వెళ్లి ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడుకో పో బాబర్‌.. పాక్‌ కెప్టెన్‌పై ఫ్యాన్స్‌ ట్రోల్స్‌ | Fans brutally troll Babar Azam for his poor batting in the world cup 2023 | Sakshi
Sakshi News home page

ODI WC 2023: వెళ్లి ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడుకో పో బాబర్‌.. పాక్‌ కెప్టెన్‌పై ఫ్యాన్స్‌ ట్రోల్స్‌

Published Tue, Oct 10 2023 7:44 PM | Last Updated on Tue, Oct 10 2023 8:26 PM

Fans brutally troll Babar Azam for his poor batting in the world  cup 2023 - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం మరోసారి దారుణ ప్రదర్శన కనబరిచాడు. నెదర్లాండ్స్‌పై కేవలం 5 పరుగులు ​మాత్రమే చేసిన బాబర్‌.. ఇప్పుడు శ్రీలంకపై 10 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. 345 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. 

దిల్షాన్ మధుశంక బౌలింగ్‌లో తొలుత ఇమామ్‌ ఉల్‌-హక్‌ భారీ షాట్‌కు ప్రయత్నించి ఔట్‌ అవ్వగా.. బాబర్‌ వికెట్‌ కీపర్‌కు ఈజీ క్యాచ్‌ ఇచ్చి తన వికెట్‌ను కోల్పోయాడు. పాక్‌ ఇన్నింగ్స్‌ 8 ఓవర్‌ వేసిన మధుశంక బౌలింగ్‌లో రెండో బంతిని బాబర్‌ డౌన్‌ లెగ్‌ దిశగా ఆడాలని భావించాడు.  కానీ బంతి ఎడ్జ్‌ తీసుకుని వికెట్‌ కీపర్‌ చేతికి వెళ్లింది. దీంతో బాబర్‌ చేసేదేమి లేక తెల్లముఖం వేసుకుని పెవిలియన్‌కు చేరాడు.

ఈ క్రమంలో బాబర్‌ ఆజంపై నెటిజన్లు ట్రోల్స్‌ వర్షం కురిపిస్తున్నారు. "వార్మప్‌ మ్యాచ్‌ల్లో ఆడటం కాదు బాబర్‌.. మెయిన్‌ టోర్నీలో ఆడాలంటూ" పోస్ట్‌లు చేస్తున్నారు. కాగా ఈ మెగా టోర్నీకి ముందు న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాతో వార్మప్‌ మ్యాచ్‌ల్లో బాబర్‌ చెలరేగి ఆడాడు. కానీ ప్రధాన టోర్నీలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది.
చదవండి: WC 2023- Pak Vs SL: కుశాల్‌ మెండిస్‌ సునామీ శతకం.. టీమిండియా రికార్డు బద్దలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement