స్వదేశంలో బంగ్లాదేశ్‌కు ఆఫ్ఘనిస్తాన్ భారీ షాకిచ్చింది. 3 వన్డేల సిరీస్‌లో భాగంగా చట్టోగ్రామ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆఫ్ఘన్ జట్టు డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. వర్షం అంతరాయల నడుమ 43 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 9 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఛేదనలో ఆఫ్ఘనిస్తాన్ 83/2 (21.4 ఓవర్లు) స్కోర్ వద్ద ఉండగా వర్షం మరోసారి పలకరించింది. ఈ సమయంలో మొదలైన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన ఎంపైర్లు ఆఫ్ఘనిస్తాన్‌ను విజేతగా ప్రకటించారు.
సత్తా చాటిన ఆఫ్ఘన్ బౌలర్లు..
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్.. బంగ్లాదేశ్‌ను తక్కువ స్కోర్‌కే పరిమితం చేసింది. ఆఫ్ఘన్ బౌలర్లు ఫజల్ హాక్ ఫారూఖీ (3/24), ముజీబ్ ఉర్ రెహ్మాన్ (2/23), రషీద్ ఖాన్ (2/21), మహ్మద్ నబీ (1/25), అజ్మతుల్లా (1/39) బంగ్లాదేశ్‌ను దెబ్బకొట్టారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో తౌహిద్ హ్రిదోయ్ (51) అర్ధసెంచరీతో రాణించగా.. తమీమ్ ఇక్బాల్ (13), లిటన్ దాస్ (26), షాంటో (12), షకీబ్ (15) రెండంకెల స్కోర్లు చేశారు.
అలసట లేకుండా గెలుపొందిన ఆఫ్ఘనిస్తాన్..
170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్.. వరుణుడి పుణ్యమా అని అలసట లేకుండా గెలుపొందింది. 21.4 ఓవర్ల వద్ద (83/2) మొదలైన వర్షం ఎంతకీ ఆగకపోవడంతో అంపైర్లు డక్‌వర్త్ లూయిస్ పద్దతిన ఆఫ్ఘనిస్తాన్‌ను విజేతగా ప్రకటించారు. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో ఇబ్రహీం జద్రాన్ (41 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఈ గెలుపుతో ఆఫ్ఘనిస్తాన్ 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో వన్డే ఇదే వేదికగా జులై 8న జరుగనుంది. కాగా, ఈ సిరీస్‌లో భాగంగా జరిగిన ఏకైక టెస్ట్‌లో బంగ్లాదేశ్ 546 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. వన్డే సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment