Duckworth-Lewis method
-
బుమ్రా బృందం శుభారంభం
డబ్లిన్: భారత పేస్ తురుపుముక్క జస్ప్రీత్ బుమ్రా (2/24) తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. 11 నెలల సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగిన ఈ సీనియర్ సీమర్ వన్డే ప్రపంచకప్‌కు ముందు భారత బౌలింగ్ దళానికి తాను వెన్నుదన్నుగా ఉంటానని భరోసా ఇచ్చాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే అనుకున్నట్లే భారత్, ఐర్లాండ్ తొలి టి20ని వరుణుడు అడ్డుకున్నాడు. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్ 2 పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై గెలిచింది. ఈ మ్యాచ్‌తో రింకూ సింగ్, ప్రసిధ్ కృష్ణ భారత్ తరఫున టి20ల్లో అరంగేట్రం చేశారు. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. బారీ మెకార్తీ (33 బంతుల్లో 51 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరిపించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ తలా 2 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన భారత్ వర్షంతో ఆట నిలిచే సమయానికి 6.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (23 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్), రుతురాజ్ గైక్వాడ్ (16 బంతుల్లో 19 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) ధాటిగా ఆడారు. పవర్‌ప్లేలో ఓపెనింగ్ జోడీ 45 పరుగులు చేసింది. ఏడో ఓవర్ వేసిన క్రెయిగ్ యంగ్ 5 బంతులేసి 2 వికెట్లు పడగొట్టాడు. తిలక్ వర్మ (0) డకౌటయ్యాడు. వర్షంతో ఆట నిలిచే సమయానికి డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో భారత విజయ సమీకరణం 45 పరుగులుగా ఉంది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1–0తో ఆధిక్యంలో నిలిచింది. ఆదివారం ఇదే వేదికపై రెండో మ్యాచ్ జరుగుతుంది. బుమ్రా ధాటికి... చాన్నాళ్ల తర్వాత మైదానంలోకి దిగిన భారత పేసర్, కెపె్టన్ బుమ్రా తన పేస్‌లో పదును ఏమాత్రం తగ్గలేదని తొలి ఓవర్లోనే చూపించాడు. అతని ధాటికి ఓపెనర్ బల్బిర్నీ (4) క్లీన్‌బౌల్డ్ కాగా, టక్కర్ (0) ఖాతానే తెరవలేదు. తర్వాత ప్రసిధ్ కృష్ణ కూడా ఐర్లాండ్ ఇన్నింగ్స్‌ను చావుదెబ్బ తీయడంతో 31 పరుగులకే 5 వికెట్లను కోల్పోయింది. అయితే క్యాంఫర్ (33 బంతుల్లో 39; 3 ఫోర్లు, 1 సిక్స్) ఆదుకోగా, మెకార్తీ డెత్ ఓవర్లలో చెలరేగడంతో ఐర్లాండ్ చెప్పుకోదగ్గ స్కోరు చేసింది. స్కోరు వివరాలు ఐర్లాండ్ ఇన్నింగ్స్: బల్బిర్నీ (బి) బుమ్రా 4; స్టిర్లింగ్ (బి) బిష్ణోయ్ 11; టక్కర్ (సి) సామ్సన్ (బి) బుమ్రా 0; టెక్టర్ (సి) తిలక్ (బి) ప్రసిధ్ కృష్ణ 9; క్యాంఫర్ (బి) అర్శ్‌దీప్ 39; డాక్రెల్ (సి) రుతురాజ్ (బి) ప్రసిధ్ కృష్ణ 1; మార్క్ అడైర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) బిష్ణోయ్ 16; మెకార్తీ (నాటౌట్) 51; యంగ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 139. వికెట్ల పతనం: 1–4, 2–4, 3–27, 4–27, 5–31, 6–59, 7–116. బౌలింగ్: బుమ్రా 4–0–24–2, అర్ష్‌దీప్ 4–0–35–1, ప్రసిధ్ కృష్ణ 4–0–32–2, రవి బిష్ణోయ్ 4–0–23–2, శివమ్ దూబే 1–0–6–0, వాషింగ్టన్ సుందర్ 3–0–19–0. భారత్ ఇన్నింగ్స్: యశస్వి (సి) స్టిర్లింగ్ (బి) యంగ్ 24; రుతురాజ్ (నాటౌట్) 19; తిలక్ వర్మ (సి) టక్కర్ (బి) యంగ్ 0; సామ్సన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (6.5 ఓవర్లలో 2 వికెట్లకు) 47. వికెట్ల పతనం: 1–46, 2–46. బౌలింగ్: మార్క్ అడైర్ 1–0–10–0, జోష్ లిటిల్ 3–0–20–0, మెకార్తీ 2–0–14–0, యంగ్ 0.5–0–2–2. -
నెదర్లాండ్స్ ఆశలు సజీవం
హరారే: వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో నెదర్లాండ్స్ నిలిచింది. సోమవారం జరిగిన ‘సూపర్ సిక్స్’ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 74 పరుగుల తేడాతో ఒమన్‌పై గెలిచింది. వర్షంవల్ల 48 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో ముందుగా నెదర్లాండ్స్ 48 ఓవర్లలో 7 వికెట్లకు 362 పరుగుల భారీస్కోరు చేసింది. ఓపెనర్ విక్రమ్‌జీత్ సింగ్ (109 బంతుల్లో 110; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీతో కదంతొక్కాడు. వెస్లీ బరెసి (65 బంతుల్లో 97; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు సెంచరీ భాగ్యాన్ని త్రుటిలో కోల్పోయాడు. తర్వాత మళ్లీ వానతో ఒమన్ లక్ష్యాన్ని 44 ఓవర్లలో 321 పరుగులుగా నిర్దేశించారు. అయితే ఒమన్ 44 ఓవర్లలో 6 వికెట్లకు 246 పరుగులే చేసింది. అయాన్ ఖాన్ (92 బంతుల్లో 105 నాటౌట్; 11 ఫోర్లు, 2) ఒంటరి పోరాటం చేశాడు. నేడు జింబాబ్వే గెలిస్తే... ఇప్పటికే శ్రీలంక జట్టుకు ప్రపంచకప్ బెర్త్ ఖరారుకాగా... రెండో బెర్త్ కోసం జింబాబ్వే, స్కాట్లాండ్, నెదర్లాండ్స్ రేసులో ఉన్నాయి. ఈరోజు స్కాట్లాండ్తో తమ చివరి ‘సూపర్ సిక్స్’ మ్యాచ్‌లో జింబాబ్వే గెలిస్తే మిగతా మ్యాచ్‌ల ఫలితాలతో సంబంధం లేకుండా ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ స్కాట్లాండ్ విజయం సాధిస్తే మాత్రం జింబాబ్వే జట్టుకు అర్హత అవకాశాలు క్లిష్టమవుతాయి. నెదర్లాండ్స్, స్కాట్లాండ్ల మధ్య ఈనెల 6న జరిగే మ్యాచ్ ఫలితం తర్వాతే రెండో బెర్త్ ఎవరికి దక్కుతుందో ఖరారవుతుంది. -
IRE Vs ENG: టీ20 వరల్డ్‌కప్‌లో పెను సంచలనం.. ఇంగ్లండ్‌కు ‘షాకిచ్చిన పసికూన’
టీ20 వరల్డ్‌కప్-2022లో పెను సంచలనం నమోదైంది. సూపర్-12 గ్రూప్-1లో భాగంగా ఇంగ్లండ్‌తో ఇవాళ (అక్టోబర్ 26) జరిగిన మ్యాచ్‌లో పసికూన ఐర్లాండ్ పటిష్టమైన ఇంగ్లండ్‌కు షాకిచ్చింది. వరుణుడు ఆటంకం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఐర్లాండ్ 5 పరుగుల తేడాతో హాట్ ఫేవరెట్ జట్టును ఓడించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్.. మార్క్ వుడ్ (3/34), లివింగ్‌స్టోన్ (3/17), సామ్ కర్రన్ (2/31), స్టోక్స్ (1/8) చెలరేగడంతో 19.2 ఓవర్లలో 157 పరుగులకు చాపచుట్టేసింది. కెప్టెన్ బల్బిర్నీ (47 బంతుల్లో 62; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీతో రాణించాడు. అనంతరం 158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే వరుస షాక్‌లు తగిలాయి. ఓపెనర్ జోస్ బట్లర్ డకౌట్ కాగా.. మరో ఓపెనర్ అలెక్స్ హేల్స్ 7 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆతర్వాత వచ్చిన మలాన్ కాసేపు ఓపిగ్గా ఆడినప్పటికీ 35 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. స్టోక్స్ (6), హ్యారీ బ్రూక్ (18) కూడా తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరడంతో ఇంగ్లండ్ 86 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. వీరి తర్వాత వచ్చిన మొయిన్ అలీ (12 బంతుల్లో 24 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్), లివింగ్‌స్టోన్ (1 నాటౌట్) ఇంగ్లండ్‌కు గట్టెక్కించే ప్రయత్నం చేస్తుండగా ఒక్కసారిగా భారీ వర్షం మొదలైంది. ఈ దశలో ఇంగ్లండ్ స్కోర్ 105/5గా ఉంది. వరుణుడు ఎంతకీ శాంతించకపోవడంతో అంపైర్లు డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఐర్లాండ్‌ను విజేతగా ప్రకటించారు. ఐర్లాండ్ బౌలర్లలో జాషువా లిటిల్ 2, బ్యారీ మెక్ కార్తీ, ఫియాన్ హ్యాండ్, జార్జ్ డాక్రెల్ తలో వికెట్ పడగొట్టారు. చదవండి: Eng Vs IRE: ఇంగ్లండ్‌కు ఊహించని షాక్.. ఐర్లాండ్ విజయం -
T20WC 2021: డీఆర్ఎస్ విషయంలో ఐసీసీ కీలక నిర్ణయం
ICC Says DRS Introduced In Mens T20 WC 2021.. డెసిషన్ రివ్యూ సిస్టమ్(డీఆర్ఎస్) విషయంలో ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. టి20 ప్రపంచకప్ టోర్నీలో డీఆర్ఎస్ను అమలు చేయనున్నట్లు ఐసీసీ ఒక ప్రకటనలో దృవీకరించింది. కాగా మెన్స్ టి20 ప్రపంచకప్‌లో డీఆర్ఎస్ ఉయోగించడం ఇదే తొలిసారి కావడం విశేషం. సాధారణంగా టి20 మ్యాచ్‌లో ఇరు జట్లకు ప్రతీ ఇన్నింగ్స్‌లో ఒక రివ్యూ కోరే అవకాశం ఉంటుంది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా టోర్నీలో తక్కువ అనుభవం ఉన్న అంపైర్లు పనిచేసే అవకాశం ఉన్నందున అదనంగా ఇరు జట్లకు మరో రివ్యూను ఇవ్వనున్నట్లు తెలిపింది. తాజా రూల్స్ ప్రకారం మ్యాచ్‌లో ఇరు జట్లకు రెండు ఇన్నింగ్స్‌లోనూ రెండు రివ్యూలు కోరే అవకాశం ఉంటుంది. చదవండి: T20 World Cup 2021: ఉమ్రాన్ మాలిక్‌కు బంపర్ ఆఫర్! దీంతోపాటు డక్‌వర్త్ లూయిస్ పద్దతి ఆధారంగా వచ్చే ఫలితాల నిర్ణయాల్లోనూ ఐసీసీ కీలక మార్పులు చేసింది. టి20 ప్రపంచకప్‌లో లీగ్ దశలో ఏవైనా మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగిస్తే.. డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఫలితం రావాలంటే ఇకపై ప్రతీ జట్టు కనీసం ఐదు ఓవర్లు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. అదే సెమీ ఫైనల్స్.. ఫైనల్స్‌లో మాత్రం 10 ఓవర్లు పాటు బ్యాటింగ్ చేస్తేనే డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఫలితం తేల్చేందుకు అవకాశం ఉంటుంది. 2018 టి20 వుమెన్స్ టోర్నీలో డక్‌వర్త్ లూయిస్ పద్దతిని ఇదే విధంగా అమలు చేశారు. చదవండి: Team India Squad T20WC: ఏం మార్పులుండకపోవచ్చు.. చహల్ మాత్రం! ఇక మెన్స్ టి20 ప్రపంచకప్ టోర్నీలో డీఆర్ఎస్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. అంతకముందు వుమెన్స్ టి20 ప్రపంచకప్ 2018లో తొలిసారి డీఆర్ఎస్ను ప్రవేశపెట్టారు. ఇక మెన్స్ క్రికెట్లో ఐసీసీ లాంటి మేజర్ టోర్నీల్లో చూసుకుంటే 2017 చాంపియన్స్ ట్రోఫీ, 2019 వన్డే ప్రపంచకప్, తొలి ఐసీసీ ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్‌లో డీఆర్ఎస్ను అమలుపరిచారు. మ్యాచ్‌లో భాగంగా కొన్నిసార్లు మార్జిన్ ఆఫ్ ఎర్రర్స్లో ఫీల్డ్ అంపైర్ల తప్పుడు నిర్ణయాల వల్ల ఆటగాళ్లకు నష్టం కలుగుతుందని భావించిన ఐసీసీ డీఆర్ఎస్ రూల్‌ను ప్రవేశపెట్టింది. ఆటగాళ్లు తమ ఔట్‌పై ఏవైనా అనుమానాలు ఉంటే థర్డ్‌అంపైర్‌కు రివ్యూ కోరే అవకాశం ఉంటుంది. ఇక టి20 ప్రపంచకప్ 2021 అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు యూఏఈ, ఒమన్ వేదికగా జరగనుంది. చదవండి: T20 World Cup: ఓపెనర్‌గా సెలక్ట్ అయ్యానని విరాట్ భాయ్ చెప్పాడు! -
రెండో వన్డేలో దక్షిణాఫ్రికా గెలుపు
కొలంబో: వర్షం అంతరాయం కలిగించిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 67 పరుగుల తేడాతో శ్రీలంకపై నెగ్గి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1–1తో సమం చేసింది. తొలుత సఫారీ జట్టు 47 ఓవర్లలో 6 వికెట్లకు 283 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జేన్‌మన్ మలాన్ (135 బంతుల్లో 121; 9 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేశాడు. హెండ్రిక్స్ (51; 5 ఫోర్లు) రాణించాడు. వర్షం కారణంగా శ్రీలంక లక్ష్యాన్ని 41 ఓవర్లకు 265 పరుగులుగా కుదించారు. ఛేదనలో లంక 36.4 ఓవర్లలో 197 పరుగులకు ఆలౌటైంది. చరిత్ అసలంక (77; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. షమ్సీ 5 వికెట్ల శ్రీలంకను కట్టడి చేశాడు. చదవండి: BAN Vs NZ: వార్నీ ఇదేం డెలివరీ.. నోరెళ్లబెట్టిన బ్యాట్స్‌మన్ -
మ్యాచ్ పోయింది... క్యాచ్ అదిరింది!
నార్తాంప్టన్: వర్షం ఆటంకం కలిగించిన తొలి టి20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ మహిళల జట్టు డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 18 పరుగుల తేడాతో భారత మహిళలపై గెలిచింది. మొదట ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 177 పరుగులు చేసింది. సీవర్ (27 బంతుల్లో 55; 8 ఫోర్లు, 1 సిక్స్), అమీ జోన్స్ (27 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగారు. శిఖా పాండేకు 3 వికెట్లు దక్కాయి. తర్వాత కూడా వర్షం దోబూచులాడటంతో ఆట సరిగ్గా సాగనేలేదు. లక్ష్యఛేదనలో భారత్ 8.4 ఓవర్లలో 3 వికెట్లకు 54 పరుగులు చేసింది. షఫాలీ (0) డకౌట్ కాగా, స్మృతి మంధాన (29; 6 ఫోర్లు) మెరుగ్గా ఆడింది. హర్లీన్ (17 నాటౌట్), దీప్తి శర్మ (3 నాటౌట్) క్రీజులో ఉండగా మళ్లీ వర్షం వచ్చింది. ఎంతకీ తగ్గకపోవడంతో ఆటను ఆపేసి డక్‌వర్త్ పద్ధతిలో ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటిం చారు. ఆటను నిలిపివేసే సమయానికి డక్‌వర్త్ పద్ధతిలో భారత్ గెలవాలంటే స్కోరు 73గా ఉండాల్సింది. సూపర్... సూపర్...ఉమన్ హర్లీన్ అబ్బాయిల క్రికెట్ ఎక్కడ... అమ్మాయిల క్రికెట్ ఎక్కడ! వారి మెరుపులు చుక్కలు... మరి వీరి మెరుపులు మామూలు సిక్సర్లు! అంటే సరిపోతుందేమో కానీ... పురుషుల ఫిట్నెస్ భళా అతివల ఫిట్నెస్ డీలా అంటే కుదరదు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ మనమ్మాయే... పేరు హర్లీన్ డియోల్. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న ఈమె తొలి టి20లో అసాధారణ క్యాచ్ పట్టింది. బహుశా మహిళల క్రికెట్లో ఇలాంటి క్యాచ్ ఇదే మొదటిది. అందుకనే ప్రత్యర్థి ఇంగ్లండ్ శిబిరం కూడా ఆమె క్యాచ్‌కు చప్పట్లు కొట్టింది. ఆనంద్ మహీంద్రాలాంటి వ్యాపార దిగ్గజాలు సైతం ఔరా అన్నారంటే అర్థం చేసుకోండి. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో శిఖా పాండే 19వ ఓవర్ వేసింది. ఐదో బంతిని అమీ జోన్స్ భారీ షాట్ ఆడింది. బౌండరీ లైన్‌కు తాకెంత దగ్గర్లో హర్లీన్ గాల్లోకి ఎగిరి బంతిని అందుకుంది. బౌండరీ అవతల పడిపోతానని తెలిసిన ఆమె బంతిని గాల్లో వదిలి లైన్ దాటింది. మళ్లీ అక్కడ్నుంచి బంతి నేలను తాకేలోపే మైదానంలోకి డైవ్ చేసి అద్భుతంగా క్యాచ్ అందుకుంది. -
