Lahiru Kumara Liton Das fined for breaching ICC code of conduct: టీ20 ప్రపంచకప్ 2021 సూపర్ 12 లో భాగంగా ఆదివారం షార్జా వేదికగా శ్రీలంక, బంగ్లాదేశ్‌లు తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్‌లో శ్రీలంక పేసర్ లాహిరు కుమార, బంగ్లాదేశ్ ఓపెనర్ లిటన్ దాస్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే దీనిపై స్పందించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)...ఐసీసీ నిబంధనావళిని ఉల్లంఘించినందుకు ఇరువురికి జరిమానా విధించింది. ఈ గొడవకు ఆజ్యం పోసిన లాహిరు కుమారకు మ్యాచ్ ఫీజులో 25%తో పాటు ఒక డీమెరిట్ పాయింట్, లిటన్ దాస్‌కు 15% జరిమానా, ఒక డీమెరిట్ పాయింట్ విధించినట్లు ఐసీసీ ప్రకటించింది. కాగా చివర వరకు ఆసక్తికరంగా జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీలంక 5వికెట్ల తేడాతో విజయం సాధించింది.
అసలు ఏమి జరిగిందింటే...
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 6వ ఓవర్ బౌలింగ్ చేసిన లహీరు కుమార.. ఐదో బంతికి లిటన్‌దాస్‌ను పెవిలియన్‌కు పంపాడు. అయితే ఈ క్రమంలో లిటన్ దాస్ వైపు చూస్తూ లహీరు కుమార మాటలు తూటాలు పేల్చాడు. ఈ క్రమంలో లిటన్ దాస్ కూడా తానేం తక్కువ తినలేదన్నట్లుగా అతనితో గొడవకు దిగాడు. దీంతో ఇద్దరు క్రికెటర్ల మధ్య వాగ్వాదం జరగడంతో.. ఫీల్డ్ అంపైర్లు, సహచర ఆటగాళ్లు కలగజేసుకుని సర్దిచెపే ప్రయత్నం చేశారు. ఈ వాగ్వాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment