
Shakib Al Hasan Most Wickets In T20 WC.. బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్ టి20 ప్రపంచకప్‌లో అరుదైన ఘనత సాధించాడు. టి20 ప్రపంచకప్‌లలో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో షకీబ్ అగ్రస్థానంలో నిలిచాడు. శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో షకీబ్ నిస్సాంకాను క్లీన్‌బౌల్డ్ చేయడం ద్వారా షకీబ్ 40వ వికెట్ సాధించాడు. ఈ వికెట్‌తో పాకిస్తాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది పేరిట ఉన్న 39 వికెట్ల రికార్డును దాటేశాడు. కాగా అవిష్క ఫెర్నాండోను బౌల్డ్ చేయడం ద్వారా 41వ వికెట్ సాధించిన షకీబ్ ఓవరాల్‌గా తొలి స్థానంలో నిలవగా.. షాహిద్ అఫ్రిది 39 వికెట్లతో రెండో స్థానం, లసిత్ మలింగ 38 వికెట్లతో మూడో స్థానంలో.. సయీద్ అజ్మల్ 36 వికెట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు.
కాగా మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. మహ్మద్ నయీమ్(52 బంతుల్లో 62; 6 ఫోర్లు), ముష్ఫికర్ రహీమ్(37 బంతుల్లో 57 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో రాణించడంతో బంగ్లాదేశ్ భారీ స్కోర్ సాధించింది. అనంతరం చేధనలో లంక పోరాడుతుంది. 16 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. అసలంక 65, రాజపక్స 45 పరుగులతో ఆడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment