PC: Khel Now
ఐపీఎల్-2024కు ముందు ముంబై ఇండియన్స్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్, శ్రీలంక ఫాస్ట్ బౌలర్ దిల్షాన్ మధుశంక గాయం కారణంగా ఈ ఏడాది సీజన్ ఫస్ట్‌హాఫ్‌కు దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. మధుశంక ప్రస్తుతం తొడ కండరాల గాయంతో బాధపడతున్నాడు. ఛటోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో గాయపడ్డ మధుశంక.. ఆట మధ్యలోనే మైదానాన్ని వీడాడు.
దీంతో అతడిని ఆస్పత్రికి తరలించి స్కాన్ చేయగా గాయం తీవ్రమైనదిగా తేలింది. ఈ క్రమంలోనే అతడు బంగ్లాతో మూడో వన్డేకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ ధ్రువీకరించింది. అతడు గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు 3 వారాల సమయం పట్టనున్నట్లు శ్రీలంక క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.
ఒకవేళ అదే నిజమైతే అతడు ఐపీఎల్ తొలి దశకు దూరమయ్యే ఛాన్స్ ఉంది. ఐపీఎల్-2024 వేలంలో మధుశంకను ముంబై ఇండియన్స్ రూ.4.6 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్-2023లో మధుశంక అద్బుతమైన ప్రదర్శన కనబరచడంతో ముంబై ఫ్రాంచైజీ అతడిని తమ జట్టులోకి తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment