ICC Says DRS Introduced In Mens T20 WC 2021.. డెసిషన్ రివ్యూ సిస్టమ్(డీఆర్‌ఎస్) విషయంలో ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. టి20 ప్రపంచకప్ టోర్నీలో డీఆర్‌ఎస్‌ను అమలు చేయనున్నట్లు ఐసీసీ ఒక ప్రకటనలో దృవీకరించింది. కాగా మెన్స్ టి20 ప్రపంచకప్‌లో డీఆర్‌ఎస్ ఉయోగించడం ఇదే తొలిసారి కావడం విశేషం. సాధారణంగా టి20 మ్యాచ్‌లో ఇరు జట్లకు ప్రతీ ఇన్నింగ్స్‌లో ఒక రివ్యూ కోరే అవకాశం ఉంటుంది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా టోర్నీలో తక్కువ అనుభవం ఉన్న అంపైర్లు పనిచేసే అవకాశం ఉన్నందున అదనంగా ఇరు జట్లకు మరో రివ్యూను ఇవ్వనున్నట్లు తెలిపింది. తాజా రూల్స్ ప్రకారం మ్యాచ్‌లో ఇరు జట్లకు రెండు ఇన్నింగ్స్‌లోనూ రెండు రివ్యూలు కోరే అవకాశం ఉంటుంది.
చదవండి: T20 World Cup 2021: ఉమ్రాన్ మాలిక్‌కు బంపర్ ఆఫర్!
దీంతోపాటు డక్‌వర్త్ లూయిస్ పద్దతి ఆధారంగా వచ్చే ఫలితాల నిర్ణయాల్లోనూ ఐసీసీ కీలక మార్పులు చేసింది. టి20 ప్రపంచకప్‌లో లీగ్ దశలో ఏవైనా మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగిస్తే.. డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఫలితం రావాలంటే ఇకపై ప్రతీ జట్టు కనీసం ఐదు ఓవర్లు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. అదే సెమీ ఫైనల్స్.. ఫైనల్స్‌లో మాత్రం 10 ఓవర్లు పాటు బ్యాటింగ్ చేస్తేనే డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఫలితం తేల్చేందుకు అవకాశం ఉంటుంది. 2018 టి20 వుమెన్స్ టోర్నీలో డక్‌వర్త్ లూయిస్ పద్దతిని ఇదే విధంగా అమలు చేశారు.
చదవండి: Team India Squad T20WC: ఏం మార్పులుండకపోవచ్చు.. చహల్ మాత్రం!
ఇక మెన్స్ టి20 ప్రపంచకప్ టోర్నీలో డీఆర్‌ఎస్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. అంతకముందు వుమెన్స్ టి20 ప్రపంచకప్ 2018లో తొలిసారి డీఆర్‌ఎస్‌ను ప్రవేశపెట్టారు. ఇక మెన్స్ క్రికెట్‌లో ఐసీసీ లాంటి మేజర్ టోర్నీల్లో చూసుకుంటే 2017 చాంపియన్స్ ట్రోఫీ, 2019 వన్డే ప్రపంచకప్, తొలి ఐసీసీ ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్‌లో డీఆర్‌ఎస్‌ను అమలుపరిచారు. మ్యాచ్‌లో భాగంగా కొన్నిసార్లు మార్జిన్ ఆఫ్ ఎర్రర్స్‌లో ఫీల్డ్ అంపైర్ల తప్పుడు నిర్ణయాల వల్ల ఆటగాళ్లకు నష్టం కలుగుతుందని భావించిన ఐసీసీ డీఆర్‌ఎస్ రూల్‌ను ప్రవేశపెట్టింది. ఆటగాళ్లు తమ ఔట్‌పై ఏవైనా అనుమానాలు ఉంటే థర్డ్‌అంపైర్‌కు రివ్యూ కోరే అవకాశం ఉంటుంది. ఇక టి20 ప్రపంచకప్ 2021 అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు యూఏఈ, ఒమన్ వేదికగా జరగనుంది.
చదవండి: T20 World Cup: ఓపెనర్‌గా సెలక్ట్ అయ్యానని విరాట్ భాయ్ చెప్పాడు!
Comments
Please login to add a commentAdd a comment