డక్‌వర్త్ కన్ఫ్యూజన్: కివీస్, బంగ్లా రెండో టీ20లో హైడ్రామా
నేపియర్: క్రికెట్ ప్రేమికులు అంపైర్స్ కాల్ కన్ఫ్యూజన్ నుంచి తేరుకోక ముందే మరో అర్ధం కాని సమస్య తెరముందుకొచ్చింది. న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన రెండో టీ20లో డక్‌వర్త్ లూయిస్ పద్దతి, సరికొత్త కన్ఫ్యూజన్కు దారి తీసింది. ఎన్నో ఏళ్లుగా అంతర్జాతీయ స్థాయి క్రికెట్ ఆడుతున్న బంగ్లా జట్టు డక్‌వర్త్ లూయిస్ పద్దతిపై సరైన అవగాహన లేక, తప్పుడు టార్గెట్‌ను నిర్ధేశించుకొని బరిలోకి దిగింది. ఆతరువాత మ్యాచ్ రిఫరీ సైతం సరికొత్త రూల్స్ విషయంలో తికమకపడి లక్ష్యాన్ని రెండోసార్లు మార్చడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ మొత్తం కన్ఫ్యూజన్కు మారిన ఐసీసీ రూల్సే కారణమని అంటున్నారు విశ్లేషకులు. వివరాల్లోకి వెళితే.. న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన రెండో టీ20కి వర్షం అడ్డుపడింది. ఆ సమయానికి న్యూజిలాండ్ 17.5 ఓవర్లలో 173 పరుగులు చేసింది. దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం బంగ్లాదేశ్‌కు 16 ఓవర్లలో 170 పరుగుల లక్ష్యాన్ని విధించారు. అయితే మారిన డక్‌వర్త్ లూయిస్ పద్ధతిపై సరైన అవగాహన లేని బంగ్లా జట్టు, తాము ఛేజ్ చేయాల్సింది 16 ఓవర్లలో 148 పరుగులు అని భావించి బరిలోకి దిగింది. ఈ క్రమంలో 1.3 ఓవర్ల తర్వాత గంధరగోళానికి లోనై మ్యాచ్ రిఫరీని సంప్రదించగా, ఆయన మ్యాచ్‌ను కాసేపు నిలిపివేశారు. 10 నిమిషాల చర్చల అనంతరం తిరిగి ప్రారంభంమైన మ్యాచ్‌లో తొలుత బంగ్లాకు 16 ఓవర్లలో 170 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించిన మ్యాచ్ రిఫరీ.. ఆతరువాత దాన్ని 16 ఓవర్లలో 171 పరుగులుగా మార్చాడు. దీంతో మ్యాచ్ మధ్యలో పెద్ద హైడ్రామానే నెలకొంది. డక్‌వర్త్ లూయిస్ కొత్త రూల్స్ విషయంలో బంగ్లా జట్టు కన్ఫ్యూజ్ అయ్యిందంటే ఒక అర్ధముంది, ఏకంగా మ్యాచ్ రిఫరీనే కన్ఫ్యూజ్ అయ్యాడంటే రూల్స్ ఎంత తికమక పెడుతున్నాయో అర్ధం చేసుకోవచ్చంటున్నారు క్రికెట్ అభిమానులు. కాగా, 171 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లా జట్టు 16 ఓవర్లలో 143 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. దీంతో 3 మ్యాచ్‌ల సిరీస్‌ను ఆతిధ్య జట్టు 2-0తేడాతో కైవసం చేసుకుంది. చదవండి: హార్ధిక్ తన బ్యాటింగ్ సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేసుకున్నాడు.. -
ఇంగ్లండ్ శుభారంభం
పాకిస్తాన్‌తో తొలి వన్డేలో విజయం సౌతాంప్టన్: పాకిస్తాన్‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌ను ఇంగ్లండ్ జట్టు విజయంతో ఆరంభించింది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌కు వర్షం ఆటంకంగా మారడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిన ఇంగ్లండ్ 44 పరుగుల తేడాతో నెగ్గింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాక్ 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 260 పరుగులు చేసింది. ఓపెనర్ అజహర్ అలీ (110 బంతుల్లో 82; 9 ఫోర్లు) రాణించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 33 ఓవర్లలో 185/3 స్కోరుతో ఉన్న సమయంలో భారీ వర్షం ఆటంకం కలిగించింది. ఆ తర్వాత 84 బంతుల్లో 59 పరుగుల లక్ష్యాన్ని విధించినా మరో మూడు బంతులకే వర్షం కురవడంతో ఆట సాధ్యం కాలేదు. అయితే అప్పటికే డక్‌వర్త్ పద్దతిలో 44 పరుగుల ఆధిక్యంలో ఉండడంతో మోర్గాన్ సేనకు విజయం దక్కింది. ఓపెనర్ రాయ్ (56 బంతుల్లో 65; 6 ఫోర్లు; 1 సిక్స్), రూట్ (72 బంతుల్లో 61; 6 ఫోర్లు) మెరుగ్గా ఆడారు. -
ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్
-
ఫార్మాట్ మారింది... పూనకమొచ్చింది!
వీళ్లేనా... మొన్నటిదాకా పరుగులు చేయడానికి వణికిన బ్యాట్స్‌మెన్..! వీళ్లేనా... ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ను ఆపడానికి ఆపసోపాలు పడ్డ బౌలర్లు..! వీళ్లేనా... ఘోరమైన ఆటతో ఇంటా బయటా తిట్లు తిన్న క్రికెటర్లు..! టెస్టుల్లో ఘోర ఓటమితో కసి పెరిగిందో... లేక ప్రపంచకప్ ఆడాలంటే నిలబడాలని గుర్తొచ్చిందో... కారణం ఏదైనా... ఫార్మాట్ మారగానే భారత క్రికెటర్లు పూనకం వచ్చినట్లు చెలరేగిపోయారు. అటు బ్యాట్స్‌మెన్ కసిదీరా ఇంగ్లండ్ బౌలర్లను చీల్చి చెండాడితే... ఇటు బౌలర్లు ప్రత్యర్థిని చుట్టిపారేశారు. ఫలితంగా రెండో వన్డేలో భారత్ 133 పరుగులతో ఘన విజయం సాధించింది. ►ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్ ►133 పరుగులతో నెగ్గిన ధోనిసేన ►రైనా సూపర్ సెంచరీ ►రాణించిన ధోని, రోహిత్ ►ఐదు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యం ►మూడో వన్డే శనివారం కార్డిఫ్: ఇంగ్లండ్ గడ్డపై గత ఏడాది చాంపియన్స్ ట్రోఫీలో వరుసగా ఐదు విజయాలతో భారత్ సత్తా చాటింది. నాటి రికార్డును ఇప్పుడు కొనసాగిస్తూ భారత్ మరోసారి అదే తరహా స్ఫూర్తిదాయక ఆటతీరును కనబర్చింది. అప్పటిలాగే జట్టు సమష్టిగా రాణించడంతో ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో భారత్‌కు ఘనమైన ఆరంభం లభించింది. బుధవారం ఇక్కడ సోఫియా గార్డెన్స్‌లో జరిగిన రెండో వన్డేలో భారత్ 133 పరుగుల భారీ తేడాతో (డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో) ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. సురేశ్ రైనా (75 బంతుల్లో 100; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) అద్భుత సెంచరీ సాధించగా... కెప్టెన్ ధోని (51 బంతుల్లో 52; 6 ఫోర్లు), రోహిత్ శర్మ (87 బంతుల్లో 52; 4 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. రైనా, ధోని ఐదో వికెట్‌కు 16.5 ఓవర్లలోనే 144 పరుగులు జోడించడం విశేషం. అనంతరం వర్షం కారణంగా ఇంగ్లండ్ లక్ష్యాన్ని డక్‌వర్త్ లూయీస్ ప్రకారం 47 ఓవర్లలో 295 పరుగులుగా నిర్ణయించారు. అయితే ఆ జట్టు 38.1 ఓవర్లలో 161 పరుగులకే కుప్పకూలింది. అలెక్స్ హేల్స్ (63 బంతుల్లో 40; 5 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జడేజా 28 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. తాజా ఫలితంతో వన్డే సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య మూడో వన్డే శనివారం నాటింగ్‌హామ్‌లో జరుగుతుంది. ఆదుకున్న రోహిత్ ఆరంభంలో ఇంగ్లండ్ పేసర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారత బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. తన మూడో ఓవర్ తొలి బంతికి ధావన్ (11)ను అవుట్ చేసిన వోక్స్, మరో రెండు బంతులకే కోహ్లి (0)ని డకౌట్‌గా వెనక్కి పంపాడు. ఎదుర్కొన్న మూడో బంతికే భారీ షాట్‌కు ప్రయత్నించిన విరాట్, తన టెస్టు సిరీస్ వైఫల్యాన్ని కొనసాగించడంతో స్కోరు 19/2 వద్ద నిలిచింది. అయితే రోహిత్ శర్మ, రహానే (47 బంతుల్లో 41; 4 ఫోర్లు) కలిసి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 91 పరుగులు జత చేశారు. రోహిత్ 82 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. వీరిద్దరు ట్రెడ్‌వెల్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరారు. భారీ భాగస్వామ్యం ఈ దశలో రైనా, ధోనిల భాగస్వామ్యం జట్టుకు భారీ స్కోరు అందించింది. మొదట్లో నెమ్మదిగానే ఆడిన రైనా, ఆ తర్వాత చెలరేగిపోయాడు. 49 బంతుల్లో అతని అర్ధ సెంచరీ పూర్తయింది. తర్వాత జోరు మరింత పెంచి 74 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మరో వైపు కెప్టెన్ కూడా తనదైన శైలిలో షాట్లు ఆడి 49 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. వీరిద్దరి జోరుతో భారత్ రెండో పవర్‌ప్లేలో 62 పరుగులు చేసింది. తొలి 37 ఓవర్లలో నాలుగు వికెట్లకు 171 పరుగులు చేస్తే... చివరి 13 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేయడం విశేషం. బౌలర్ల జోరు భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఏ దశలోనూ వేగంగా ఆడలేదు. ఈ మ్యాచ్‌తో వన్డేల్లో అరంగేట్రం చేసిన హేల్స్ మినహా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. కెప్టెన్ కుక్ (19), బెల్ (1)లను ఒకే ఓవర్లో అవుట్ చేసి షమీ ప్రత్యర్థి జట్టును నియంత్రించాడు. ఆ తర్వాత తక్కువ వ్యవధిలో రూట్ (4), హేల్స్, బట్లర్ (2) వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. ఆ తర్వాత ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ భాగస్వామ్యం నమోదు కాకపోవడంతో ఇంగ్లండ్‌కు పరాజయం తప్పలేదు. స్కోరు వివరాలు: భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) వోక్స్ (బి) ట్రెడ్‌వెల్ 52; ధావన్ (సి) బట్లర్ (బి) వోక్స్ 11; కోహ్లి (సి) కుక్ (బి) వోక్స్ 0; రహానే (స్టం) బట్లర్ (బి) ట్రెడ్‌వెల్ 41; రైనా (సి) అండర్సన్ (బి) వోక్స్ 100; ధోని (బి) వోక్స్ 52; జడేజా నాటౌట్ 9; అశ్విన్ నాటౌట్ 10; ఎక్స్‌ట్రాలు 29; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 304. వికెట్ల పతనం: 1-19; 2-19; 3-110; 4-132; 5-276; 6-288. బౌలింగ్: అండర్సన్ 10-1-57-0; వోక్స్ 10-1-52-4; జోర్డాన్ 10-0-73-0; స్టోక్స్ 7-0-54-0; రూట్ 3-0-14-0; ట్రెడ్‌వెల్ 10-1-42-2. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: కుక్ (ఎల్బీ) (బి) షమీ 19; హేల్స్ (సి) అశ్విన్ (బి) జడేజా 40; బెల్ (బి) షమీ 1; రూట్ (బి) భువనేశ్వర్ 4; మోర్గాన్ (సి) షమీ (బి) అశ్విన్ 28; బట్లర్ (సి) కోహ్లి (బి) జడేజా 2; స్టోక్స్ (సి) రహానే (బి) జడేజా 23; వోక్స్ (స్టం) ధోని (బి) జడేజా 20; జోర్డాన్ (ఎల్బీ) (బి) రైనా 0; ట్రెడ్‌వెల్ (సి) జడేజా (బి) అశ్విన్ 10; అండర్సన్ (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (38.1 ఓవర్లలో ఆలౌట్) 161. వికెట్ల పతనం: 1-54; 2-56; 3-63; 4-81; 5-85; 6-119; 7-126; 8-128; 9-143; 10-161 బౌలింగ్: భువనేశ్వర్ 7-0-30-1; మోహిత్ శర్మ 6-1-18-0; షమీ 6-0-32-2; అశ్విన్ 9.1-0-38-2; జడేజా 7-0-28-4; రైనా 3-0-12-1. అదే వేదిక... అవే పరుగులు మూడేళ్ల క్రితం...ఇదే వేదికపై భారత్, ఇంగ్లండ్ మధ్య వన్డే...ఇరు జట్ల కెప్టెన్లు ధోని, కుక్... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 304 పరుగులు చేసింది. వర్షం కారణంగా రెండో ఇన్నింగ్స్‌కు ముందు ఇంగ్లండ్ లక్ష్యాన్ని 47 ఓవర్లలో 295 పరుగులుగా నిర్ణయించారు. ఆ తర్వాత మళ్లీ లక్ష్యం మారి డక్‌వర్త్ లూయీస్ ప్రకారం ఇంగ్లండ్ గెలిచింది. ఇప్పుడూ అదే మైదానం...నాయకులూ వారే. భారత్ సరిగ్గా అదే స్కోరు చేసింది. నాడు కోహ్లి సెంచరీ చేస్తే నేడు రైనా శతకం బాదాడు. ఇంగ్లండ్ లక్ష్యం కూడా సరిగ్గా అదే. ఈ సారి మాత్రం ఫలితం మారింది. 11 బంతుల ఓవర్... ఇంగ్లండ్ బౌలర్ క్రిస్ జోర్డాన్ వేసిన ఇన్నింగ్స్ 39వ ఓవర్ ఇంగ్లండ్ కెప్టెన్‌కు అసహనాన్ని మిగల్చగా, భారత్‌కు 13 పరుగులు అందించింది. ఏ మాత్రం నియంత్రణ లేకుండా సాగిన బౌలింగ్‌తో జోర్డాన్ ఆ ఓవర్లో ఏకంగా ఐదు వైడ్లు వేశాడు. ధోని ఒక ఫోర్ కొట్టగా, మరో నాలుగు సింగిల్స్ వచ్చాయి. మ్యాచ్‌లో మొత్తంగా జోర్డాన్ ఒక్కడే 12 వైడ్లు విసరగా, ఇంగ్లండ్ ఎక్స్‌ట్రాల రూపంలోనే 29 పరుగులు ఇచ్చింది. 1 ఉపఖండం వెలుపల రైనాకు ఇదే తొలి సెంచరీ 4 రైనా కెరీర్లో ఇది నాలుగో సెంచరీ. 2010 జనవరిలో తన మూడో సెంచరీ నమోదు చేసిన రైనా... 95 ఇన్నింగ్స్‌ల తర్వాత మరో సెంచరీ సాధించాడు. 1 వన్డేల చరిత్రలో ఐదో వికెట్‌కు 2000కు పైగా పరుగులు జోడించిన తొలి జోడి ధోని, రైనా. -
భారత విజయలక్ష్యం 215
స్కార్ బారోగ్: భారత్ మహిళలతో ఇక్కడ జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లండ్ 215 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన ఇంగ్లండ్ ఆదిలో కాస్త దూకుడిగా ఆడినా 214 పరుగులకే పరిమితమైంది. ఇంగ్లండ్ ఓపెనర్లలో ఎడ్వర్డ్స్ (108) పరుగులు చేసి జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో తోడ్పడింది. అనంతరం ఏ ఒక్కరూ నిలకడగా ఆడలేదు. తొలి వన్డేలో విఫలమైన భారత బౌలర్లు ఈ మ్యాచ్ లో రాణించారు. గైక్వాడ్ నాలుగు వికెట్లు తీసి ఇంగ్లండ్ టాప్ ఆర్డర్ ను దెబ్బతీయగా, గోస్వామి మూడు వికెట్లతో ఆకట్టుకుంది.ప్రస్తుతం బ్యాటింగ్ దిగిన భారత జట్టు 10.4 ఓవర్లలో వికెట్టు నష్టానికి 40 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. తొలి వన్డేలో ఇంగ్లండ్ పై ఓటమి చవిచూసిన భారత్.. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను సమం చేయాలని భావిస్తోంది. ఇంమూడు వన్డేల సిరీస్ లో భాగంగా జరిగిన తొలి వన్డేలో భారత్ ను వరుణుడు ఎక్కిరించాడు. ఆ మ్యాచ్ లో పదే పదే వర్షం అంతరాయ కలిగించడంతో డక్ వర్త్ లూయిస్ ప్రకారం ఇంగ్లండ్ విజయం సాధించింది. -
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్
స్కార్ బారాగ్: ఇంగ్లండ్ తో ఇక్కడ జరుగుతున్న రెండో వన్డేలో భారత మహిళలు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నారు.తొలి వన్డేలో ఇంగ్లండ్ పై ఓటమి చవిచూసిన భారత్.. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను సమం చేయాలని భావిస్తోంది. ఇంగ్లండ్ ఓపెనర్లు ఎడ్వర్డ్స్, నైట్ లు ఇన్నింగ్స్ ను ఆరంభించారు. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా జరిగిన తొలి వన్డేలో భారత్ ను వరుణుడు ఎక్కిరించాడు. భారత మహిళలు పటిష్టమైన స్థితిలో ఉన్నా.. పదే పదే వర్షం రావడంతో డక్ వర్త్ లూయిస్ ప్రకారం ఇంగ్లండ్ విజయం సాధించింది. అంతకుముందు జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్ లో భారత మహిళలు విజయం సాధించి ఇంగ్లండ్ ను కంగుతినిపించిన సంగతి తెలిసిందే. -
భారత మహిళల ఓటమి
ఇంగ్లండ్‌తో తొలి వన్డే స్కార్బోరోగ్ (ఇంగ్లండ్): టెస్టు మ్యాచ్ గెలిచిన ఉత్సాహంతో ఉన్న భారత మహిళల జట్టును తొలి వన్డేలో ఇంగ్లండ్ నిలువరించింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఇంగ్లండ్ 42 పరుగుల తేడాతో నెగ్గింది. భారత ఇన్నింగ్స్ 18వ ఓవర్లో వర్షం రావడంతో మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించారు. ఓపెనర్ స్మృతి మందానా (99 బంతుల్లో 74; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ సహాయంతో భారత్ 47 ఓవర్లలో 8 వికెట్లకు 193 పరుగులు చేసింది. కెప్టెన్ మిథాలీ రాజ్ (59 బంతుల్లో 34; 6 ఫోర్లు)తో కలిసి రెండో వికెట్‌కు మందానా 64 పరుగులు జోడించింది. నైట్‌కు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 5 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 44 పరుగులు చేసిన సమయంలో వర్షం మరోసారి అంతరాయం కలిగించింది. దీంతో మ్యాచ్‌ను 42 ఓవర్లకు కుదించి 184 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఓపెనర్లు ఎడ్వర్డ్స్ (64 బంతుల్లో 57; 9 ఫోర్లు), నైట్ (71 బంతుల్లో 53; 6 ఫోర్లు) జోరుతో 30.1 ఓవర్లలో ఇంగ్లండ్ మూడు వికెట్లకు 153 పరుగులు చేసింది. ఈ సమయంలో మళ్లీ భారీవర్షం రావడంతో మ్యాచ్ ఆగిపోయింది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఇంగ్లండ్ 30.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోతే 112 పరుగులు చేస్తే గెలిచినట్లు. అప్పటికే 153 పరుగులు చేసినందున... 42 పరుగులతో గెలిచినట్లు ప్రకటించారు. -
వర్షంలో ‘సన్‌రైజ్’
నాటకీయ మ్యాచ్‌లో హైదరాబాద్ విజయం .... డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఓడిన ఢిల్లీ కాసేపు 20 ఓవర్ల మ్యాచ్... అంతలోనే మళ్లీ 12 ఓవర్లకు మార్పు... మళ్లీ ఐదు ఓవర్లకు కుదింపు.. వర్షం కారణంగా నాటకీయంగా ఓవర్లు మారిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ గట్టెక్కింది. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో గెలిచి వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. న్యూఢిల్లీ: రాజస్థాన్‌పై విజయంతో ఆత్మవిశ్వాసం పెంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు... మరోసారి సమష్టిగా రాణించి ఢిల్లీపైనా విజయాన్ని అందించారు. ఫిరోజ్ షా కోట్ల మైదానంలో శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో హైదరాబాద్ నెగ్గింది. సన్‌రైజర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... ఢిల్లీ డేర్ డెవిల్స్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. దినేశ్ కార్తీక్ (30 బంతుల్లో 39; 1 ఫోర్, 2 సిక్స్‌లు), పీటర్సన్ (19 బంతుల్లో 35; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించగా.. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ స్టెయిన్(2/20)తో పాటు మిశ్రా (2/23), హెన్రిక్స్ (2/26) ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. ఆ తర్వాత పలుమార్లు వర్షం ఆటంకం కల్గించడంతో చివరికి సన్‌రైజర్స్ లక్ష్యాన్ని 5 ఓవర్లలో 43 పరుగులుగా నిర్దేశించారు. హైదరాబాద్ మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. నమన్ ఓజా (13 నాటౌట్), వార్నర్ (12 నాటౌట్) జట్టు విజయాన్ని పూర్తి చేశారు. స్కోరు వివరాలు ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: డి కాక్ (సి) రాహుల్ (బి) స్టెయిన్ 7; పీటర్సన్ (సి) ధావన్ (బి) మిశ్రా 35; అగర్వాల్ (సి) వార్నర్ (బి) మిశ్రా 25; కార్తీక్ (సి) స్టెయిన్ (బి) హెన్రిక్స్ 39; శుక్లా (సి) వార్నర్ (బి) హెన్రిక్స్ 21; డుమిని (బి) భువనేశ్వర్ 4; జాదవ్ (సి) పఠాన్ (బి) స్టెయిన్ 5; రాహుల్ శుక్లా నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) : 143. వికెట్ల పతనం: 1-10; 2-54; 3-73; 4-128; 5-132; 6-139; 7-143. బౌలింగ్: స్టెయిన్ 4-0-20-2; భువనేశ్వర్ 4-0-23-1; కరణ్ శర్మ 3-0-29-0; హెన్రిక్స్ 3-0-26-2; మిశ్రా 3-0-23-2; పఠాన్ 3-0-18-0. హైదరాబాద్ సన్‌రైజర్స్ ఇన్నింగ్స్: ఫించ్ (బి) రాహుల్ శుక్లా 4; ధావన్ (సి) డుమిని (బి) కౌల్ 4; వార్నర్ నాటౌట్ 12; నమన్ ఓజా నాటౌట్ 13; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (4.2 ఓవర్లలో 2 వికెట్లకు) : 44. వికెట్ల పతనం: 1-13; 2-25. బౌలింగ్: షమీ 1-0-6-0; కౌల్ 1-0-5-1; తాహిర్ 1-0-7-0; రాహుల్ శుక్లా 1-0-13-1; లక్ష్మిరతన్ శుక్లా 0.2-0-7-0. మ్యాచ్ సాగిందిలా... తొలుత మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం 20 ఓవర్లే. స్టెయిన్ బౌలింగ్‌లో డికాక్ అవుటైనా... ఢిల్లీ కెప్టెన్ పీటర్సన్ ధాటిగా ఆడటంతో పవర్‌ప్లేలో 52 పరుగులు వచ్చాయి. అయితే అమిత్ మిశ్రా తన వరుస ఓవర్లలో పీటర్సన్, మయాంక్ అగర్వాల్‌లను అవుట్ చేశాడు. తర్వాత వచ్చిన కార్తీక్, శుక్లా నిలకడగా ఆడటంతో ఢిల్లీ 13.1 ఓవర్లలో 103/3 స్కోరుతో పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ సమయంలో భారీ వర్షం కురవడంతో మ్యాచ్‌ను ఆపేశారు. 75 నిమిషాల పాటు ఆటకు అంతరాయం కలిగినా ఓవర్లు కుదించకుండా మ్యాచ్‌ను కొనసాగించారు. దీంతో మళ్లీ వచ్చిన ఢిల్లీ మిగిలిన ఓవర్లు ఆడింది. నాలుగో వికెట్‌కు శుక్లా, కార్తీక్ కలిసి 55 పరుగులు జోడించాక... హెన్రిక్స్ బౌలింగ్‌లో ఈ ఇద్దరూ అవుటయ్యారు. డెత్ ఓవర్లలో భువనేశ్వర్, స్టెయిన్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. దీంతో చివరి నాలుగు ఓవర్లలో ఢిల్లీ కేవలం 15 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిసిన తరువాత వర్షం పడటంతో మ్యాచ్‌కు మరోసారి అంతరాయం ఏర్పడింది. దాదాపు అరగంట పాటు మ్యాచ్ నిలిచిపోయింది. దీంతో మ్యాచ్‌ను కుదించారు. సన్‌రైజర్స్‌కు 15 ఓవర్లలో 117 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ధావన్, ఫించ్ కలిసి 1.1 ఓవర్లలో 11 పరుగులు చేశాక మళ్లీ వర్షం వచ్చింది. దీంతో మరోసారి ఓవర్లను కుదించారు. లక్ష్యాన్ని 12 ఓవర్లలో 97 పరుగులుగా నిర్దేశించారు. బ్యాట్స్‌మెన్ వచ్చి మరో ఐదు బంతులు ఆడగానే మళ్లీ వర్షం పడింది. ఈ ఐదు బంతుల వ్యవధిలోనే ధావన్ అవుటయ్యాడు. మ్యాచ్ ఆగే సమయానికి సన్‌రైజర్స్ స్కోరు 2 ఓవర్లలో వికెట్ నష్టానికి 17. మరో 20 నిమిషాల తర్వాత మళ్లీ మ్యాచ్ ప్రారంభమైంది. అయితే ఈసారి లక్ష్యం మళ్లీ మారింది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం హైదరాబాద్ ఐదు ఓవర్లలో 43 పరుగులు చేయాలి. అప్పటికి 2 ఓవర్లలో 17 చేశారు. అంటే ఇక మూడు ఓవర్లలో 26 పరుగులు చేయాలి. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో హైదరాబాద్ జట్టు తాహిర్ బౌలింగ్‌లో 7 పరుగులు రాబట్టింది. ఆ తర్వాతి ఓవర్లో ఫించ్ ధాటిగా ఆడే ప్రయత్నంలో రాహుల్ శుక్లా బౌలింగ్‌లో అవుటయ్యాడు. అయితే వార్నర్ ఓ ఫోర్, నమన్ ఓజా ఓ సిక్స్ కొట్టడంతో నాలుగో ఓవర్లో మొత్తంగా 13 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్లో సన్‌రైజర్స్ 6 బంతుల్లో 6 పరుగులు చేయాల్సి ఉండగా... లక్ష్మిరతన్ శుక్లా బౌలింగ్‌లో తొలి బంతికి వార్నర్ సింగిల్ తీశాడు. రెండో బంతికి ఓజా సిక్సర్ బాది సన్‌రైజర్స్ విజయాన్ని ఖాయం చేశాడు.