Dilshan Madushanka
-
IPL 2024: ముంబై ఇండియన్స్‌లోకి సౌతాఫ్రికా పేస్ సంచలనం
ఐపీఎల్ 17వ ఎడిషన్ ప్రారంభానికి మరి కొద్ది గంటల సమయం మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు మార్పులు చేర్పుల విషయంలో నిమగ్నమై ఉన్నాయి. గాయపడి లేదా ఇతరత్రా కారణాల చేత ఈ ఏడాది లీగ్‌కు దూరమైన ఆటగాళ్ల స్థానాలను అన్ని ఫ్రాంచైజీలు భర్తీ చేసుకునే పనిలో పడ్డాయి. తాజాగా ముంబై ఇండియన్స్ గాయం కారణంగా లీగ్‌కు దూరమైన శ్రీలంక పేసర్ దిల్షన్ మధుషంక స్థానాన్ని సౌతాఫ్రికా పేస్ సంచలనం క్వేనా మపాకాతో భర్తీ చేసినట్లు తెలుస్తుంది. Watch out for him in #IPL2024 👀pic.twitter.com/ENm7ORQsAw — CricTracker (@Cricketracker) March 20, 2024 లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్ అయిన 17 ఏళ్ల మపాకా ఇటీవల జరిగిన అండర్-19 వరల్డ్‌కప్‌లో సంచలన ప్రదర్శనలు నమోదు చేసి లైమ్‌లైట్‌లోకి వచ్చాడు. ఆ టోర్నీలో మపాకా 21 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా నిలిచాడు. అండర్-19 వరల్డ్‌కప్ చరిత్రలో మపాకాకు ముందు ఏ ఇతర పేస్ బౌలర్ అన్ని వికెట్లు (21) పడగొట్టలేదు. నిప్పులు చెరిగే వేగంతో బంతులు సంధించే మపాకా సౌతాఫ్రికా-ఏ, సౌతాఫ్రికా ఎమిర్జింగ్ టీమ్‌లకు ప్రాతినిథ్యం వహించాడు. మపాకా ఐపీఎల్ ఆడబోయే అతి చిన్న వయస్కుల్లో ఒకడిగా గుర్తించబడతాడు. మపాకా ప్రస్తుతం తన హైస్కూల్ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ చదివిన స్కూల్లోనే మపాకా కూడా చదువుతున్నాడు. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 17వ ఎడిషన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. చెన్నైలోని చిదంబరం స్టేడియం (చెపాక్) వేదికగా జరిగే సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్.. ఆర్సీబీతో తలపడుతుంది. ముంబై తమ తొలి మ్యాచ్‌ను మార్చి 24న గుజరాత్ టైటాన్స్‌తో ఆడనుంది. అనంతరం మార్చి 27న సన్‌రైజర్స్‌తో, ఏప్రిల్ 1న రాజస్థాన్ రాయల్స్‌తో, ఏప్రిల్ 7న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, నంబూరి తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, విష్ణు వినోద్, అర్జున్ టెండూల్కర్, షామ్స్ ములానీ, నేహాల్ వధేరా, జస్ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తికేయ, పీయూష్ చావ్లా, ఆకాష్ మధ్వల్ , ల్యూక్ వుడ్, రొమారియో షెపర్డ్, గెరాల్డ్ కోయెట్జీ, శ్రేయాస్ గోపాల్, నువాన్ తుషార, నమన్ ధీర్, అన్షుల్ కాంబోజ్, మొహమ్మద్ నబీ, శివాలిక్ శర్మ, క్వేనా మపాకా. గాయపడిన/ఉపసంహరించుకున్న ఆటగాళ్లు: జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, దిల్షాన్ మధుశంక. -
ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. రూ. 4 కోట్ల ఆటగాడు దూరం
ఐపీఎల్-2024కు ముందు ముంబై ఇండియన్స్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్, శ్రీలంక ఫాస్ట్ బౌలర్ దిల్షాన్ మధుశంక గాయం కారణంగా ఈ ఏడాది సీజన్ ఫస్ట్‌హాఫ్‌కు దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. మధుశంక ప్రస్తుతం తొడ కండరాల గాయంతో బాధపడతున్నాడు. ఛటోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో గాయపడ్డ మధుశంక.. ఆట మధ్యలోనే మైదానాన్ని వీడాడు. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించి స్కాన్ చేయగా గాయం తీవ్రమైనదిగా తేలింది. ఈ క్రమంలోనే అతడు బంగ్లాతో మూడో వన్డేకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ ధ్రువీకరించింది. అతడు గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు 3 వారాల సమయం పట్టనున్నట్లు శ్రీలంక క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ అదే నిజమైతే అతడు ఐపీఎల్ తొలి దశకు దూరమయ్యే ఛాన్స్ ఉంది. ఐపీఎల్-2024 వేలంలో మధుశంకను ముంబై ఇండియన్స్ రూ.4.6 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్-2023లో మధుశంక అద్బుతమైన ప్రదర్శన కనబరచడంతో ముంబై ఫ్రాంచైజీ అతడిని తమ జట్టులోకి తీసుకుంది. -
మధుశంక స్థానంలో శ్రీలంక యువ పేసర్
టీ20 ప్రపంచకప్-2022కు మెకాలి గాయం కారణంగా శ్రీలంక యువ పేసర్ దిల్షాన్ మధుశంక దూరమైన సంగతి తెలిసిందే. దీంతో అతడి స్థానంలో స్టాండ్‌బై జాబితాలో ఉన్న బినురా ఫెర్నాండోను క్రికెట్ శ్రీలంక భర్తీ చేసింది. కాగా బినురా ఫెర్నాండోను భర్తీని టీ20 ప్రపంచకప్-2022 టెక్నికల్ కమిటీ కూడా ఆమోదించింది. కాగా శ్రీలంక ప్రస్తుతం క్వాలిఫియర్స్ రౌండ్లో తలపడుతోంది. తొలి రౌండ్(గ్రూప్ ‘ఎ’)లో భాగంగా ఆదివారం నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఘోరపరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక 55 పరుగుల తేడాతో ఓటమి చెందింది. తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. నమీబియా బ్యాటర్లలో జాన్ ఫ్రయ్‌లింక్ (28 బంతుల్లో 44; 4 ఫోర్లు), స్మిత్ (16 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 108 పరుగులకే కుప్పకూలింది. నమీబియా బౌలర్లలో స్కోల్ట్జ్,షికోంగో, ఫ్రైలింక్, వైస్ తలా రెండు వికెట్లు సాధించారు. చదవండి: T20 World Cup 2022: కుశాల్ మెండిస్ సంచలన క్యాచ్.. ఒంటి చేత్తో డైవ్ చేస్తూ..