Binura Fernando
-
మరి కొన్ని గంట్లలో భారత్‌తో మ్యాచ్.. శ్రీలంకకు బిగ్ షాక్
భారత్-శ్రీలంక టీ20 సిరీస్‌కు మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. శనివారం(జూలై 27)న పల్లెకెలె వేదికగా జరగనున్న తొలి టీ20లో భారత్-శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు శ్రీలంకకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ బినుర ఫెర్నాండో అనారోగ్యం కారణంగా తొలి టీ20కు దూరమయ్యాడు. ఛాతీలో ఇన్ఫెక్షన్ కారణంగా ఫెర్నాండో ఆస్పత్రిలో చేరాడు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. . అతడి స్ధానంలో ఆల్‌రౌండర్ రమేష్ మెండిస్‌ను స్టాండ్‌బై ప్లేయర్‌గా శ్రీలంక క్రికెట్ ఎంపిక చేసింది. ఇప్పటికే భారత్‌తో టీ20 సిరీస్‌కు స్టార్ ఫాస్ట్ బౌలర్లు నువాన్ తుషారా, చమీరా గాయాల కారణంగా దూరమయ్యారు. ఇప్పుడు ఫెర్నాండో కూడా దూరం కావడం శ్రీలంకకు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పుకోవాలికాగా ఫెర్నాండో ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవలే ముగిసిన లంక ప్రీమీయర్ లీగ్‌లో 13 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. ఇక ఈ సిరీస్‌లో శ్రీలంక కెప్టెన్‌గా చరిత్ అసలంక వ్యవహరించనున్నాడు. వనిందు హసరంగా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో అసలంకకు జట్టు పగ్గాలను లంక క్రికెట్ అప్పగించింది. మరోవైపు భారత జట్టును సూర్యకుమార్ యాదవ్ నడిపించనున్నాడు. రోహిత్ శర్మ స్ధానంలో భారత జట్టు కెప్టెన్‌గా సూర్యకుమార్‌ను బీసీసీఐ నియమించింది. -
లంకకు దెబ్బ మీద దెబ్బ.. మరో కీలక ఆటగాడు దూరం
టి20 ప్రపంచకప్‌లో శ్రీలంక జట్టును గాయాలు వీడడం లేదు. ఇప్పటికే ముగ్గురు టాప్ ఆటగాళ్లు గాయాలతో జట్టును వీడగా.. తాజాగా లంక స్టార్ పేసర్ బినురా ఫెర్నాండో ఈ జాబితాలో చేరాడు. తొడ కండరాల గాయంతో టి20 ప్రపంచకప్ నుంచి వైదొలిగాడు. అతని స్థానంలో 27 ఏళ్ల ఆసిత ఫెర్నాండోను ఎంపిక చేసినట్లు లంక క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఐర్లాండ్‌తో తొలి మ్యాచ్‌లో గెలిచిన లంకకు ఆ తర్వాత ఆస్ట్రేలియా చేతిలో పరాజయమే ఎదురైంది. కాగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో బౌలింగ్ చేసిన బినురా ఫెర్నాండో తన తొలి ఓవర్లోనే గాయపడ్డాడు. ఓవర్ ఐదో బంతి వేస్తుండగా తొడ కండరాల పట్టేయడంతో మ్యాచ్‌ను నుంచి పక్కకు తప్పుకున్నాడు. అప్పటినుంచి గాయం నుంచి కోలుకోని ఫెర్నాండో తాజాగా టి20 ప్రపంచకప్ నుంచి మొత్తానికే దూరమైనట్లు బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే దనుష్క గుణతిలక, దుష్మంత చమీరా, దిల్షాన్ మధుషనకలు గాయాలతో జట్టును వీడారు. గ్రూఫ్-1లో ఉన్న శ్రీలంక ఒక గెలుపు, ఓటమితో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతున్నది. లంక తన తర్వతి మ్యాచ్ శనివారం సిడ్నీ వేదికగా పటిష్టమైన కివీస్‌తో ఆడనుంది. శ్రీలంక జట్టు: దాసున్ షనక (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, కుశాల్ మెండిస్, చరిత్ అసలంక, భానుక రాజపక్సే, ధనంజయ డి సిల్వా, వనిందు హసరంగా, మహేశ్ తీక్షణ, జెఫ్రీ వాండర్సే, చమిక కరుణరత్నే, కసున్ రజిత, అషెన్ బండార, లహిరు కుమారా, ప్రమోద్ మధుషన్, అసిత ఫెర్నాండో. స్టాండ్‌బై ప్లేయర్స్: ప్రవీణ్ జయవిక్రమ, దినేష్ చండిమల్, నువానీడు ఫెర్నాండో. చదవండి: లైవ్ మ్యాచ్‌లో లవ్ ప్రపోజ్.. మరో దీపక్ చహర్ మాత్రం కాదు -
మధుశంక స్థానంలో శ్రీలంక యువ పేసర్
టీ20 ప్రపంచకప్-2022కు మెకాలి గాయం కారణంగా శ్రీలంక యువ పేసర్ దిల్షాన్ మధుశంక దూరమైన సంగతి తెలిసిందే. దీంతో అతడి స్థానంలో స్టాండ్‌బై జాబితాలో ఉన్న బినురా ఫెర్నాండోను క్రికెట్ శ్రీలంక భర్తీ చేసింది. కాగా బినురా ఫెర్నాండోను భర్తీని టీ20 ప్రపంచకప్-2022 టెక్నికల్ కమిటీ కూడా ఆమోదించింది. కాగా శ్రీలంక ప్రస్తుతం క్వాలిఫియర్స్ రౌండ్లో తలపడుతోంది. తొలి రౌండ్(గ్రూప్ ‘ఎ’)లో భాగంగా ఆదివారం నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఘోరపరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక 55 పరుగుల తేడాతో ఓటమి చెందింది. తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. నమీబియా బ్యాటర్లలో జాన్ ఫ్రయ్‌లింక్ (28 బంతుల్లో 44; 4 ఫోర్లు), స్మిత్ (16 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 108 పరుగులకే కుప్పకూలింది. నమీబియా బౌలర్లలో స్కోల్ట్జ్,షికోంగో, ఫ్రైలింక్, వైస్ తలా రెండు వికెట్లు సాధించారు. చదవండి: T20 World Cup 2022: కుశాల్ మెండిస్ సంచలన క్యాచ్.. ఒంటి చేత్తో డైవ్ చేస్తూ..