
Aakash Chopra.. టి20 ప్రపంచకప్ 2021లో భాగంగా టీమిండియా జట్టులోకి ఎంపికైన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అన్‌ఫిట్ అని.. అతని స్థానంలో మరొకరు రావడం ఖాయమని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. టీమిండియా ఫైనల్ లిస్ట్‌కు సంబంధించి అక్టోబర్ 15 వరకు గడువు ఉండడంతో మార్పు తధ్యమని పేర్కొన్నాడు.
చదవండి: T20 World Cup 2021: టీమిండియాలో అనూహ్య మార్పు..
యూట్యూబ్ చానెల్‌లో ఆకాశ్‌చోప్రా మాట్లాడుతూ.. '' టీమిండియా టి20 ప్రపంచకప్ 15 మంది సభ్యుల్లో హార్దిక్ ఉండాలా వద్దా అనేది సెలెక్టర్లు నిర్ణయిస్తారు. ప్రస్తుతం అతను బౌలింగ్ చేయడం మానేశాడు. ముంబై ఇండియన్స్ తరపున ఒకటి రెండు మ్యాచ్‌లు మినహా పెద్దగా బౌలింగ్ చేయలేదు. జట్టులోకి ఆల్‌రౌండర్‌గా ఎంపికైనప్పుడు అన్ని విధాల టీమిండియాకు సాయపడాలి. ఒక ఆల్‌రౌండర్‌గా సేవలు అందించనప్పుడు జట్టులో ఉండడం అనవసరం. అతని స్థానంలో వేరే ఆటగాడికి అవకాశం ఇచ్చినా బాగుంటుంది. అయితే సరిగ్గా ఆరు నెలల క్రితం ఇదే హార్దిక్ విషయంలో రానున్న టి20 ప్రపంచకప్‌లో కీలకంగా ఉంటాడని చెప్పా. కానీ ఆర్నెళ్లు తిరిగేసరికి హార్దిక్ టీమిండియాకు భారంగా తయారయ్యాడు. ఒకవేళ హార్దిక్ పాండ్యా స్థానంలో మరో ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.'' అంటూ చెప్పుకొచ్చాడు.
అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం శార్దూల్ ఠాకూర్‌ను అక్షర్ పటేల్ స్థానంలో 15 మంది జట్టులోకి ఎంపిక చేశారు. అలాగే అక్షర్‌ను స్టాండ్‌బై ప్లేయర్స్ ఉంచారు. వీరితో పాటు మరో ఎనిమిది మందిని యూఏఈలోనే ఉండాలంటూ బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. వారిలో ఆవేశ్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్, వెంకటేశ్ అయ్యర్‌లు నెట్‌బౌలర్లుగా.. హర్షల్ పటేల్, లుక్మన్ మెరివాలా, కర్ణ్ శర్మ, షాబాజ్ అహ్మద్, కె గౌతమ్‌లను కూడా అందుబాటులో ఉండాలని తెలిపింది.
చదవండి: T20 WC 2021: బాగా రాణిస్తున్నాడు.. జట్టులో చోటు మాత్రం కష్టమే