వన్డే ప్రపంచకప్-2023లో శ్రీలంక స్టార్ ఆటగాడు కుశాల్ మెండిస్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నారు. దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డ కుశాల్ మెండిస్.. ఇప్పుడు హైదరాబాద్ వేదికగా పాకిస్తాన్‌తో జరగుతున్న మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 65 బంతుల్లోనే 13 ఫోర్లు, 4 సిక్స్‌లతో మెండిస్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
తద్వారా ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. వన్డే ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన శ్రీలంక ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు ఈ రికార్డు శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగర్కర పేరిట ఉండేది. 2015 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై 70 బంతుల్లో సంగర్కర సెంచరీ సాధించాడు. తాజా మ్యాచ్‌తో సంగర్కర రికార్డును మెండిస్ బ్రేక్ చేశాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 77 బంతులు ఎదుర్కొన్న మెండిస్.. 14 ఫోర్లు, 6 సిక్స్‌లతో 122 పరుగులు చేసి ఔటయ్యాడు.
చదవండి: ODI WC 2023: అందరూ కోహ్లిని మాత్రమే ప్రశంసిస్తున్నారు.. అతడి సంగతి ఏంటి మరి?
The fastest century by a Sri Lankan at a Men's #CWC 💯🇱🇰@mastercardindia Milestones 🏏 #CWC23 #PAKvSL pic.twitter.com/4Afiq6ss0e
— ICC (@ICC) October 10, 2023
Comments
Please login to add a commentAdd a comment