PSL 2022: Rashid Khan Receives Guard of Honour From His Teammates - Sakshi
Sakshi News home page

Rashid Khan: గార్డ్ ఆఫ్ హానర్‌ స్వీకరించిన రషీద్‌ ఖాన్‌.. ఎందుకో తెలుసా?

Published Sun, Feb 20 2022 1:41 PM | Last Updated on Sun, Feb 20 2022 3:46 PM

Rashid Khan receives guard of honour from his teammates - Sakshi

పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో లాహోర్ ఖలందర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రషీద్‌ ఖాన్‌ టోర్నీ మధ్య నుంచి తప్పుకున్నాడు. చటోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో ఆఫ్ఘనిస్తాన్ పరిమిత ఓవర్ల సిరీస్‌ ఆడనుంది. ఫిబ్రవరి 23న ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌ మధ్య తొలి వన్డే జరగనుంది. దీంతో జాతీయ విధుల కారణంగా పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ నుంచి రషీద్‌ తప్పుకున్నాడు. ఇక శనివారం పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో ఇస్లామాబాద్‌ యూనైటడ్‌తో  లాహోర్ ఖలందర్స్‌ తలపడింది.  ఈ మ్యాచ్‌లో 66 పరుగల తేడాతో లాహోర్ ఘన విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో రషీద్‌ ఖాన్‌ రెండు వికెట్లు పడగొట్టి లాహోర్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే మ్యాచ్‌ అనంతరం లాహోర్ క్వాలండర్స్ ఆటగాళ్ల నుంచి రషీద్ ఖాన్‌  గార్డ్ ఆఫ్ హానర్‌ స్వీకరించాడు. అదే విధంగా కెప్టెన్‌  షాహీన్ ఆఫ్రిది ..రషీద్ ఖాన్‌ను హాగ్‌ చేసుకుని విడ్కోలు పలికాడు.దీనికి సంబంధించిన వీడియోను లాహోర్ ఖలందర్స్‌ ట్విటర్‌లో షేర్‌ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: IND vs SL: 46 మ్యాచ్‌లు.. 196 వికెట్లు.. ఏకంగా భారత జట్టులోకి ఏంట్రీ.. ఎవరీ సౌరభ్ కుమార్‌ ?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement