 బంతుల్లో 108) అద్బుతమైన సెంచరీతో చెలరేగారు.  వీరిద్దరితో పాటు ఓపెనర్‌ నిస్సాంక(51) హాఫ్‌ సెంచరీతో రాణించారు. పాకిస్తాన్‌ బౌలర్లలో హసన్‌ అలీ 4 వికెట్లు పడగొట్టగా.. హ్యారిస్‌ రవూఫ్‌ రెండు, అఫ్రిది, నవాజ్‌, షాదాబ్‌ తలా వికెట్‌ సాధించారు.
చదవండి: ODI WC 2023: చరిత్ర సృష్టించిన మెండిస్‌.. వన్డే ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement