స్కార్ బారాగ్: ఇంగ్లండ్ తో ఇక్కడ జరుగుతున్న రెండో వన్డేలో భారత మహిళలు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నారు.తొలి వన్డేలో ఇంగ్లండ్ పై ఓటమి చవిచూసిన భారత్.. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను సమం చేయాలని భావిస్తోంది. ఇంగ్లండ్ ఓపెనర్లు ఎడ్వర్డ్స్, నైట్ లు ఇన్నింగ్స్ ను ఆరంభించారు. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా జరిగిన తొలి వన్డేలో భారత్ ను వరుణుడు ఎక్కిరించాడు.
భారత మహిళలు పటిష్టమైన స్థితిలో ఉన్నా.. పదే పదే వర్షం రావడంతో డక్ వర్త్ లూయిస్ ప్రకారం ఇంగ్లండ్ విజయం సాధించింది. అంతకుముందు జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్ లో భారత మహిళలు విజయం సాధించి ఇంగ్లండ్ ను కంగుతినిపించిన సంగతి తెలిసిందే.