భారత్-శ్రీలంక టీ20 సిరీస్‌కు మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. శనివారం(జూలై 27)న పల్లెకెలె వేదికగా జరగనున్న తొలి టీ20లో భారత్-శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు శ్రీలంకకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ బినుర ఫెర్నాండో అనారోగ్యం కారణంగా తొలి టీ20కు దూరమయ్యాడు.
ఛాతీలో ఇన్ఫెక్షన్ కారణంగా ఫెర్నాండో ఆస్పత్రిలో చేరాడు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. . అతడి స్ధానంలో ఆల్‌రౌండర్ రమేష్ మెండిస్‌ను స్టాండ్‌బై ప్లేయర్‌గా శ్రీలంక క్రికెట్ ఎంపిక చేసింది. ఇప్పటికే భారత్‌తో టీ20 సిరీస్‌కు స్టార్ ఫాస్ట్ బౌలర్లు నువాన్ తుషారా, చమీరా గాయాల కారణంగా దూరమయ్యారు.
ఇప్పుడు ఫెర్నాండో కూడా దూరం కావడం శ్రీలంకకు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పుకోవాలికాగా ఫెర్నాండో ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవలే ముగిసిన లంక ప్రీమీయర్ లీగ్‌లో 13 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. ఇక ఈ సిరీస్‌లో శ్రీలంక కెప్టెన్‌గా చరిత్ అసలంక వ్యవహరించనున్నాడు.
వనిందు హసరంగా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో అసలంకకు జట్టు పగ్గాలను లంక క్రికెట్ అప్పగించింది. మరోవైపు భారత జట్టును సూర్యకుమార్ యాదవ్ నడిపించనున్నాడు. రోహిత్ శర్మ స్ధానంలో భారత జట్టు కెప్టెన్‌గా సూర్యకుమార్‌ను బీసీసీఐ నియమించింది.
Comments
Please login to add a commentAdd a comment