వన్డే ప్రపంచకప్-2023ను ఇంగ్లండ్ విజయంతో ముగించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన తమ ఆఖరి మ్యాచ్‌లో 93 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. 338 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్.. 246 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లీ మూడు వికెట్లతో అదరగొట్టగా.. గుస్ అట్కిన్సన్, అదిల్ రషీద్, మొయిన్ అలీ తలా రెండు వికెట్లు సాధించారు.
పాకిస్తాన్ బ్యాటర్లలో అఘా సల్మాన్(51) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో బెన్ స్టోక్స్(84) పరుగులతో మరోసారి అద్బుత ఇన్నింగ్స్ ఆడగా.. జోరూట్(60), జానీ బెయిర్ స్టో(59) పరుగులతో రాణించారు.
ఆఖరిలో హ్యారీ బ్రూక్(17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30), డేవిడ్ విల్లీ(5 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌తో 15) మెరుపులు మెరిపించాడు. పాకిస్తాన్ బౌలర్లలో హ్యారీస్ రవూఫ్ మూడు వికెట్లు పడగొట్టగా.. షాహీన్ అఫ్రిది, వసీం తలా రెండు వికెట్లు సాధించారు. ఇక ఈ ఓటమితో పాకిస్తాన్ కూడా టోర్నీ నుంచి నిష్క్రమించింది.
చదవండి: World Cup 2023: వరల్డ్‌కప్ నుంచి పాకిస్తాన్ ఔట్..
Comments
Please login to add a commentAdd a comment