టి20 ప్రపంచకప్‌లో భాగంగా నెదర్లాండ్స్, శ్రీలంకల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సూపర్-12లో అడుగుపెడితే.. ఓడిన జట్టు ఇంటిబాట పడుతుంది. ఈ నేపథ్యంలోనే గురువారం జరుగుతున్న క్వాలిఫయింగ్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. లంక ఓపెనర్ కుశాల్ మెండిస్(44 బంతుల్లో 79, 5 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరవగా.. చరిత్ అసలంక 31 పరుగులు, బానుక రాజపక్స 19 పరుగులు చేశాడు. నెదర్లాండ్స్ బౌలర్లలో బాస్ డీ లీడే , పాల్ వాన్ మీక్రెన్‌లు చెరో రెండు వికెట్లు తీయగా.. ఫ్రెడ్ క్లాసెన్, టిమ్ వాన్‌డర్ గగ్టెన్‌లు తలా ఒక వికెట్ తీశారు.
లంక ఇన్నింగ్స్‌ను పాతుమ్ నిస్సాంక, కుశాల్ మెండిస్‌లు ఆరంభించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 36 పరుగులు జోడించాకా 14 పరుగులు చేసిన నిస్సాంక వాన్ మీక్రెన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత దనుంజయ డిసిల్వా తొలి బంతికే ఔట్ అయి గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఇక కుశాల్‌కు చరిత్ అసలంక(31 పరుగులు) తోడవ్వడంతో లంక స్కోరు ముందుకు కదిలింది. నాలుగో వికెట్‌కు కుశాల్, అసలంకలు కలిసి 60 పరుగులు జోడించారు.
ఆ తర్వాత బానుక రాజపక్స వచ్చి స్కోరును పెంచే వేగంలో 19 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ వెంటనే కుషాల్ మెండిస్ కూడా వెనుదిరిగాడు. చివర్లో షనక, హసరంగాలు తలా ఇన్ని పరుగులు చేయడంతో లంక 162 పరుగుల గౌరవ ప్రదమైన స్కోరు సాధించింది.
చదవండి: కిందా మీదా పడి చివరకు ఎలాగోలా!
Comments
Please login to add a commentAdd a comment