న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను విజయంతో మొదలుపెట్టింది శ్రీలంక. డంబుల్లా వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో 45 పరుగుల తేడాతో పర్యాటక కివీస్ జట్టును ఓడించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
సెంచరీలతో చెలరేగిన అవిష్క, కుశాల్
తొలి వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లలో పాతుమ్ నిసాంక(12) నిరాశపరిచినా.. అవిష్క ఫెర్నాండో(115 బంతుల్లో 100) అద్భుత శతకంతో మెరిశాడు. అతడికి తోడుగా వన్‌డౌన్ బ్యాటర్ కుశాల్ మెండిస్(128 బంతుల్లో 143) భారీ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
ఇక చరిత్ అసలంక సైతం కెప్టెన్ ఇన్నింగ్స్(28 బంతుల్లో 40) అలరించాడు. ఈ ముగ్గురి అద్భుత బ్యాటింగ్ కారణంగా శ్రీలంక 49.2 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 324 పరుగులు స్కోరు చేసింది. వర్షం అడ్డంకిగా మారడంతో మ్యాచ్‌ను కాసేపు నిలిపివేశారు.
కివీస్ లక్ష్యం 221
అనంతరం.. డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం.. న్యూజిలాండ్ లక్ష్యాన్ని 27 ఓవర్లలో 221 పరుగులుగా నిర్దేశించారు అంపైర్లు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన కివీస్ నిర్ణీత 27 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి కేవలం 175 పరుగులే చేసింది. ఓపెనర్లు విల్ యంగ్(48), టిమ రాబిన్సన్(35), మిడిలార్డర్ మిచెల్ బ్రాస్‌వెల్(34 నాటౌట్) ఫర్యాలేదనిపించగా.. మిగతా వాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు.
45 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఓటమి
హెన్రీ నికోల్స్(6), మార్క్ చాప్‌మన్(2), గ్లెన్ ఫిలిప్స్(9) పూర్తిగా నిరాశపరచగా.. మిచ్ హే(10), కెప్టెన్ మిచెల్ సాంట్నర్(9), నాథన్ స్మిత్(9), ఇష్ సోధి(0), జాకోబ్ డఫీ(4 నాటౌట్).. లంక బౌలర్ల ధాటికి తాళలేక చేతులెత్తేశారు. దీంతో 45 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఓటమి పాలైంది.
ఇక.. లంక బౌలర్లలో దిల్షాన్ మధుషాంక మూడు, మహీశ్ తీక్షణ, చరిత్ అసలంక చెరో రెండు, జాఫ్రీ వాండర్సే ఒక వికెట్ కూల్చారు. భారీ శతకంతో మెరిసిర కుశాల్ మెండిస్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
న్యూజిలాండ్‌కు ఘోర అవమానం.. తొమ్మిదేళ్ల తర్వాత తొలిసారి!
కాగా 2015 తర్వాత న్యూజిలాండ్‌పై వన్డేల్లో శ్రీలంకకు ఇదే తొలి విజయం. ఓవరాల్‌గా గత 12 వన్డేల్లోనూ లంక కివీస్‌పై వన్డేలో గెలవడం ఇదే తొలిసారి. కాగా 2015, డిసెంబరులో న్యూజిలాండ్ గడ్డపైనే కివీస్‌ను లంక వన్డే మ్యాచ్‌లో చివరగా ఓడించింది. ఇక 2024లో ఇప్పటి వరకు సొంతగడ్డపై 13 వన్డేలు ఆడిన శ్రీలంకకు ఇది పదో విజయం.
చదవండి: చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా ఘనత
Comments
Please login to add a commentAdd a comment