పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో భాగంగా ముల్తాన్ సుల్తాన్‌తో జరగిన మ్యాచ్‌లో లాహోర్ ఖలందర్స్ బ్యాటర్ రషీద్ ఖాన్ కళ్లు చెదిరే సిక్స్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. లాహోర్ ఇన్నింగ్స్ 20 ఓవర్ వేసిన దహానీ బౌలింగ్‌లో.. బంతిని చూడకుండానే రషీద్ అద్భుతమైన సిక్స్ బాదాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఇన్నింగ్స్ అఖరి ఓవర్‌లో రెండు సిక్స్‌లు, ఒక ఫోర్‌తో 16 పరుగులు రాబాట్టాడు.
అదే విధంగా బౌలింగ్‌లో తన నాలుగు ఓవర్ల కోటాలో రషీద్ 28 పరుగులు ఇచ్చి ఒకే ఒక వికెట్ పడగొట్టాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లాహోర్ నిర్ణీత 20 ఓవర్లలో 206 పరుగల భారీ స్కోరు సాధించింది. లాహోర్ బ్యాటర్లలో ఫఖర్ జమాన్ (76), కమ్రాన్ గులాం(43) పరుగులతో రాణించారు. ఇక 207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముల్తాన్ సుల్తాన్ కేవలం 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ముల్తాన్ సుల్తాన్ విజయంలో షాన్ మసూద్(83), మహ్మద్ రిజ్వాన్(69) కీలక పాత్ర పోషించారు.
చదవండి: యార్కర్‌తో వికెట్ పడగొట్టాడు.. అభిమానులకు దండం పెట్టాడు!
Don’t you love these @rashidkhan_19 sixes? 🤩#HBLPSL7 l #LevelHai l #MSvLQ pic.twitter.com/Mq9Vz3I3DW
— PakistanSuperLeague (@thePSLt20) January 29, 2022
Comments
Please login to add a commentAdd a comment