
Lahiru Kumara Stunning Run Out.. టి20 ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బ్యాట్స్‌మన్ కన్నా బౌలర్ వేగంగా పరిగెత్తి వికెట్లను గిరాటేయడంతో రనౌట్ కాక తప్పలేదు. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 19వ ఓవర్ లాహిరు కుమార వేశాడు. ఓవర్ మూడో బంతిని ఆఫిప్ హొస్సేన్ డిఫెన్స్ ఆడాడు. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న ముష్ఫికర్ రహీమ్ సింగిల్‌కు కాల్ ఇచ్చాడు. సింగిల్ తీయడం రిస్క్ అని తెలిసినా హొస్సేన్ ప్రయత్నించి చేతులు కాల్చుకున్నాడు. అప్పటికే క్రీజుపైనే ఉన్న లాహిరు కుమార హొస్సేన్ కంటే వేగంగా పరిగెత్తి బంతిని అందుకొని వికెట్లను గిరాటేశాడు. ఇంకేముంది రిప్లేలో రనౌట్ అని క్లియర్‌గా తేలింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: T20 WC 2021 AUS Vs SA: మక్రమ్ స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్
ఇక మ్యాచ్‌లో బంగ్లా బ్యాటర్లు మహ్మద్ నయీమ్(52 బంతుల్లో 62; 6 ఫోర్లు), ముష్ఫికర్ రహీమ్(37 బంతుల్లో 57 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో రాణించడంతో బంగ్లాదేశ్ భారీ స్కోర్ సాధించింది. వీరికి తోడు మిగతా బ్యాటర్లు కూడా తలో చేయి వేయడంతో నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. లంక బౌలర్లలో కరుణరత్నే, బినుర ఫెర్నాండో, లహీరు కుమార తలో వికెట్ పడగొట్టారు.
చదవండి: Glenn Maxwell: అక్కడ నెంబర్‌వన్ బౌలర్.. ప్రతీసారి స్విచ్‌హిట్ పనికిరాదు
SL Vs BAN: ఆటగాళ్ల మాటల యుద్దం.. కొట్టుకున్నంత పనిచేశారు
Kumara with some quick thinking off own bowling https://t.co/MsxeD0R3ta via @t20wc
— varun seggari (@SeggariVarun) October 24, 2021
Comments
Please login to add a commentAdd a comment