No Change In Team India Squad For T20WC.. టి20 ప్రపంచకప్ 2021కు సంబంధించి టీమిండియాలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని బీసీసీఐ అధికార ప్రతినిధి పేర్కొన్నట్లు సమాచారం. టి20 ప్రపంచకప్ జట్టులో మార్పులకు సంబంధించి ఆయా జట్లు ఐసీసీకి పంపించాల్సిన రిపోర్ట్‌కు గడువు నేడే(అక్టోబర్ 10) ఆఖరు. కాగా ఐపీఎల్ ప్రదర్శనను పరిగణలోకి తీసుకొని జట్టులో మార్పులు చేసే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా స్థానాలపై సందిగ్థత నెలకొంది. దీనికి సంబంధించి కోచ్ రవిశాస్త్రి, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలకు సెలక్టర్ల నుంచి చివరి కాల్ ఉందంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి.
చదవండి: T20 World Cup 2021: రోహిత్ భయ్యా.. మాకు రెండు టికెట్స్ ఇప్పించవా
అయితే జట్టులో ఎలాంటి మార్పులు ఉండబోవని.. ఒక్క హార్దిక్ పాండ్యా విషయంలో మాత్రమే ఇంకా క్లారిటీ లేదని.. మిగతా జట్టంతా ముందు ప్రకటించిన విధంగానే ఉంటుందని బీసీసీఐ అధికారి పేర్కొన్నారు. కాగా ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన కనబరిచిన యజ్వేంద్ర చహల్‌ను మాత్రం యూఏఈలో ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అయితే ముందు ప్రకటించిన జట్టులో చహల్‌కు చోటు లేదు. చహల్ కంటే రాహుల్ చహర్‌పై సెలెక్టర్లు నమ్మకముంచి జట్టులోకి ఎంపిక చేశారు. అయితే తాజాగా ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన కనబరిచిన చహల్‌ను జట్టులోకి తీసుకొనే అవకాశం ఉంది. ఇక నెట్ బౌలర్‌గా ఉమ్రాన్ మాలిక్ సేవలను వినియోగించుకోనున్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొన్నట్లు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే ఈ విషయమై ఐపీఎల్ ముగిసిన తర్వాత ఉమ్రాన్‌ను టీమిండియా బయెబబుల్‌లో కలుస్తాడని తెలిపింది. ఇక ఉమ్రాన్ ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన బంతులు విసిరి అందరి దృష్టిని ఆకర్షించాడు.
భారత జట్టు టీ 20 వరల్డ్‌కప్: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్సర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మొహమ్మద్ షమీ.
రిజర్వ్ ఆటగాళ్లు: శ్రేయాస్ అయ్యర్, దీపక్ చహర్, శార్దూల్ ఠాకూర్
చదవండి: INDw Vs AUSw: ఆ రెండు ఓవర్లు కొంపముంచాయి.. టీమిండియా ఓటమి
Comments
Please login to add a commentAdd a comment