రషీద్ ఖాన్
ICC T20I Bowling Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అఫ్గనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ సత్తా చాటాడు. పాకిస్తాన్‌తో టీ20 సిరీస్‌లో అదరగొట్టిన ఈ లెగ్ స్పిన్నర్ మరోసారి అగ్రస్థానానికి చేరుకున్నాడు. శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగను వెనక్కినెట్టి మొదటి ర్యాంకు సాధించాడు. టీ20 ఫార్మాట్‌లో 2018లో తొలిసారి అగ్రపీఠాన్ని అధిరోహించిన రషీద్ ఖాన్.. మరోసారి వరల్డ్ నంబర్ 1గా నిలిచాడు.
కాగా షార్జా వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో రషీద్ ఖాన్ పొదుపుగా బౌలింగ్ చేశాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా.. తొలి టీ20లో ఒక వికెట్ తీసిన ఈ అఫ్గన్ సారథి.. రెండో మ్యాచ్‌లోనూ ఒక వికెట్ పడగొట్టాడు. ఆఖరిదైన మూడో టీ20లోనూ ఒక వికెట్‌తో మెరిశాడు.
టాప్-3లో ఇద్దరు..
ఈ క్రమంలో 710 రేటింగ్ పాయింట్లతో హసరంగను అధిగమించి ప్రథమ స్థానాన్ని ఆక్రమించాడు. అఫ్గన్‌కు చెందిన పేసర్ ఫజల్‌హక్ ఫారూకీ మూడో స్థానంలోకి దూసుకువచ్చాడు. పాక్‌తో సిరీస్‌లో 5 వికెట్లతో చెలరేగిన అతడు టాప్-5లో అడుగుపెట్టాడు. దీంతో ఐపీఎల్-2023కి ముందు మంచి బూస్టప్ లభించిందంటూ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
కాగా ఈ సీజన్‌లో ఫారూకీ ఎస్‌ఆర్‌హెచ్‌కు ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఇక మిస్టరీ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ ఎనిమిదో ర్యాంకుకు ఎగబాకాడు. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్‌తో టీ20 సిరీస్‌ను 2-1తో గెలిచిన రషీద్ బృందం చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.
ఐసీసీ టీ20 బౌలింగ్ తాజా ర్యాంకింగ్స్
1. రషీద్ ఖాన్- అఫ్గనిస్తాన్- 710 పాయింట్లు
2. వనిందు హసరంగ- శ్రీలంక- 695 పాయింట్లు
3. ఫజల్‌హక్ ఫారూకీ- అఫ్గనిస్తాన్- 692 పాయింట్లు
4. జోష్ హాజిల్‌వుడ్- ఆస్ట్రేలియా- 690 పాయింట్లు
5. ఆదిల్ రషీద్- ఇంగ్లండ్- 684 పాయింట్లు
Comments
Please login to add a commentAdd a comment