Saba Karim Questions Hardik Pandya T20 World Cup Selection He Was Not Fit - Sakshi
Sakshi News home page

T20 World Cup 2021: ఫిట్‌గా లేనప్పుడు ఎందుకు ఎంపిక చేశారు

Published Fri, Sep 24 2021 5:18 PM | Last Updated on Fri, Sep 24 2021 7:43 PM

Saba Karim Questions Hardik Pandya T20 World Cup Selection He Was Not Fit - Sakshi

Saba Karim Questions Hardik Pandyas T20 World Cup Selection..  టీమిండియా ఆర్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాపై టీమిండియా మాజీ వికెట్‌ కీపర్‌ సబా కరీమ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫిట్‌గా లేని హార్దిక్‌ను టి20 ప్రపంచకప్‌కు ఎందుకు ఎంపిక చేశారో అర్థం కావడం లేదని పేర్కొన్నాడు. కేల్‌నీతి యూట్యూబ్‌ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మాజీ సెలక్టర్‌ మాట్లాడాడు. 

చదవండి: T20 World Cup: ఆ ఇద్దరిని ఎంపిక చేయాల్సింది: ఎమ్మెస్కే ప్రసాద్‌

''హార్దిక్‌ మంచి ఆల్‌రౌండర్‌ అన్న విషయం తెలిసిందే. కాని అతని ఎంపికలోనే క్లారిటీ లేదు. పాండ్యా ఫిట్‌గా లేడని నా అభిప్రాయం. ఒకవేళ అతను ఫిట్‌గా ఉంటే అది నిరూపించుకోవాలి. ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌లో ముంబై రెండు మ్యాచ్‌లు ఆడగా.. ఆ రెండు మ్యాచ్‌లకు అతను దూరంగా ఉన్నాడని తెలిసింది. ఫిట్‌నెస్‌ లేమి అనేది ఐపీఎల్‌లో అతనికి సమస్య తేకపోవచ్చు.

కానీ టి20 ప్రపంచకప్‌లో ఇది పెద్ద సమస్య అవుతుంది. ఎందుకంటే అతను టీమిండియాకు ఫ్రంట్‌లైన్‌ ఆల్‌రౌండర్‌. గాయంతో బాధపడుతున్నప్పుడు జట్టులోకి ఎలా తీసుకుంటారు. రూల్స్‌ ప్రకారం హార్దిక్‌ ఎస్‌సీఏకు వెళ్లి ఫిట్‌నెస్‌ నిరూపించుకొని తిరిగి రావాలి. ప్రతీ ఆటగాడి విషయంలో ఇదే వర్తిస్తుంది. మరి పాండ్యా విషయంలో అదెందుకు జరగలేదు. దీనికి బీసీసీఐ సమాధానం చెప్పాలి'' అంటూ తెలిపాడు. ఇక అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకు యూఏఈ, ఒమన్‌ వేదికగా టి20 ప్రపంచకప్‌ జరగనుంది. టీమిండియా తన తొలి మ్యాచ్‌ను అక్టోబర్‌ 24న పాకిస్తాన్‌తో ఆడనుంది.

చదవండి: బౌండరీ కొట్టగానే శ్రీశాంత్‌ స్టైల్‌ను దింపేశాడు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement