ముజీబ్‌ను హత్తుకుని ఏడ్చేసిన బుడ్డోడు (PC: X)
ICC ODI WC 2023: ఆటలో గెలుపోటములు సహజం.. అయితే, ఒక్కోసారి భావోద్వేగాలు ఇలాంటి సహజ అంశాలపై పైచేయి సాధిస్తాయి. సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిన సందర్భాల్లో.. అది కూడా తమకు గతంలో సాధ్యం కాని ఘనత సాధిస్తే.. గెలిచిన జట్టు పట్టరాని సంతోషంలో మునిగిపోతుంది. వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా ఆదివారం అఫ్గనిస్తాన్ జట్టు ఇలాంటి అనుభూతిని ఆస్వాదించింది.
ఇంగ్లండ్ ఆటగాడు మార్క్‌వుడ్‌ను తమ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ బౌల్డ్ చేయగానే అఫ్గన్ సంబరాలు అంబరాన్నంటాయి. మొట్టమొదటిసారిగా.. అది కూడా వన్డే ప్రపంచకప్ వంటి ఐసీసీ టోర్నీ సందర్భంగా ఇంగ్లండ్‌పై చారిత్రాత్మక విజయం అందుకోవడంతో అఫ్గన్ ఆటగాళ్ల ముఖాలు మతాబుల్లా వెలిగిపోయాయి.
సంతోషం పట్టలేక.. కన్నీటి పర్యంతం
డిఫెండింగ్ చాంపియన్‌ను ఓడించామన్న విజయగర్వంతో వారి కళ్లు మెరిసిపోయాయి. ఈ దృశ్యాల్ని చూసిన అభిమానుల గుండెలు ఆనందంతో నిండిపోయాయి. అయితే, ఓ బుల్లి అభిమాని మాత్రం ఈ సంతోషాన్ని పట్టలేక కన్నీటి పర్యంతమయ్యాడు.
ఇంగ్లండ్‌పై అఫ్గన్ సంచలన విజయంలో కీలక పాత్ర పోషించిన ముజీబ్ ఉర్ రహ్మాన్‌ను హత్తుకుని ఆనందభాష్పాలు రాల్చాడు. ఇదేమీ ఫైనల్ మ్యాచ్ కాకపోయినా.. అఫ్గనిస్తాన్‌కు ఈ గెలుపు ఎంతటి సంతోషాన్నిచ్చిందో తన చర్య ద్వారా ప్రపంచానికి తెలియజేశాడు.
1100 కిలోమీటర్లు ప్రయాణించి
పదకొండు వందల కిలోమీటర్లు ప్రయాణించి భారత్ రాజధాని ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం దాకా వచ్చినందుకు తనకు దక్కిన బహుమతికి మురిసిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
బ్యూటీ ఆఫ్ క్రికెట్
ఇందుకు స్పందించిన నెటిజన్లు.. ‘‘క్రికెట్‌లో ఉన్న అందమే ఇది’’ అంటూ ఆ చిన్నోడిని చూసి ఆనందిస్తూ.. అఫ్గనిస్తాన్ ఆటగాళ్లకు అభినందనలు తెలిజయజేస్తున్నారు. కాగా ఢిల్లీ వేదికగా ఇంగ్లండ్‌పై అనూహ్య రీతిలో అఫ్గనిస్తాన్ 69 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్
ఈ మ్యాచ్‌లో లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసిన రైట్ ఆర్మ్ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రహ్మాన్ 16 బంతుల్లో 28 పరుగులు సాధించాడు. అదే విధంగా.. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జో రూట్(11), హ్యారీ బ్రూక్(66), క్రిస్ వోక్స్(9) వికెట్లు తీశాడు. తద్వారా అఫ్గనిస్తాన్ గెలుపులో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
చదవండి: CWC 2023: ఆఫ్ఘనిస్తాన్ చారిత్రక విజయం వెనుక ఇంగ్లండ్ మాజీ ఆటగాడి హస్తం
This is the way to celebrate the very beautiful game of cricket.
— Amock (@Politics_2022_) October 15, 2023
An Afghanistan kid traveled 1100 KM & finally they upset England to win the WC match.
This boy hugged Mujeeb in tears, they admire #Rashid & #Gurbaz to get little happiness from sports.
What a game #ENGvsAFG.🔥 pic.twitter.com/T1D3Uvp4Zv
Comments
Please login to add a commentAdd a comment