Selectors Show BIG Faith On Hardik Pandya T20 World up 2021.. టి20 ప్రపంచకప్ 2021కు సమయం దగ్గరపడింది. ఐపీఎల్ 2021 సీజన్ ముగిసిన రెండు రోజుల్లోనే ప్రపంచకప్‌కు తెరలేవనుంది. ఇప్పటికే టీమిండియా టి20 జట్టును సెలక్టర్లు ప్రకటించారు. అయితే ఐపీఎల్‌లో ఆటగాళ్ల ప్రదర్శనను పరిగణలోకి తీసుకొని టీమిండియా జట్టులో పలు మార్పులు జరిగే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అక్టోబర్ 10 వరకు సమయం ఉండడంతో పలు మార్పులకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్‌లో వరుసగా విఫలమవుతూ వస్తున్న ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలపై వేటు తప్పదని కొన్నిరోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
చదవండి: MI Vs PBKS: ముంబైని గెలిపించిన హార్ధిక్.. హ్యాట్రిక్ ఓటములకు బ్రేక్
అయితే ఎవరి స్థానానికి ఎసరు ఉంటుందో తెలియదు గానీ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను జట్టు నుంచి తొలగించేందుకు సెలక్టర్లు మొగ్గు చూపడం లేదని సమాచారం. హర్దిక్ పాండ్యాపై సెలక్టర్లకు విశ్వాసం ఎక్కువగా ఉందని.. అందుకే అతన్ని జట్టు నుంచి తొలగించకపోవచ్చని పలువురు పేర్కొంటున్నారు. దీనికి తగ్గట్టుగానే బీసీసీఐ ప్రతినిధి ఒకరు హార్ధిక్ గురించి ఇంటర్వ్యూలో కీలక సమాచారం వెల్లడించినట్లు తెలిసింది. హార్దిక్ పాండ్యా స్థానంలో వేరే వారికి అవకాశం ఇవ్వలేము. అతని ఆటతీరుపై మాకు నమ్మకముంది. దీపక్ చహర్ లేదా శార్ధూల్‌లో ఎవరో ఒకరు జట్టులోకి వస్తారనేది అవాస్తవం. వారిని కేవలం బ్యాకప్‌గా మాత్రమే అనుకుంటున్నాం. అయితే హార్దిక్ రీప్లేస్‌కు ఇది సరైన సమయం కాదని మేము భావిస్తున్నాం. అంటూ తెలిపినట్లు సమాచారం.
Courtesy: IPL Twitter
తాజాగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్ధిక్ పాండ్యా ఫామ్‌లోకి వచ్చాడు. ఆ మ్యాచ్‌లో ముంబై విజయంలో హార్దిక్ కీలకపాత్ర పోషించాడు. 30 బంతుల్లో 40 పరుగులు చేసిన హార్దిక్ ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు.. 2 సిక్సర్లు ఉన్నాయి. అయితే ఐపీఎల్‌లో బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితమైన హార్దిక్ బౌలింగ్ మాత్రం చేయడం లేదు. ఆల్‌రౌండర్ కోటాలోనే హార్దిక్ జట్టులోకి ఎంపిక చేసినప్పటికి బ్యాట్స్‌మన్‌గా కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఐపీఎల్‌లో బౌలింగ్ చేయొద్దనేది హార్దిక్ తీసుకున్న నిర్ణయమని.. ఐపీఎల్‌లో బౌలింగ్ చేస్తే టి20 ప్రపంచకప్‌లో స్ట్రెయిన్ అయ్యే అవకాశం ఉందని.. అందుకే అతను బౌలింగ్‌కు దూరంగా ఉంటున్నాడని ముంబై ఇండియన్స్ కోచ్ జయవర్దనే ఒక ప్రకటనలో తెలిపాడు.
చదవండి: T20 World Cup: ఆ రెండు జట్లతోనే మాకు గట్టి పోటీ: జోస్ బట్లర్
Comments
Please login to add a commentAdd a comment