IPL 2024: ముంబై ఇండియన్స్‌లోకి సౌతాఫ్రికా పేస్‌ సంచలనం | IPL 2024: Mumbai Indians Announce Kwena Maphaka As Replacement For Dilshan Madushanka | Sakshi
Sakshi News home page

IPL 2024: ముంబై ఇండియన్స్‌లోకి సౌతాఫ్రికా పేస్‌ సంచలనం

Published Wed, Mar 20 2024 9:44 PM | Last Updated on Thu, Mar 21 2024 10:23 AM

IPL 2024: Mumbai Indians Announces Kwena Maphaka As Replacement For Dilshan Madushanka - Sakshi

ఐపీఎల్‌ 17వ ఎడిషన్‌ ప్రారంభానికి మరి కొద్ది గంటల సమయం మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు మార్పులు చేర్పుల విషయంలో నిమగ్నమై ఉన్నాయి.

గాయపడి లేదా ఇతరత్రా కారణాల చేత ఈ ఏడాది లీగ్‌కు దూరమైన ఆటగాళ్ల స్థానాలను అన్ని ఫ్రాంచైజీలు భర్తీ చేసుకునే పనిలో పడ్డాయి. తాజాగా ముంబై ఇండియన్స్‌ గాయం కారణంగా లీగ్‌కు దూరమైన శ్రీలంక పేసర్‌ దిల్షన్‌ మధుషంక స్థానాన్ని సౌతాఫ్రికా పేస్‌ సంచలనం క్వేనా మపాకాతో భర్తీ చేసినట్లు తెలుస్తుంది.

లెఫ్ట్‌ ఆర్మ్‌ పేస్‌ బౌలర్‌ అయిన 17 ఏళ్ల మపాకా ఇటీవల జరిగిన అండర్‌-19 వరల్డ్‌కప్‌లో సంచలన ప్రదర్శనలు నమోదు చేసి లైమ్‌లైట్‌లోకి వచ్చాడు. ఆ టోర్నీలో మపాకా 21 వికెట్లు పడగొట్టి ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌గా నిలిచాడు. అండర్‌-19 వరల్డ్‌కప్‌ చరిత్రలో మపాకాకు ముందు ఏ ఇతర పేస్‌ బౌలర్‌ అన్ని వికెట్లు (21) పడగొట్టలేదు.

నిప్పులు చెరిగే వేగంతో బంతులు సంధించే మపాకా సౌతాఫ్రికా-ఏ, సౌతాఫ్రికా ఎమిర్జింగ్‌ టీమ్‌లకు ప్రాతినిథ్యం వహించాడు. మపాకా ఐపీఎల్‌ ఆడబోయే అతి చిన్న వయస్కుల్లో ఒకడిగా గుర్తించబడతాడు. మపాకా ప్రస్తుతం తన హైస్కూల్‌ ఫైనల్‌ ఇయర్‌లో ఉన్నాడు. దక్షిణాఫ్రికా స్టార్‌ పేసర్‌ కగిసో రబాడ చదివిన స్కూల్‌లోనే మపాకా కూడా చదువుతున్నాడు. 

ఇదిలా ఉంటే, ఐపీఎల్‌ 17వ ఎడిషన్‌ మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. చెన్నైలోని చిదంబరం స్టేడియం (చెపాక్‌) వేదికగా జరిగే సీజన్‌ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌.. ఆర్సీబీతో తలపడుతుంది. ముంబై తమ తొలి మ్యాచ్‌ను మార్చి 24న గుజరాత్‌ టైటాన్స్‌తో ఆడనుంది. అనంతరం మార్చి 27న సన్‌రైజర్స్‌తో, ఏప్రిల్‌ 1న రాజస్థాన్‌ రాయల్స్‌తో, ఏప్రిల్‌ 7న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై ఇండియన్స్‌ తలపడనుంది.

ముంబై ఇండియన్స్‌: హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, నంబూరి తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, విష్ణు వినోద్, అర్జున్ టెండూల్కర్, షామ్స్ ములానీ, నేహాల్ వధేరా, జస్‌ప్రీత్‌ బుమ్రా, కుమార్ కార్తికేయ, పీయూష్ చావ్లా, ఆకాష్ మధ్వల్ , ల్యూక్ వుడ్, రొమారియో షెపర్డ్, గెరాల్డ్ కోయెట్జీ, శ్రేయాస్ గోపాల్, నువాన్ తుషార, నమన్ ధీర్, అన్షుల్ కాంబోజ్, మొహమ్మద్ నబీ, శివాలిక్ శర్మ, క్వేనా మపాకా. 

గాయపడిన/ఉపసంహరించుకున్న ఆటగాళ్లు: జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, దిల్షాన్ మధుశంక.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement