Shakib Al Hasan T20 WC 2021.. బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ తానెంత గొప్ప ఆల్‌రౌండర్ అనేది మరోసారి చూపించాడు. టి20 ప్రపంచకప్ 2021లో పపువా న్యూ గినియాతో జరిగిన గ్రూఫ్-బి క్వాలిఫయర్ మ్యాచ్‌లో షకీబ్ మరోసారి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. ముందుగా బ్యాటింగ్‌లో బంగ్లాదేశ్ భారీ స్కోరు చేయడంలో షకీబ్ కీలకపాత్ర పోషించాడు. 37 బంతుల్లో 47 పరుగులు చేసిన షకీబ్ ఇన్నింగ్స్‌లో 3 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఆ తర్వాత బౌలింగ్‌లోనూ ఇరగదీశాడు. (4-0-9-4) ఇవీ షకీబ్ గణాంకాలు.
చదవండి: T20 WC 2021: జట్టులో బెస్ట్ ఫీల్డర్‌గా గుర్తింపు.. స్టన్నింగ్ క్యాచ్‌కు షకీబ్ ఫిదా
పసికూన పపువాపై విజయం సాధించినప్పటికి.. సూపర్ 12కు అర్హత సాధించాలంటే బంగ్లాకు భారీ విజయం అవసరం ఉంది. అందుకే సరైన సమయంలో షకీబ్ తనలోని ఆల్‌రౌండర్‌ను నిద్రలేపాడు. ప్రస్తుతం షకీబ్ ఐసీసీ టి20 ఆల్‌రౌండర్స్ ర్యాంకింగ్స్‌లో తొలి స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక షకీబ్ ప్రదర్శనపై సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్ నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. '' వారెవ్వా ఇలాంటి ఆల్‌రౌండర్ ఒక్కడున్నా చాలు.. ఒంటిచేత్తో బంగ్లాను సూపర్ 12 దశకు చేర్చాడు... షకీబ్ నిజంగా గ్రేట్.. నెంబర్‌వన్ ఆల్‌రౌండర్ అనే పదానికి సరైన నిర్వచనం షకీబ్ అల్ హసన్'' అంటూ కామెంట్స్ చేశారు.
చదవండి: Squid Game Challenge: స్క్విడ్ గేమ్ ఛాలెంజ్‌లో నెగ్గిన 'హిట్‌మ్యాన్'
T20 WC 2021 IND Vs PAK: ఆ మూడు స్థానాలు పెద్ద తలనొప్పి
Comments
Please login to add a commentAdd a comment