Sri Lankas T20 World Cup Squad: Binura Fernando To Replace Madushanka, Details Inside - Sakshi
Sakshi News home page

T20 World Cup 2022: మధుశంక స్థానంలో శ్రీలంక యువ పేసర్‌

Published Mon, Oct 17 2022 12:25 PM | Last Updated on Mon, Oct 17 2022 1:20 PM

Binura Fernando replaces Madushanka in Sri Lankas T20 World Cup squad - Sakshi

టీ20 ప్రపంచకప్‌-2022కు మెకాలి గాయం కారణంగా శ్రీలంక యువ పేసర్‌ దిల్షాన్‌ మధుశంక దూరమైన సంగతి తెలిసిందే. దీంతో అతడి స్థానంలో స్టాండ్‌బై జాబితాలో ఉన్న బినురా ఫెర్నాండోను క్రికెట్‌ శ్రీలంక భర్తీ చేసింది. కాగా బినురా ఫెర్నాండోను భర్తీని టీ20 ప్రపంచకప్‌-2022 టెక్నికల్‌ కమిటీ కూడా ఆమోదించింది.

కాగా శ్రీలంక ప్రస్తుతం క్వాలిఫియర్స్‌ రౌండ్‌లో తలపడుతోంది. తొలి రౌండ్‌(గ్రూప్‌ ‘ఎ’)లో భాగంగా ఆదివారం నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఘోరపరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక 55 పరుగుల తేడాతో ఓటమి చెందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన నమీబియా  20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది.

నమీబియా బ్యాటర్లలో జాన్‌ ఫ్రయ్‌లింక్‌ (28 బంతుల్లో 44; 4 ఫోర్లు), స్మిత్‌ (16 బంతుల్లో 31 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 108 పరుగులకే కుప్పకూలింది. నమీబియా బౌలర్లలో స్కోల్ట్జ్,షికోంగో, ఫ్రైలింక్, వైస్‌ తలా రెండు వికెట్లు సాధించారు.
చదవండి: T20 World Cup 2022: కుశాల్‌ మెండిస్‌ సంచలన క్యాచ్‌.. ఒంటి చేత్తో డైవ్‌ చేస్తూ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement