మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం శ్రీలంకలో పర్యటిస్తున్న ఆఫ్ఘనిస్తాన్.. హంబన్‌తోట వేదికగా ఇవాళ (జూన్ 2) తొలి వన్డే ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. చరిత్ అసలంక (95 బంతుల్లో 91; 12 ఫోర్లు), ధనంజయ డిసిల్వ (59 బంతుల్లో 51; 5 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 268 పరుగులు చేసి ఆలౌటైంది. లంక ఇన్నింగ్స్‌లో పథుమ్ నిస్సంక (38), దుషన్ హేమంత (22) ఓ మోస్తరుగా రాణించగా..మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో ఫజల్ హక్ ఫారూకీ, ఫరీద్ అహ్మద్ మలిక్ చెరో 2 వికెట్లు.. అజ్మతుల్లా ఒమర్‌జాయ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నూర్ అహ్మద్, మహ్మద్ నబీ తలో వికెట్ పడగొట్టారు.
కాగా, ఐపీఎల్-2023లో సీఎస్‌కే తరఫున సత్తా చాటిన మతీష పతిరణ.. ఆప్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్ ద్వారా వన్డే క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. పతిరణతో పాటు లెగ్ బ్రేక్ బౌలర్ దుషన్ హేమంత కూడా ఈ మ్యాచ్‌తో వన్డే అరంగేట్రం చేశాడు.
మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ స్టార్ బౌలర్, ఐపీఎల్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ వెన్ను సమస్య కారణంగా లంకతో సిరీస్‌లో తొలి రెండు వన్డేలకు దూరంగా ఉండగా.. ఐపీఎల్ సహచర ఆటగాడు (గుజరాత్ టైటాన్స్) నూర్ అహ్మద్ నేటి మ్యాచ్ బరిలో నిలిచాడు. ఐపీఎల్ సెంటర్ పాయింట్ అయిన మరో ఆఫ్ఘన్ ఆటగాడు నవీన్ ఉల్ హక్ ఇంగ్లండ్‌లో జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో పాల్గొంటున్నాడు. మూడు వన్డేల ఈ సిరీస్‌లో రెండో వన్డే ఇదే వేదికగా జూన్ 4న, మూడో వన్డే కూడా ఇదే వేదికగా జూన్ 7న జరుగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment