టి20 ప్రపంచకప్‌లో శ్రీలంక జట్టును గాయాలు వీడడం లేదు. ఇప్పటికే ముగ్గురు టాప్ ఆటగాళ్లు గాయాలతో జట్టును వీడగా.. తాజాగా లంక స్టార్ పేసర్ బినురా ఫెర్నాండో ఈ జాబితాలో చేరాడు. తొడ కండరాల గాయంతో టి20 ప్రపంచకప్ నుంచి వైదొలిగాడు. అతని స్థానంలో 27 ఏళ్ల ఆసిత ఫెర్నాండోను ఎంపిక చేసినట్లు లంక క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఐర్లాండ్‌తో తొలి మ్యాచ్‌లో గెలిచిన లంకకు ఆ తర్వాత ఆస్ట్రేలియా చేతిలో పరాజయమే ఎదురైంది.
కాగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో బౌలింగ్ చేసిన బినురా ఫెర్నాండో తన తొలి ఓవర్‌లోనే గాయపడ్డాడు. ఓవర్ ఐదో బంతి వేస్తుండగా తొడ కండరాల పట్టేయడంతో మ్యాచ్‌ను నుంచి పక్కకు తప్పుకున్నాడు. అప్పటినుంచి గాయం నుంచి కోలుకోని ఫెర్నాండో తాజాగా టి20 ప్రపంచకప్ నుంచి మొత్తానికే దూరమైనట్లు బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.
ఇప్పటికే దనుష్క గుణతిలక, దుష్మంత చమీరా, దిల్షాన్ మధుషనకలు గాయాలతో జట్టును వీడారు. గ్రూఫ్-1లో ఉన్న శ్రీలంక ఒక గెలుపు, ఓటమితో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతున్నది. లంక తన తర్వతి మ్యాచ్ శనివారం సిడ్నీ వేదికగా పటిష్టమైన కివీస్‌తో ఆడనుంది.
శ్రీలంక జట్టు: దాసున్ షనక (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, కుశాల్ మెండిస్, చరిత్ అసలంక, భానుక రాజపక్సే, ధనంజయ డి సిల్వా, వనిందు హసరంగా, మహేశ్ తీక్షణ, జెఫ్రీ వాండర్సే, చమిక కరుణరత్నే, కసున్ రజిత, అషెన్ బండార, లహిరు కుమారా, ప్రమోద్ మధుషన్, అసిత ఫెర్నాండో.
స్టాండ్‌బై ప్లేయర్స్: ప్రవీణ్ జయవిక్రమ, దినేష్ చండిమల్, నువానీడు ఫెర్నాండో.
చదవండి: లైవ్ మ్యాచ్‌లో లవ్ ప్రపోజ్.. మరో దీపక్ చహర్ మాత్రం కాదు
Comments
Please login to add a commentAdd a comment